Friday, 13 April 2018

అనువాద సౌరభం-37

అనువాద సౌరభం-37.
==============

Below One Shawl...
~~~~~~~~~~~~

 Telugu Poet: విరించి విరివింటి
 Translated By Ravinder Vilasagaram.

Poet...
We should keep some things
in their place Sometimes
You are standing in the place of no rays of Sun
You should know the darkness of your words of your poetry.

You don't like that Kavisammelanams,
The poets meetings
You don't like the poems on first rainfall,
The songs of cuckoo's again and again
Your revolutionary ideology didn't same as
The meetings of UGADI poets.

In that meetings
No one listen your poem
N' they honour you with flower beds,
Shawl and give to your hand a Shield with the plastic smiles in the way of tradition...

Oh! See that side,
Where the rays of Sun not touched side
There are so many dark shades
For the faded Flower Beds
For the hundred rupees Shawl
For that oldest Shield
Coming from far away places
See that great Women

Who recognised her great readability ?
Who agreed her enthusiasm towards education?
As she knew that
Her all great educational degrees
Only for 'Wife's Job'
Who regained her dead life wishes?

Where there are no big laughs
Where there are no freedom to tell her wishes
Taking Pen with her hand is
She is watching her in that white papers
It is not a revolution on your papers...!
Do you think how many doing works
In between her thoughts?
Do you observe how many times
She hides her swords like pens ?

"What does she uplift Writing now ?"
"We see the peaceful inhabitants of husband and wife,
What is this nonsense/fanciful? "
Mother in law's canines
Sister-in-law's flout Smiles
He uses how many words
How many illations
Is she a breakout lover
How many questions
How many assumptions?

Did she come for a flower bed
Running there ?
Did she escape from her own house illations ?
Did she came for read her poems at once?
Did she want one flower bed, one shawl?
Did she feel the recognition for her knowledge and education ?
May be !
Did she like to take a photograph with a great poet ?
Did she know that she will not get permissions later ?

She come alone to the Poet meetings,
in the day time by losing her family prestige

Which poem she will read N'
Which poem she will not read
To decide her husband will turn as a literary critique
May be...! This is the well-known fact to All.
Poetry will not feed you at all.

Poet...!

She would place as Spring
Where there are no UGADI festivals
Where there are no lights
She would win as the revolution
She would show her Shawls N' Shields to her family members
N' understand to them her writing profits.

She would fight with the society
To wear a Shawl n' prove herself as a poetess

So
We should keep some things in their place
Poet...!

============== ================ ==

Original Telugu poem:-

  ll ఒక శాలువా కింద ll
----------------------------------------
                      విరించి విరివింటి

   
కొన్నిసార్లు,
ఏదెక్కడుండాలో
దానిని అక్కడే ఉండనీయాలి కవీ...
రవికాంచని చోట కూర్చున్నవాడివైనా
నీ పదాల చత్వారాన్ని
కవిత్వంలో గమనించుకోవాలి.

నీకా కవి సమ్మేళనాలు రుచించక పోవచ్చు.
తొలకరి వానల మీద, కోయిల పాటల మీద
పదే పదే రాసిన కవితలు నీ చెవులను హోరెత్తించ వచ్చు.
ఉగాది కవిత్వ వేదికలు
నీ విప్లవ పంథాకు సరిపోలక పోవచ్చు.

నీవెక్కిన వేదికల మీద
నీ కవితలు వినకుండానే
ఒక పూల దండ, ఒక శాలువా వేసి
ఇంకో షీల్డు చేతిలో పెట్టి
ప్లాస్టిక్ నవ్వులు నడుమ
అంతా 'మమ' అనిపించి ఉండవచ్చు.

అరే...ఓసారిటు చూడు.
రవికాంచని చోట్లలో నల్లటి నీడలు చూడు
ఓ వడలిన దండ కోసం
ఈ వందరూపాయల శాలువా కోసం
అదే పురాతన షీల్డు కోసం
ఎంతెంత దూరాలనో దాటొచ్చిన
ఆ మహిళామణులను చూడు.

ఆమెంతటి చదువరో ఎవరైనా ఎపుడు గుర్తించారుగనుక?
చదువుకుంటానంటే ఎవరామెను అనుమతించారుగనుక?
చదివిన గొప్ప చదువులన్నీ
ఒక 'భార్య ఉద్యోగం' కోసమని ఆమె తెలుసుకున్నాక
చచ్చిపోయిన జీవితాశయాల్ని ఎవరు తట్టిలేపారు గనుక?

ఒక ఆడది గట్టిగా నవ్వలేని చోట
ఎలుగెత్తి తన ఇష్టానిష్టాల్ని ప్రకటించలేని చోట
కలం పట్టుకోవడమంటే...
కాగితం మీద తనను తాను చూసుకోవడమంటే..
నీ కాగితాలమీది విప్లవం వంటిదేంకాదే...!
ఎన్నెన్ని ఇంటి పనుల ఒత్తిళ్ల నడుమ బుర్ర పని చేయాలో ఆలోచించావా?
కత్తుల్లాంటి కలాల్ని ఎన్ని సార్లు దాచుకోవాలో పరికించావా?

"ఇపుడు రాసి ఏం ఉద్ధరించాలట?"
"గుట్టుగా సంసారం చేసేవాళ్లని చూశాంగానీ...ఇదేం చోద్యమమ్మా?"
అత్తగారి మూతి విరుపులు నడుమ
ఆడపడుచుల వెకిలి నవ్వులు నడుమ
ఆయనగారెన్ని పదాలను ఎంతెంత అనుమానంగా చూస్తుంటారో...
భగ్న ప్రేమికురాలేమోనని ఇంకెన్ని ఆరాలు తీస్తుంటారో...

ఆమె అంతంత దూరం నుంచి ఒక పూల దండ కోసం
పరిగెత్తుకొచ్చిందా?
సొంతింటి అవమానాల నుంచి పారిపోయి వచ్చిందేమో.
రాసిన కవితల్ని ఏక బిగిన చదివేయడానికి వచ్చిందా?
లోపలున్న బాధలన్నిటినీ ఏకరువు పెట్టడానికొచ్చిందేమో.
ఒక శాలువా కోసం ఒక షీల్డు కోసం అర్రులు చాచిందా?
తన చదువుకూ తన తెలివి తేటలకూ ఇన్నేళ్లకు దొరికిన గుర్తింపనుకుందేమో...
అక్కడుండే పేరు గొప్ప కవితో ఒక్క ఫోటో కోసం పాకులాడిందా
మరలా ఇంటినుంచి ఈ అనుమతులు రావని తెలుసుకుందేమో...

పట్టపగలు నడిరోడ్డుమీద జరిగే కవి సమ్మేళనాలకు
ఆమె ఒంటరిగా రావడానికి
ఎన్ని కుటుంబ గౌరవాలు మంటగలవాలో..
ఏ కవితను చదవాలో...ఏది చదవకూడదో చెప్పడానికి
భర్తగారెంతటి మహా విమర్శకుడవ్వాలో..
అందరికీ తెలిసిన విషయమే..
కవిత్వమేమీ కూడు పెట్టదుగా?

కవీ...!!
ఆమె ఉగాదులు లేనిచోట
ఉషస్సులు లేనిచోట
వసంతమై నిలవాలి.
ఉద్యమమై గెలవాలి.
శాలువాలనూ, షీల్డులనూ
ఆమె ఇంటిలో చూపుకుని తన రాతల వెనుక ఉన్న లాభాన్ని ప్రదర్శించు కోవాలి.
ఒక శాలువా కప్పుకుని ఆమె కవయిత్రిగా నిలబడాలంటే...
ఈ సమాజంతో ఒక యుద్ధమే చేయాలి.
అందుకే కొన్నిసార్లు
ఏదెక్కడుండాలో దానిని అక్కడే ఉండనీయాలి కవీ..!!

26/3/18
============== ===================
Translated By Vilasagaram Ravinder.

Friday, 9 March 2018

అనువాద సౌరభం-36 పెనుగొండ బసవేశ్వర్ కవిత

అనువాద సౌరభం - 36.

Meaningless Sacrifice
~~~~~~~~~~~~~~~
        Telugu Poet: Penugonda Basaveshwar
        Translated By Ravinder Vilasagaram

As You neglecte your health continuously
That makes you as illness's address ruthlessly.

You work hard to make wealth for your near and dear innocently
That makes you the poorest of the poor
And remains you alone.

You write bundle of poems for the sake of the fellowmen
As the sword's man in the battle field
That makes you the bundle of wounds which doesn't appear.

You stand firmly in the Quicksand for the sake of your near and dear
and makes them greater
That looks like the waste adventure
That thrown-away you in the breathing disease (asthma)
And it abducts your breathing.

You gave all the wealth to them for the giving birth
As the waste sacrifice
It stood you in the foodless plate in your home
For minimum love.

You are now an orphan in the presence of all of your near and dear in your own home
You didn't move
The tears are pouring
They are like Fetters.

So you have to realise
You have to blossom now
even the small Smile Flowers on your face
for the sake of you
In this remaining life.

The poems are learnt the world the revolutions
You made them as the weapons
And throw on the unseen foes in the cold wars.

You distroy your interests and hobbies
And live the life like stopping candle
You have to lit some lights
Before your last journey.

========= ========== ============ ======

//నిరర్థక త్యాగం//

నీవు నిర్లక్ష్యం చేసి పట్టించుకోకుండా
వదిలేసిన నిలువెత్తు శరీరం నిన్ను 
అనారోగ్యానికి అడ్రస్ లా నిలబెట్టింది.

అయినవారికీ ఆస్తులు సంపాదించాలని
ఆపసోపాలు పడిన నీ అమాయకత్వం
నిన్ను ఎవరికీ కాని పేదని చేసింది

కవిత్వంతో సాటివారికై యుద్ధం
చేసిన కలం నీ ఒంటి నిండ
కనబడని గాయాలు చేసింది

ఊబిని పెకిలించుకు నిలబడి
నీవాళ్ళను పైకి తెచ్చేదుస్సాహసం
నీ ఊపిరికి ఆస్తమాలా అడ్డుపడుతోంది

కన్నందుకు ఉన్నదంతా కలిపి
పంచిపెట్టిన నీ నిరర్థకత్యాగం కనీస ప్రేమకై
ఖాళీ కంచంతో నట్టింట్లో నిలబెట్టింది

అందరూ ఉన్న అనాధాలా
బతుకు ఈడుస్తున్న స్వగృహాశ్రమంలో
కదలనివ్వని కన్నీళ్ల సంకెళ్లు

ఇకనైనా మిగిలిన కాస్త జీవితంలో
నీకోసం కొంచెమైనా మిగిలి, ఒంట్లో
నిజమైన నవ్వులు పూయించు

ప్రపంచానికి పోరాటం నేర్పిన అక్షరాలను
కనబడని శత్రువులపై ప్రచ్ఛన్నయుద్ధం చేసే
ఆయుధాలుగా ప్రయోగించు

కోరికలు చంపుకుని కొడిగట్టిన దీపంలా
రోజులు గడుపుతున్నావు, కొండెక్కేిలోపైనా
కొంచెమైనా నీలో వెలుగు నింపు.

(కుటుంబం కోసం కొవ్వొత్తిలా కరిగిపోతున్న ఓ సోదరికి)

                             -పెనుగొండ బసవేశ్వర్
======= ========= ======= ========== ====
Translated By Vilasagaram Ravinder.

Tuesday, 6 March 2018

అనువాద సౌరభం-35

అనువాద సౌరభం-35.

Alishetty's Poetry / Bhagya Laxmi...

    Telugu Poet: Alishetty Prabhakar.
    Translated By Vilasagaram Ravinder.

I didn't know Bernald Shaw, Shakespeare
She didn't know Gudipati Venkataachalam, Gurajaada...
Both of us are Very innocent Persons...

But
She knew the technique of how would light the stove without the kirosine...
I knew the the technique of how would write the poetry when it had been coughing with the blood oozing....in breath...

Both of us mingling as One in Dream
Both of us  tore the rainbows and ate in the same plate in those days...

When there were no problems burning
She put me as a flower in her head when I was as the cigarette butt...
She lit the Instance Stick Wishes
of my Eyes when they were blinking as
Glass Baskets...

She didn't want the lots of wealth...
Or
She didn't want a cent of the Golden ornaments
She didn't ask me any time
She didn't request me any time...

========= ========= ======= ===========
Translated By Vilasagaram Ravinder.

అనువాద సౌరభం-34 అలిశెట్టి ప్రభాకర్ గారి కవిత్వం

అనువాద సౌరభం-34.

Alishetty's Poetry  / Come with me...

    Telugu Poet: Alishetty Prabhakar.
    Translated By Vilasagaram Ravinder.

Don't live
like Silence
In emptiness
Like Grave Yards

Don't die
In Scratching
the Memories
Oozing Gastritis

Come with me
Cooking the time fruits
On Tolerant Adventures
of Flames

======== ========= ======== ==========
Original Telugu poem:-

అలిశెట్టి కవిత్వం / నాతో రండి

శూన్యంలో నిశ్శబ్ధంలా
నిశ్శబ్ధంలో సమాధుల్లా
బతక్కండి

జ్ఞాపకాల రసి పుండ్లని
గోకటమే వ్యాపకంలా
చావకండి

నాతో రండి
సహనం సాహసం నిప్పుల మీద
కాలాన్ని ఫలంగా పండుకుందాం.

('మంటల జెండాలు' నుంచి)

======== ====== ========== ===========
Translated By Vilasagaram Ravinder.

అనువాద సౌరభం-33

అనువాద సౌరభం-33

Alishetty' Poetry / Plants...
      Translated By Vilasagaram Ravinder.

If the tears are sprouted from childhood
Be sprout
Be begin...

If they develop in the environment of
Tribulations
Be strong and
Be learn the growth...

But
I will not bear
If they stand as
Security Guards
in all the paths
After they grew Trees...
======= ======== ========== ======
Original Telugu poem :-

అలిశెట్టి కవిత్వం  /  మొక్కలు

బాల్యంలోంచి
కన్నీళ్ళు మొలిస్తే మొలవనీ
మొదలవనీ

అవి
కష్టాల వాతావరణంలోనే ఆరితేరి
ఎదగటం నేర్చుకోనీ

కానీ
చెట్లయ్యాక
రహదారి పొడవునా
ద్వారపాలకుల్లా బతికితే
నేనైతే సహించను.

========== ========= ========= ===

Translated By Vilasagaram Ravinder.

అనువాద సౌరభం-32 Ramana Velamakanna Sir Poem

అనువాద సౌరభం-32.

Mother's Lap
~~~~~~~~
   Telugu Poet: Ramana Velamakanni.
    Translated By Vilasagaram Ravinder.

Searching my childhood
I entered into that surroundings...
Searching my footsteps
Rememberings did not lost
After passed away five decades...

Remembering the great teacher Subbaiah Masteru
Who broke my back for my Studies...

Sparkling in my eyes the lovely teacher Pal Sir
Who touched my cheeks smoothly...

Resounding to my ears as  blessing words of Aham Aaham...
the unforgettable teacher Shashsri Guru
Who purified my tongue letters...

Perhaps
here or there wandering in Bansilalpeta
When I degraded into 10th rank
Ten times punishing Long Stick...

The letters
which were sprouting in this
soil are not remains as plants...
They had been blossoming as flowers...

When I entered into the stage
I felt like standing
in my mother's shoulder's

When I was given Mike for message
I am searching for the sound of Gamin (Allaari Vedavai)
into large walls of that surroundings...

At last
They asked me to plant a plant
I made my mind feelings as memories
And pour them on the plant feet like heaps...

That is not School
That is education field
That is warm Mother's Lap...

======= ======== ========= ========== ==
Translated By Vilasagaram Ravinder.

అనువాద సౌరభం-31 విషం Poison

అనువాద సౌరభం-31

విషం
~~~

   Translated from Kannada by Pratibha Nandakumar into English
Kannada ORIGINAL POET: Aidane Godeya Chitragalu
తెలుగు అనువాదం: విలాసాగరం రవీందర్.

రాత్రయింది
నేను ఆమెను అడిగా
"ఇక ఆ విషం నాకు తాగిపిస్తవా?" అని,
ఆమె తన దగ్గర ఉన్న విషం సీసా మూత తెరిచింది
ఒక చుక్క సైసూసి ఇలా అంది
"ఇది ఇంకా మరగలేదు, తాగడానికి ఇంకా తగిలేదు"

అనువాద సౌరభం-30 Boorla Sir Poem

అనువాద సౌరభం-30.

Introduction:-

        బూర్ల వేంకటేశ్వర్లు గారు కవి, రచయిత. సాహితీ "వాకిలి" లో " "రంగుల విల్లు" ఎక్కుపెట్టి,  ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి "పెద్ద కచ్చురం" కట్టి, ప్రపంచీకరణ విధ్వంసాన్ని "బాయి గిర్క మీద ఊరవిశ్క" యై ఏకరువు పెడుతూ, అన్యోన్య దాంపత్య గొప్పను" రెండు పక్షులు ఒక జీవితం"తో విప్పిచెప్పిన వారు. ఈ యేటి అలిశెట్టి ప్రభాకర్ స్మారక సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వీరు ఈ సంవత్సరం మొదటి తారీఖున రాసిన ఈ కవిత అనువాదం చేసి మిత్రుల ముందుకు తెస్తున్న. బూర్ల వేంకటేశ్వర్లు గారికి శుభాకాంక్షలతో...

స్వేచ్ఛానువాదం:-

Write...

     Telugu Poet :Boorla Venkateshwarlu
     Translated By Vilasagaram Ravinder.

Today is the first day brother
Write brother write
Sharpen your Pen with the hard stones
Write brother write
You make the pointing finger  in the circle roads
As your eye sight...
You keep in mind the words
"We, the people of India"
Why is the letter/poet/writer prohibited?
Ask brother and
Write brother write

The opposed reservations men
Do you want the reservations on the work of
The making the slippers in the three street roads

The jobs get without the knowledge said persons
You take the reservation's share on the work of
Latrines works
Like that write brother write

Can you do our barbers work for One shift
Can you wash our clothes for One Day
Can you come with us to whistle with the dancing Oxens for One crop
Like that
write brother write

Write brother write
The one who will shame the mothers
For the sake of their country mother Goddess
Question why did our mother had been the torn clothes
The person who said there are no castes
Why are there the caste killings for their prestige
Like that
write brother write

All religions are one said like persons
Why are there army's in the sheds of Nuns nearby
Like that
write brother write

Write brother write
The history which destroyed
Into
Flour and flour
And understands the reality
Write brother write
In between the fire touches its heights
And burning the nights heights
Write brother write...

======== ======== ========== ========

*రాయి*

ఇయ్యాల్ల మొదటి దినం తమ్మీ!
రాయి
పలుగు రాళ్ళ మీద ఆకురాయి సానవెట్టి
ఆకురాయి మీద కొత్త కాలపు కలం పదనవెట్టి
రాయి.
చౌరస్తాల చూపుడు వేలును
కంటి చూపు జేసుకొని
చేతిల ఉన్న
వియ్ ద పీపుల్ ఆఫ్ ఇండియాను
మనుసు నిండ నింపుకొని
అక్షరం ఎందుకు నిషేధమైతదని
రాయి.

రిజర్వేషన్లు వద్దనెటోడా
మూడు బజార్ల కాడ
శెప్పులుకుట్టే  పనిల నీకు రిజర్వేషన్ గావాల్నా
అని రాయి
తెలివి లేకుంట ఉద్యోగం వచ్చిందనేటోడా
మా సపాయి పనిల
నీ వాటా దీస్కో అని రాయి
ఒక్క పూటకు మా మంగలి పని జేస్తవా
ఒక్క రోజుకు మా బట్టలుతుకుతవా
ఒక పంటకు మా గంగెడ్ల ఎంబడి
పీక ఊద వస్తవా అని రాయి.

రాయి తమ్మీ రాయి!
దేశ మాత కోసం
పరాయి తల్లి మానందీసెటోడా
మా తల్లులకు శినిగిన శీరెలు
ఎందుకున్నయిరా అని రాయి
కులం లేదు తలం లేదు అనేటోడా
పరువు హత్యలంటే ఏంటియిరా
అని రాయి
సకల మతాల సమరస భారతం అనేటోడా
సన్నాసులకు సైన్యాలెందుకురా
అని రాయి.

రాయి తమ్మీ రాయి!
రాయీ రాయీ నడ్మ నల్గిన
చరిత్రను కొట్టిన పిండి
చేసుకొని రాయి
రాయీ రాయీ నడ్మ
జకమొక నిప్పు రగిలి
శీకటి శిఖ అంటుకునే దాక రాయి.

https://m.facebook.com/story.php?story_fbid=1610351805674639&id=100000995058422

========= ========= ========= =======
Translated By Vilasagaram Ravinder.

Saturday, 6 January 2018

అనువాద సౌరభం-29.
Introduction:-
          నేను 2013 నుంచి కవిత్వం రాస్తున్నా. ఇంటర్మీడియట్ వయసులో రాసిన ఆ తర్వాత చదవడం కొనసాగింది. 2016 లో కరీంనగర్ కవి మిత్రులు ప్రోత్సహించారు. ఈ నేపథ్యంలో “నది పలికిన వాక్యం” కవిత్వ సంకలనం వేసాను. పోయిన సంవత్సరం ప్రపంచ తెలుగు మహాసభల్లో నానీల నిప్కలు ఆవిష్కరణ  చేద్దాం అనుకున్న. కానీ నా సమస్యల కారణంగా వీలు కాలేదు.  బహుశా ఈ నెలలో ఆవిష్కరణ ఉంటుంది.  ఇది క్లుప్తంగా నా పరిచయం. ఇంకా రెండు మూడు సంపుటాలు వేయగలిగిన కవిత్వం ఉన్నది. వీలును బట్టి వేస్తాను.

          ఇక అనువాదం విషయానికి వస్తే 28 వారాల క్రితం ఒక గ్రూపులో ప్రారంభించాను. కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఆ గ్రూపులో నుంచి బయటపడిన వారం క్రితం.  నేను ఒక పని మొదలు పెట్టాను అంటే దాదాపు వదిలెయ్యను. అందుకే ఈ రోజు నుంచి వారంతో సంబంధం లేకుండా నా ఫేస్ బుక్ గోడపైననే పోస్ట్ చేస్తూ ఉంటాను. నేను ఇంకా అనువాద మెలకువలు నేర్చుకుంటూనే ఉన్న.  ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పమని పెద్దలకు మనవి.

     ఈ కవిత అనువాదం రెండు నెలల క్రితం చేసిన.  పోయిన నెలలో వేరే రాష్ట్రంలో ఒక కవి సమ్మేళనం లో పాల్గొన వలసి ఉండె. కానీ నా సమస్యల కారణంగా వీలు కాలేదు.  ఆ సందర్భంగా నా ఈ కవిత అనువాదం చేసిన. ఈ కవిత మూడేళ్ళ క్రితం రాసినా ఇప్పటి సమాజంలో అలాగే ఉన్నయి పరిస్థితులు.


What is This?
~~~ ~~~~~~~~
          Telugu Poet:- Vilasagaram Ravinder.
          Translated By Vilasagaram Ravinder.

Man is dying ...
Covering with religious beliefs
Encouraging with caste systems

What else
Man is unseen permanently
Without shedding teardrops ruthlessly...

Man is dying...
Without love and affection
Without giving the last lovable farewell...

Man is dying...
In the hands of ISM’s iron rods
He is cutting his head by himself
Unnecessary pleadings
He is dying...
He is hewing...
He is killing himself...
He is vanishing himself...

======== ========= ========== =======

Telugu Original poem:

ఏమిటిది?
~~~~~
       -విలాసాగరం రవీందర్.

మనిషి మరణిస్తున్నడు
మతం ముసుగేసి
కులం కుంపటి ఎగేసి.

కారణం ఏదయితేనేం
మనిషి రాలిపోతున్నడు.
కన్నీటి చుక్కలు కాకుండానే
మనిషి మాయమయితున్నడు
ఆత్మీయ వీడ్కోలు లేకుండానే.

ఇజాల ఇనుప పంజరంలో ఇరుక్కొని
తనను తాను తెగ నరుక్కుంటున్నడు.
పిడి వాదాల శరాలతో
తన తలను తానే పెకల్చుకుంటున్నడు.

తేది:20-05-2015 తేదిన రాసిన కవిత.

"నది పలికిన వాక్యం" సంకలనం లోని కవిత్వం.
======== =========== ========== =======

అనువాద సౌరభం-28 పెనుగొండ సరసిజ గారి కవిత

అనువాద సౌరభం-28
~~~~~~~~~~~~
Introduction:-

       పెనుగొండ సరసిజ గారు చాలా కాలం నుంచి కవిత్వం రాస్తున్నారు.  సాహితీ ప్రపంచంలో పెనుగొండ బసవేశ్వర్, సరసిజ దంపతులు కవిత్వం,  కథలు రాస్తున్న మరొక సాహితీ దంపతులు. వీరు ఇరువురు త్వరలో కవిత్వ సంకలనాలు వేయనున్నరు. పెనుగొండ సరసిజ గారు కరీంనగర్ సిటీ కేబుల్ లో వార్తలు చదువుతారు.  కవిత్వం రాస్తున్నారు.  కథలు కూడా రాస్తారు.

ఈ కవిత వారు ఈ మధ్యలో నే రాసినరు.  పెళ్ళి అయ్యాక కొత్తగా వచ్చిన వివిధ పరిస్థితులపై కొత్త కుటుంబ సభ్యులు ఎలా ఉంటరు, వారి ప్రేమ ఆప్యాయత ఈ కవితలో మనం గమనించవచ్చు.

Sky Like Memories...
~~~~~~~~~~~~

       Telugu Poet: Penugonda Sarasija
       Translated By Vilasagaram Ravinder

When
My mind turned into New Bridegroom
He made me not only happy but came also near to my heart...
The Nieces were like street friends at that time
Some Decency...
Some fear...
Some Own feelings
Some rightness...
The newly introduction
That made the total lifetime home
The Home of my Mother In law's...

...

When
We turned the street turning...
The Hibiscus flowers were seen like full moonlight
They welcomed us like their lovers...

...

The Marigold flowers
which were around the home
They were like flowers
of the mother's hair dressers...
They made that like beautiful home...

....

In between the home
In the Canopy
The Jasmines were weaving
Like the Young Lady's Beautiful Inert
The twisting and the twirling...

...

On the early mornings
On the the Winter Days
My Hand palms
are heaten And touching my cheeks
Are like my husband's kisses
Feelings
They turned into red roses...

...

However
Presently no Home of My Mother In law's is there
Yet
Our Landmarks are very
High Like Sky...
In our memories...
Remains...

========== ============ ==========

Telugu Original poem:-

///ఆకాశమంత జ్ఞాపకం///

కొత్త పెళ్ళికూతురైన నా మదిని
మురిపించిన మనసైనవాడు
దస్తీబిస్తీ ఆటల్లో
జట్టువిడవని జతగాళ్ళలా ఆడబిడ్దలు
కొంచెం బిడియం...
కొంచెం భయం ....
కొంచెం స్వంతం...
కొంచెం హక్కులా...
కొత్తగా పరిచయమై..
మొత్తంగా అయిన అత్తారిల్లు...

...

మూలమలుపు తిరగ్గానే కనిపించే
ముద్దగా పూసిన మందారాలు
ప్రియురాలి కోసమెదురొచ్చే
ప్రియుడిలా మమ్మల్ని ఆహ్వానించేవి.

...

ఇంటి చుట్టున్న బంతి చెట్లు
అమ్మ శిక చుట్టూ ముడిచిన
పువ్వుల్లా  ఇంటిని సింగారించేవి.

...

ఇక మధ్యలో పందిరికి పారిన
మల్లెతీగ, పడుచు పిల్ల వాలుజడలా
వయ్యారాలు బోయేది.

...

పొద్దు పొద్దునే మండే పొయ్యిలోని
సన్నని మంటకు వెచ్చచేసిన అరచేతులు
బుగ్గల్నితాకి తాకగనే మగని వెచ్చని
ముద్దులా తోచి చెక్కిళ్ళు ఎరుపెక్కేవి.

...

        అయితే
ప్రస్తుతానికి ఇప్పుడక్కడ
మా అత్తాగారిల్లు లేదు
కాని మా ఆనవాళ్ళు మాత్రం
ఆకాశమంత జ్ఞాపకంలా
ఇంకా మిగిలే వున్నాయి.

  -పెనుగొండ సరసిజ.

======== ========== ======== ======

https://www.facebook.com/groups/kavisammelanam/permalink/1493648740753446/

======== ========== ======== ======

Translated By Vilasagaram Ravinder.