Saturday, 16 December 2017

అనువాద సౌరభం-26

అనువాద సౌరభం-26.

Introduction:-

      కట్టా శ్రీనివాస్ గారు వృత్తి రీత్యా ఆంగ్ల ఉపాధ్యాయులు. వీరు 2001 లో “మూడు బిందువులు” 2012 లో “ మట్టి వ్రేళ్ళు” సంకలనాలు ప్రచురించారు. వీరి కుమార్తె అక్షిత కూడా రచయిత్రి. ఒక కవిత్వ సంకలనం వేసింది.

   ఇక ప్రస్తుత కవిత అనువాదం విషయానికి వస్తే ఒక ఆంగ్ల ఉపాధ్యాయుల కవితను అనువాదం చేయడం సాహసమే.  ఈ కవిత ఒక విశ్వజనీనమైనది. మనల్ని మనం పారుసుకోవడం మళ్ళీ మళ్ళీ మనమే వెతుక్కోవడం ప్రతి మనిషి చేసే పనే. అనుభూతి ప్రధానమైన విషయం ఈ కవిత నిండా ఉన్నది.  జీవితం నిండా అనుభవాలు వెంట తీసుకెళ్ళుతుంటాం. అప్పుడప్పుడు పారేసుకుంటం. మళ్ళీ వెతుక్కోవడం మామూలే. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ కవిత నిండా మనకు ఒక తాత్విక చింతన కనిపిస్తుంది.

See me off...
~~~~~~~~~

   Telugu Poet: Katta Srinivas
    Translated By Vilasagaram Ravinder.

To enjoy happiness in searching
See me off somewhere...
Again and again ...

When dried in thirsty and
Want to wet in Love rain with chatting...
Jumped into with keen eyes...

When the path visible for sight
I pricked the reins like brutal bull (Ganugeddu)...
As it was dangerous

I extracted my heart
And tie it to my leg as life resounding
When I didn't hear my leg sounds
For a Short Time...
While walking...

I felt happy as reach home
When I raised a question of Why?
Even I did More and more...

To search myself
See me off...
Again and again...

So that I live till now
So that I can touch myself
Yes
Because of that
I also reveal you...
I also indicate you...

========= ======== ========== =========
Original Telugu poem :-

కట్టా శ్రీనివాస్ || నన్ను నేనే పారేసుకుంటాను ||

వెతుక్కోవడంలో ఉన్న
సంతోషాన్ని ఆస్వాదించేందుకు
మళ్లీ మళ్లీ పారేసుకుంటుంటాను.

దాహంతో ఎండిపోయి
మాటల్లో కురిసే ప్రేమవర్షంలో తడవాలనిపించినప్పుడల్లా
కళ్లలోతుల్లోకి దూకేస్తాను.

గానుగెద్దులా నా నడక దారి
కనిపించినప్పుడల్లా
ప్రమాదమైనా సరే
పగ్గాలు తెంపుకుంటాను.

కొద్దికాలమైనా నడుస్తున్న
ఇదే దారిగుండా నా అడుగుల
నాదం వినిపించకపోతే
గుండెనంతా పెకలించుకుని
కాలిమువ్వగా కడతాను.

ఎన్ని చేసినా
ఎందుకనే ప్రశ్నలో మునగటంతో
ఇంటికొచ్చినంత సంబరపడతాను.

నన్ను నేనే వెతుకులాడుకునేందుకు
మళ్లీ మళ్లీ పారేసుకుంటాను.

అందుకే నేనింకా బ్రతికే వున్నాను.
అందుకే నన్ను నేను తాకగలుగుతున్నాను.
అందుకే అందుకే అందుకే
నేను నీక్కూడా కనిపిస్తున్నాను.

======= ========== ======== =====
Translated By Vilasagaram Ravinder.

No comments:

Post a Comment