Sunday, 24 December 2017

అనువాద సౌరభం-27 వర్చస్వి సార్ పోయెమ్

అనువాద సౌరభం-27.
(ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రత్యేకం)
Introduction:-
       వర్చస్వి గారు కవి, కథకులు,  చిత్రకారులు,  వ్యంగ్య చిత్రకారులు, అనువాదకులు. ఊపిరి సలపని లెక్కల శాఖలో ఉన్నత ఉద్యోగం చేస్తూ సృజనకారులుగా రాణిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి.
      వీరు ఇంతవరకు 1. వర్చస్వీయం ( తెలుగు విశ్వవిద్యాలయం ఆర్ధిక సహకారంతొ ప్రచురణ ) స్వీయ కథల సంపుటి, 2. లోకస్సమస్తా...(2014) కవితా సంకలనం,  3. ఒక కార్టూన్ల పుస్తకం (ఎమెస్కో పబ్లికేషన్స్ ద్వారా) వేసినారు. కొన్ని వ్యాసాలు కూడా వ్రాసారు. మరికొన్ని కవిత్వ, కథల,  అనువాద పుస్తకాలు వేయడానికి పూనుకుంటున్నారు.
    ప్రస్తుత కవిత వీరు చాలా కాలం క్రితం రాసారు.  డిసెంబర్ 15 నుంచి 19 వరకు హైదరాబాద్ లో జరిగే మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు వర్తించే విధంగా ఉన్న గొప్ప కవిత.  వారు ఈ మధ్యలో పోస్ట్ చేసారు. ఈ కవితను నేను వ్యాఖ్యానం చేయాలంటే మళ్ళీ అదో వ్యాసం అవుతుంది.  అక్షర శక్తి గురించి,  సాహిత్యం ప్రపంచాన్ని ఏ విధంగా ఏకం చేస్తుందో, సాహితీ ప్రక్రియలలో కవిత్వం ఒక విలక్షణమైన ప్రకృయ. చివరగా కవిత్వం విశ్వజనీనమైనవి,  విశ్వంభరం అవుతుంది అని చెప్తారు.
    ఈ అనువాదం విషయానికి వస్తే నేను అనువాదం చేసి దాన్ని పరిశీలించమని మరొక అనువాదక మిత్రునికి పంపినాను. వారు దాన్ని పరిశీలించి వారు మరొక అనువాదాన్ని పంపినారు. ఈ క్రింది విధంగా అవి ఉన్నవి.


Universe...
      Telugu Poet: Varchaswee.

When the character of the alphabet
Standing regal in crystal clear
On the horizon

When the churning of alphabets
sweeping the latitudes and longitudes

When the ends of the arcs of starts
In the wards of galaxies
Are touching the poles

When the Conglomeration of continents
Is cooking poesies in capacious pails

In the desert fields
In the river minds
In the Ghats and Valleys
In the Plateau Streets
Taking the poetry tongue In the bags
Wandering by the world pedestrians
Welcomes and welcomes

Character of the alphabet becomes
One Door at that times...
This time is that uniting into the universal One

Special thanks to the excellence of the world poetry

======== ======= ========= =======
Second Translation:-

Universe...
  Telugu Poet: Varchaswee.
   
When
Character of the alphabet is
clear in this
earth It is
very Perspective -

When
The character of the alphabet is digging
And Smashing
the Lines of latitude
and longitudes -

In the world of literature
The Arcs of Stars
Tactful the Poles -

All the Continents
allegro the poetry Cooks
in the Universal Bowl -

All the literatures
united All the tangents
for One -

In the desert fields
In the river minds
In the Ghats and Valleys
In the Plateau Streets
Taking the poetry tongue In the bags
Wandering by the world pedestrians
Welcomes and welcomes

The character of the alphabet becomes
One Door at that times...
This time is that uniting into the universal One

Special Thanks
to the excellence
of the World Poetry...

======= ======== ======== ===========

Original Telugu poem:-

//విశ్వంభరం //(ప్రపంచ మహాసభల సందర్భం...కాబట్టి, నా పాత కవితే)

అక్షరం క్షితిజంపై స్పష్టంగా
దృగ్గోచరమౌతుంటే -

అక్షర మధనం
అక్షాంశ రేఖాంశాల్ని చెరిపేస్తుంటే -

సాహితీ విను వీధుల్లో
నక్షత్ర చాపం రెండు ధృవాల్నీ
స్పర్శిస్తుంటే -

ఖండ ఖండాలు కవితాదరువులు
అఖిలాండ భాండంలో వండుతుంటే -
అక్షర చక్రభ్రమణం
దివారాత్రాలూ
భావచిత్రంగా చిత్రిక పడుతూంటే
సాహితీ సమాంతరాల్ని
ఒక ఏకీకృత తిర్యగ్రేఖ కలుపుతు పోతూ వుంటే -

ఎడారుల మడులలోనైనా
నదీ నదాల ఎదలనైనా
కనుమల లోయలనైనా
పీఠభూముల వాటికలలోనైనా
కవితా గొంతును సంచిలో  వుంచుకు
తిరిగే ప్రపంచ బాటసారిని...
స్వాగతించే హేల!
అక్షరం ఏకైక గవాక్షం అవుతున్న వేళ!!
అక్షరాన్ని విశ్వంభరంగా
చేస్తున్న వైనం ఈ దినం!
ప్రపంచ కవితా మతల్లికి ఇదే నా నీరాజనం...!!.
         -వర్చస్వి.
       ======= ======= ========= =========


https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1487087264742927

======= ======== =========== ======
English Translations...

Saturday, 16 December 2017

అనువాద సౌరభం-26

అనువాద సౌరభం-26.

Introduction:-

      కట్టా శ్రీనివాస్ గారు వృత్తి రీత్యా ఆంగ్ల ఉపాధ్యాయులు. వీరు 2001 లో “మూడు బిందువులు” 2012 లో “ మట్టి వ్రేళ్ళు” సంకలనాలు ప్రచురించారు. వీరి కుమార్తె అక్షిత కూడా రచయిత్రి. ఒక కవిత్వ సంకలనం వేసింది.

   ఇక ప్రస్తుత కవిత అనువాదం విషయానికి వస్తే ఒక ఆంగ్ల ఉపాధ్యాయుల కవితను అనువాదం చేయడం సాహసమే.  ఈ కవిత ఒక విశ్వజనీనమైనది. మనల్ని మనం పారుసుకోవడం మళ్ళీ మళ్ళీ మనమే వెతుక్కోవడం ప్రతి మనిషి చేసే పనే. అనుభూతి ప్రధానమైన విషయం ఈ కవిత నిండా ఉన్నది.  జీవితం నిండా అనుభవాలు వెంట తీసుకెళ్ళుతుంటాం. అప్పుడప్పుడు పారేసుకుంటం. మళ్ళీ వెతుక్కోవడం మామూలే. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ కవిత నిండా మనకు ఒక తాత్విక చింతన కనిపిస్తుంది.

See me off...
~~~~~~~~~

   Telugu Poet: Katta Srinivas
    Translated By Vilasagaram Ravinder.

To enjoy happiness in searching
See me off somewhere...
Again and again ...

When dried in thirsty and
Want to wet in Love rain with chatting...
Jumped into with keen eyes...

When the path visible for sight
I pricked the reins like brutal bull (Ganugeddu)...
As it was dangerous

I extracted my heart
And tie it to my leg as life resounding
When I didn't hear my leg sounds
For a Short Time...
While walking...

I felt happy as reach home
When I raised a question of Why?
Even I did More and more...

To search myself
See me off...
Again and again...

So that I live till now
So that I can touch myself
Yes
Because of that
I also reveal you...
I also indicate you...

========= ======== ========== =========
Original Telugu poem :-

కట్టా శ్రీనివాస్ || నన్ను నేనే పారేసుకుంటాను ||

వెతుక్కోవడంలో ఉన్న
సంతోషాన్ని ఆస్వాదించేందుకు
మళ్లీ మళ్లీ పారేసుకుంటుంటాను.

దాహంతో ఎండిపోయి
మాటల్లో కురిసే ప్రేమవర్షంలో తడవాలనిపించినప్పుడల్లా
కళ్లలోతుల్లోకి దూకేస్తాను.

గానుగెద్దులా నా నడక దారి
కనిపించినప్పుడల్లా
ప్రమాదమైనా సరే
పగ్గాలు తెంపుకుంటాను.

కొద్దికాలమైనా నడుస్తున్న
ఇదే దారిగుండా నా అడుగుల
నాదం వినిపించకపోతే
గుండెనంతా పెకలించుకుని
కాలిమువ్వగా కడతాను.

ఎన్ని చేసినా
ఎందుకనే ప్రశ్నలో మునగటంతో
ఇంటికొచ్చినంత సంబరపడతాను.

నన్ను నేనే వెతుకులాడుకునేందుకు
మళ్లీ మళ్లీ పారేసుకుంటాను.

అందుకే నేనింకా బ్రతికే వున్నాను.
అందుకే నన్ను నేను తాకగలుగుతున్నాను.
అందుకే అందుకే అందుకే
నేను నీక్కూడా కనిపిస్తున్నాను.

======= ========== ======== =====
Translated By Vilasagaram Ravinder.

Wednesday, 6 December 2017

అనువాద సౌరభం-25 కృష్ణ పి.వి గారి పోయెమ్

అనువాద సౌరభం-25
 Introduction:

      పి.వి. కృష్ణ గారు ఒంగోలు వాస్తవ్యులు. ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక  65 సంవత్సరాల వయసులో ఇప్పుడు కవిత్వం చదువుతూ కవిత్వం రాయడం మొదలుపెట్టినరు. వీరు మానవతావాదలు. సమాజాన్ని జాగ్రత్తగా గమనిస్తూ సమ సమాజం కోసం ఎదురు చూస్తున్నారు.

   ప్రస్తుత కవిత మానవ లక్షణాలను తెలుపుతది. ఒంటరిగా వచ్చిన మనిషి సమూహంలా మారి ఆ తర్వాత స్వార్థం కారణంగా ప్రకృతి విధ్వంసం చేయడం మనకు తెలిసిన విషయమే.  ఇప్పుడు ఇంకా ఎంత వినాశనానికి పూనుకుంటడొ అంతుచిక్కడం లేదు. ఇక అనువాద సౌరభం లోకి వెళదాం.

The Filmi  Peculiar Poem.
======== ============
        Telugu Poet : Krishna Pv
        Translated by Vilasagaram Ravinder.

A new Planet was
born in this Universe
One Day.

That Planet was
delivered a new live as.

That live becomes so
many lives and so
on.

In that One live behaviour changes
It behaves
strange and various

They behaved that
The Earth
The Sky
The air,
The Water and all are their.

That lives destroyed
the half of the life time wealth.

They wanted
to blast the remaining whole
to ruin the total wealth
as the fraudness touch the peak
In that
The waste live
The worst live..

======= ======== ======== ========
Telugu Original poem:-

విశ్వములో చిత్ర
విచిత్ర కవిత.
---
విశ్వములో ఓ రోజు
విశ్వం ఓ విచిత్ర గ్రహన్ని
అవిర్భవించింది.

ఆ గ్రహం ఓ రోజు
ఓ జీవికి
పురుడుపోసింది.

ఆ జీవి జీవాలయి
విస్తరించింది.

ఆ జీవులులో ఓ జీవి
ఓ రోజు చిత్రంగా
ప్రవర్తించడం
మొదలు పెట్టింది.

కొద్ది కాలములో
భూ, జల, వాయు,
ఆకాశాలు నావే అని
ఘుకరించింది.

స్వార్ధముతో ఆ జీవి
అర్ధ భాగం జీవ సంపదను
ధ్వంసం చేసింది.

తన స్వార్ధం పరాకాష్టకు
చేరి మిగిలి సర్వాన్నిఅంతం
చేయసంకల్పించింది
జీవులులో తప్ప పుట్టిన
ఈ నికృష్టపు ఈ జీవి.

పి. వి.కృష్ణ..

========= ========== ========= ===
https://www.facebook.com/groups/kavisammelanam/permalink/1472244936227160/
============ ========= ===========
Translated by Vilasagaram Ravinder.