Saturday, 6 January 2018

అనువాద సౌరభం-29.
Introduction:-
          నేను 2013 నుంచి కవిత్వం రాస్తున్నా. ఇంటర్మీడియట్ వయసులో రాసిన ఆ తర్వాత చదవడం కొనసాగింది. 2016 లో కరీంనగర్ కవి మిత్రులు ప్రోత్సహించారు. ఈ నేపథ్యంలో “నది పలికిన వాక్యం” కవిత్వ సంకలనం వేసాను. పోయిన సంవత్సరం ప్రపంచ తెలుగు మహాసభల్లో నానీల నిప్కలు ఆవిష్కరణ  చేద్దాం అనుకున్న. కానీ నా సమస్యల కారణంగా వీలు కాలేదు.  బహుశా ఈ నెలలో ఆవిష్కరణ ఉంటుంది.  ఇది క్లుప్తంగా నా పరిచయం. ఇంకా రెండు మూడు సంపుటాలు వేయగలిగిన కవిత్వం ఉన్నది. వీలును బట్టి వేస్తాను.

          ఇక అనువాదం విషయానికి వస్తే 28 వారాల క్రితం ఒక గ్రూపులో ప్రారంభించాను. కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఆ గ్రూపులో నుంచి బయటపడిన వారం క్రితం.  నేను ఒక పని మొదలు పెట్టాను అంటే దాదాపు వదిలెయ్యను. అందుకే ఈ రోజు నుంచి వారంతో సంబంధం లేకుండా నా ఫేస్ బుక్ గోడపైననే పోస్ట్ చేస్తూ ఉంటాను. నేను ఇంకా అనువాద మెలకువలు నేర్చుకుంటూనే ఉన్న.  ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పమని పెద్దలకు మనవి.

     ఈ కవిత అనువాదం రెండు నెలల క్రితం చేసిన.  పోయిన నెలలో వేరే రాష్ట్రంలో ఒక కవి సమ్మేళనం లో పాల్గొన వలసి ఉండె. కానీ నా సమస్యల కారణంగా వీలు కాలేదు.  ఆ సందర్భంగా నా ఈ కవిత అనువాదం చేసిన. ఈ కవిత మూడేళ్ళ క్రితం రాసినా ఇప్పటి సమాజంలో అలాగే ఉన్నయి పరిస్థితులు.


What is This?
~~~ ~~~~~~~~
          Telugu Poet:- Vilasagaram Ravinder.
          Translated By Vilasagaram Ravinder.

Man is dying ...
Covering with religious beliefs
Encouraging with caste systems

What else
Man is unseen permanently
Without shedding teardrops ruthlessly...

Man is dying...
Without love and affection
Without giving the last lovable farewell...

Man is dying...
In the hands of ISM’s iron rods
He is cutting his head by himself
Unnecessary pleadings
He is dying...
He is hewing...
He is killing himself...
He is vanishing himself...

======== ========= ========== =======

Telugu Original poem:

ఏమిటిది?
~~~~~
       -విలాసాగరం రవీందర్.

మనిషి మరణిస్తున్నడు
మతం ముసుగేసి
కులం కుంపటి ఎగేసి.

కారణం ఏదయితేనేం
మనిషి రాలిపోతున్నడు.
కన్నీటి చుక్కలు కాకుండానే
మనిషి మాయమయితున్నడు
ఆత్మీయ వీడ్కోలు లేకుండానే.

ఇజాల ఇనుప పంజరంలో ఇరుక్కొని
తనను తాను తెగ నరుక్కుంటున్నడు.
పిడి వాదాల శరాలతో
తన తలను తానే పెకల్చుకుంటున్నడు.

తేది:20-05-2015 తేదిన రాసిన కవిత.

"నది పలికిన వాక్యం" సంకలనం లోని కవిత్వం.
======== =========== ========== =======

అనువాద సౌరభం-28 పెనుగొండ సరసిజ గారి కవిత

అనువాద సౌరభం-28
~~~~~~~~~~~~
Introduction:-

       పెనుగొండ సరసిజ గారు చాలా కాలం నుంచి కవిత్వం రాస్తున్నారు.  సాహితీ ప్రపంచంలో పెనుగొండ బసవేశ్వర్, సరసిజ దంపతులు కవిత్వం,  కథలు రాస్తున్న మరొక సాహితీ దంపతులు. వీరు ఇరువురు త్వరలో కవిత్వ సంకలనాలు వేయనున్నరు. పెనుగొండ సరసిజ గారు కరీంనగర్ సిటీ కేబుల్ లో వార్తలు చదువుతారు.  కవిత్వం రాస్తున్నారు.  కథలు కూడా రాస్తారు.

ఈ కవిత వారు ఈ మధ్యలో నే రాసినరు.  పెళ్ళి అయ్యాక కొత్తగా వచ్చిన వివిధ పరిస్థితులపై కొత్త కుటుంబ సభ్యులు ఎలా ఉంటరు, వారి ప్రేమ ఆప్యాయత ఈ కవితలో మనం గమనించవచ్చు.

Sky Like Memories...
~~~~~~~~~~~~

       Telugu Poet: Penugonda Sarasija
       Translated By Vilasagaram Ravinder

When
My mind turned into New Bridegroom
He made me not only happy but came also near to my heart...
The Nieces were like street friends at that time
Some Decency...
Some fear...
Some Own feelings
Some rightness...
The newly introduction
That made the total lifetime home
The Home of my Mother In law's...

...

When
We turned the street turning...
The Hibiscus flowers were seen like full moonlight
They welcomed us like their lovers...

...

The Marigold flowers
which were around the home
They were like flowers
of the mother's hair dressers...
They made that like beautiful home...

....

In between the home
In the Canopy
The Jasmines were weaving
Like the Young Lady's Beautiful Inert
The twisting and the twirling...

...

On the early mornings
On the the Winter Days
My Hand palms
are heaten And touching my cheeks
Are like my husband's kisses
Feelings
They turned into red roses...

...

However
Presently no Home of My Mother In law's is there
Yet
Our Landmarks are very
High Like Sky...
In our memories...
Remains...

========== ============ ==========

Telugu Original poem:-

///ఆకాశమంత జ్ఞాపకం///

కొత్త పెళ్ళికూతురైన నా మదిని
మురిపించిన మనసైనవాడు
దస్తీబిస్తీ ఆటల్లో
జట్టువిడవని జతగాళ్ళలా ఆడబిడ్దలు
కొంచెం బిడియం...
కొంచెం భయం ....
కొంచెం స్వంతం...
కొంచెం హక్కులా...
కొత్తగా పరిచయమై..
మొత్తంగా అయిన అత్తారిల్లు...

...

మూలమలుపు తిరగ్గానే కనిపించే
ముద్దగా పూసిన మందారాలు
ప్రియురాలి కోసమెదురొచ్చే
ప్రియుడిలా మమ్మల్ని ఆహ్వానించేవి.

...

ఇంటి చుట్టున్న బంతి చెట్లు
అమ్మ శిక చుట్టూ ముడిచిన
పువ్వుల్లా  ఇంటిని సింగారించేవి.

...

ఇక మధ్యలో పందిరికి పారిన
మల్లెతీగ, పడుచు పిల్ల వాలుజడలా
వయ్యారాలు బోయేది.

...

పొద్దు పొద్దునే మండే పొయ్యిలోని
సన్నని మంటకు వెచ్చచేసిన అరచేతులు
బుగ్గల్నితాకి తాకగనే మగని వెచ్చని
ముద్దులా తోచి చెక్కిళ్ళు ఎరుపెక్కేవి.

...

        అయితే
ప్రస్తుతానికి ఇప్పుడక్కడ
మా అత్తాగారిల్లు లేదు
కాని మా ఆనవాళ్ళు మాత్రం
ఆకాశమంత జ్ఞాపకంలా
ఇంకా మిగిలే వున్నాయి.

  -పెనుగొండ సరసిజ.

======== ========== ======== ======

https://www.facebook.com/groups/kavisammelanam/permalink/1493648740753446/

======== ========== ======== ======

Translated By Vilasagaram Ravinder.