అనువాద సౌరభం-2
~~~~~~~~~~~
ఈ గ్రూపులో ఇది నా రెండో అనువాదం. ఈ అనువాదం అన్నవరం దేవేందర్ సార్ ఈ మధ్యలో రాసిన “తల్లి వేరు”. ఈ కవితకు ప్రపంచ స్థాయి ప్రాముఖ్యత ఉంది.
అన్నవరం దేవేందర్ సార్ 2001 లో తన మొదటి కవిత్వ సంపుటి “తొవ్వ” నుంచి నిన్న మొన్నటి “ఇంటి దీపం” వరకు మొత్తం కవిత్వం 9 సంపుటాలు, ఒక సామాజిక వ్యాస సంపుటి వెలువరించినరు. వీరి కవితలను P. Jayalaxmi గారు “FARMLAND FRAGRANCE” పేర ఆంగ్లంలో అనువాదం చేసినరు. వీరి కవిత్వం పై ప్రముఖ సాహిత్య విశ్లేషకులు రాసిన ”వస్త్ర గాలం” ఒక వివేచన వ్యాసాల సంకలనం వెలుబడినది.
ఊరు గురించి ఎంత చెప్పినా తక్కువే. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఊర్లో మనుషులే కార్యకర్తలు, నాయకులు. సంఘ సంస్కరణ ఉద్యమాలకు తొలి బీజం గ్రామమే. అందుకే అన్నవరం దేవేందర్ సార్ ఊరును తల్లి వేరు అన్నరు.
వీరి ప్రస్తుత కవితలో 5వ ఖండికలో సమాజంలో సమాజ అసమానతలు తొలగింపు కొరకు చారిత్రక వ్యక్తులు గ్రామాల నుండి వస్తరు. దానిలో...
1. వంగర (మన దేశ మాజీ ప్రధాని, సాహిత్యకారుడు, బహుభాషావేత్త శ్రీ పి.వి.నర్సింహారావు గారి జన్మించిన గ్రామం),
2. మడికొండ (ప్రముఖ తెలంగాణ వైతాళికులు కాళోజీ నారాయణరావు పుట్టిన గ్రామం),
3. పెండ్యాల (ప్రముఖ సాహితీ వేత్త, సమాజం కోసం పోరాట యోధులు, ఉద్యమకారులు వరవరరావు జన్మించిన గ్రామం)
4. చింతమడక (తెలంగాణ ప్రధమ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమం కీలక నాయకులు శ్రీ KCR గారి స్వగ్రామం)
5. పాలకుర్తి (ప్రముఖ తెలంగాణ తొలి కవి పాల్కురికి సోమనాథుడు, తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత శ్రీమతి చాకలి ఐలమ్మల పుట్టిన ఊరు),
6. హన్మాజీపేట (జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత, ప్రముఖ దివంగత సాహితీ వేత్త శ్రీ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి జన్మ స్థానం),
7. అక్కంపేట (తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ శంకర్ ను కన్న ఊరు),
8. తుఫ్రాన్ (ప్రముఖ సామాజిక వేత్త, ప్రజా గాయకుడు శ్రీ గద్దర్ గారి పుట్టిన ఊరు). ఇలాంటి అనేక అంశాల గురించి ఎన్ని వ్యాసాలు రాసినా తక్కువే. అందుకే ఇక అనువాద సౌరభంలోకి వెళదాం రండి ఉల్లాసంగా...
Translation Poem:-
The Mother Roots
~~~~~~~~~~~
Telugu Poem Poet: Annavaram Devender
Translation: Ravinder Vilasagaram
1.
On the hardships of villages..
The cities blossoming fragrances!!
The flourishing blooms
The smiles of the towns...
The villagers are jasmine buds
2.
It's the Village which sway away the starvings...
It's the oxygen..
It's the mother root of everyone.
And to the all ...
3.
The Village means the Limbus of men's loves...
The Village means the bull, the agriculture, the plough, the fields...
The Village means the trees, the hills, the ponds, and the birds...
4.
Street by Street the Thoughts of steps...
The Ideas give birth at the plinths of houses...
Four Chats Summary
The Village and the Street,
If they unite the revolutionary festival(Bonaalu) begins...
5.
The Magnum Opus plants from the Village Soul...
Vangara, Madikonda,
Pendyaala, Chintamadaka,
Paalakurthy, Hanmaajipeta,
Akkannapeta, Tufram............, .......
Every Village is the birth root of a historical Champion...!
6.
The Village is the Dias of cultural flourish
The Village is the Stage of folk Singers
The Village is the Generations of Literatures leads next.....
The twesting green green small paths...
7.
The Village Banyan shades share cool cool Airy...
The Village pond canals caters the fields thirsty
The Village is the junction of secret and public revolutionary Inly,
The Village is the Labour of All persons....
The Village is the work of All People....
=====================================
Original Telugu Poem:-
తల్లి వేరు
~~~~~
పల్లె పరిశ్రమిస్తేనే పట్నం పరిమళం
పల్లె వికసిస్తేనే నగరం నవ్వు మొకం
పల్లీయులు తెలతెల్లని బొడ్డు మల్లెలు.
ఊరే కదా లోకం ఆకలి తీర్సేది
ప్రపంచానికి ప్రాణ వాయువునిచ్చేది
ఊరు ఎవలకైనా తల్లి వేరు!
ఊరంటే మమకారపు మనుషుల కూడలి
ఊరంటే ఎద్దు, ఎవుసం, నాగలి, పొలం
ఊరంటే చెట్లు, గుట్టలు, చెరువులు, పిట్టలు
వాడ వాడలా ఆలోచనల అడుగులు
ఇండ్ల అరుగుల మీదనే ఇగురాలు
నాలుగు ముచ్చట్ల సారం
ఊరూ వాడ
ఏకమైతే... ఉద్యమ భోనాలు!
ఊరి మట్టి నుంచే మహత్తర మొలకలు
వంగర, మడికొండ, పెండ్యాల, చింతమడక,
పాల కుర్తి, హన్మాజీపేట, అక్కంపేట, తుఫ్రాన్
ఒక్కొక్క ఊరు జగజ్జేయుని కన్న వేరు !
ఊరొక సాంస్కృతిక వికసన వేదిక
ఊరొక జానపదుల పాటల పందిరి
తరతరాల వాంగ్మయ వారసత్వం
అల్లుకున్న పచ్చ పచ్చని పిల్ల బాటలు.
చల్లదనాన్ని పంచి ఇచ్చే మర్రి నీడ
పొలం దూప తీర్చే చెరువు కాలువ
రహస్య బహిరంగ ఉద్యమాల అంతరంగం
ఊరంటే బహు జనుల రెక్కల కష్టం.
-అన్నవరం దేవేందర్,
9440763479.
Translation in English:
-Vilasagaram Ravinder.