Friday, 29 September 2017

The pity Mother...

అనువాద సౌరభం-15.

Introduction:-

       ఈ గ్రూపులో ఇది నా 15వ అనువాదం.  ఉష శ్రీ గారు మంచి భావుకతతో కొంత కాలంగా ఫేస్ బుక్ లో కవిత్వం రాస్తున్నారు.  వీరు నా పూర్వపు పాఠశాలలో సహ ఉపాధ్యాయుని. కొన్ని వ్యక్తిగతమైన కారణాలతో మా మధ్య ఈ మధ్యలో సంభాషణ లేదు.

       కవిత్వం నా ప్రాణం.  కవిత్వం రాయకుండా ఉన్నట్లయితే ఈ అనువాదం నేను చేసి ఉండే వాడిని కాదు. శూన్యంలో ఎక్కడో గిరికీలు కొడుతూ ఉండే వాడిని.

      ఉష శ్రీ గారు మంచి కవయిత్రి.  కొంచెం సామాజిక స్పృహతో రాస్తే మంచి పేరు తెచ్చుకుంటారు.

      ఈ కవిత విషయానికి వస్తే అమ్మ ఎవరికి అయినా ఆది దేవత. ఆ అవ్వను అనాదగా వదిలేయడం అమానుషం.

      ఈ అనువాదం “స్వేచ్చానువాదం” కొన్ని భావాలు ఇతర భాషలలో చెప్పడం అసాధ్యం.  అందుకే నేను ఈ పద్ధతి ఎంచుకున్న.

ఇక అనువాద సౌరభంలోకి వెళదాం.

స్వేచ్చానువాదం:-
=========

Pity Mother...
~~~~~~~~

Telugu Poem: Ushasree Veggalam

English Translation: Vilasagaram Ravinder.

Yes...
She is your mother...
She loves you a lot...

Yes
She is your mother
She feels that you are her dreams like
She loves you a lot...

Your father went to other country
And comes with dead body
Her heart is broken.

Yet
She is running with time for yours sake
She forgets all her hungry
She doesn't drink even water
She eats with your smiles
She works for your smiles...
She made you as a Great Officer
And
She gives a Great name and fame
In the society.

Now you are shame while watching her folded skin
Which give the bundle of sweat...
Her eyes are forgotten her sleep
She doesn't lift her back for your happiness
That is still like that straight.

You feel Shame... shame...
Whenever sees this dirty body...

You take all of her wealth and existentialism
You remain her on the roadside...

She doesn't work like the past
Her shelter is not permanent
She doesn't beg because she lives in the prestigious life
If anybody offers anything she doesn't reject...

Yet
She doesn't curse you
But
But
She has been waiting for you since a long time
With the Fussa eyes
She likes to bless you
She doesn't want your Air Conditioning rooms
She waits and waits
One day her eyes are closed
She gives her life to you
But
She is no more
She is no more
She will not see you
She will not see you forever...
She disappeared from this world forever...

======== ======= ============

👵పాపం అమ్మ👵

అవును తను నీ అమ్మే

తన కలలకు ప్రతిరూపానివి నీవని
నిను అమితంగా ప్రేమించిన నీ అమ్మ

నీ తండ్రి నీ భవిత కోసం
పరాయి దేశం వెళ్లి శవమై వస్తే...
తన గుండె పగిలినా...

నీ కోసం కాలంతో పరుగెత్తుతూ...
ఆకలి నిద్రల చెలిమి వదిలి
నీ చిరునవ్వులో తన ఆకలి తీర్చుకొని
నిన్నో గొప్ప ఉద్యోగిని చేసి
సమాజంలో నీకు ఓ పేరునిచ్చిన నీ అమ్మ

ఇప్పుడు ఆమెను చూస్తే నీకవమానం

నీకై చెమట చిందించిన దేహపు ముడతలు
నీకై నిదురను మరచిన ఆ కను గుంటలు
నీకై వంచిన నడుం ఎత్తలేదు కదా!
అది అలాగే ఉండిపోయింది

ఛీ ఛీ ఏం బాగా లేదు
ఎవరైనా చూస్తే ఎలా...

అందుకే ఆమె ఆస్తిని అస్థిత్వాన్ని లాక్కుని
ఆమెను రోడ్డు పాలు చేశావు

తానిప్పుడు మునిపటిలా శ్రమించలేదు
తనాశ్రయం శాశ్వతమేమీ కాదు
గౌరవంగా పని చేసుకు బతికిన తను
చేయి చాచలేదు
ఎవరైనా పెడితే కాదనదు

అయినా తను నిన్నెపుడూ శపించలేదు
కానీ... కానీ...
తను నీ కోసం ఆశగా ఎదురు చూస్తుంది
అదే ఆ గుంటలు పడిన కళ్ళతో...
నిన్ను చల్లగా ఉండమని దీవించడానికే గానీ...
నీ ఏసీ గదిలో సేదదీరాలనే ఆశేమీ లేదు

ఎంత వరకిలా...
చివరికోరోజు తను నిదుర పోయింది
మళ్ళీ ఇక లేవలేదు
ఇన్నాళ్లూ నీకే ఇచ్చిన తన నిద్రను తను పూర్తిగా తీసేసుకుంది

నీకు మళ్ళీ కనిపించనంత దూరంగా...
వెళ్ళి పోయింది

*ఉషఃశ్రీ 23.9.17

https://www.facebook.com/groups/kavisammelanam/permalink/1408473579270963/

========== ========== ===========
English Translation: Vilasagaram Ravinder.

You are Me... I am You...

అనువాద సౌరభం- 14

You are me... I am you...
==== ====== =======
Telugu Original poem: Sudha Rani
English Translation: Vilasagaram Ravinder.

I know all my memories are you
I know all my accosts are you
I know all my watching lines are you
I know all my inner feelings are you.

I know all my hopes shore is you
I know all my likes waves are you
I know all my words sweets are you
I know my breath fragrance is you.

I know your smiling flowery buds are me
I know all your mind feelings fragrance is me
I know all your mind singing moon songs are me
I know all your heart musical Ragas are me.

The sky and the earth linked rainbows are us
The eye lids disappeared shape is us
If we find other life We are One for One...

In this life
We are Made for each other...
One is the Other...

======== ======== ======== ===
🌹నువ్వే..నేను🌹నేనే..నువ్వు🌹

నా కలవరింతలన్నీ నువ్వేనని తెలుసు
నా ప్రతీ పులకరింపు నీదేనని తెలుసు
నా చూపురేఖలన్నీ నీవేనని తెలుసు
నా అంతరంగ భావనలన్నీ నీవని తెలుసు

నా ఆశలతీరం నీవేనని తెలుసు
నా కోరికల అలలన్నీ నీవని తెలుసు
నా మాటల్లో సుధలన్నీ నువ్వేనని తెలుసు
నా ఊపిరి పరిమళం నీదేనని తెలుసు

నీ నవ్వుల విరితావుల్లో నేనున్నానని తెలుసు
నీ మదిభావనా సుగంధం నాదేనని తెలుసు
నీ మది పాడే వెన్నెలగీతం నేనేనని తెలుసు
నీ హృదయ రాగ తాళాలు నావేనని తెలుసు

నింగినీ నేలను కలిపే హరివిల్లే మనము
కనుపాపలో 'కలగలిసిన' రూపం మనది
మరుజన్మంటూ ఉంటే ఒకరికి ఒకరై.......

ఈ జన్మంతా.........ఇద్దరం.......ఒకటై

సుధా మైత్రేయి
16.09.17

https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1402678816517106

======= ======== ========= =======
English Translation: Vilasagaram Ravinder.

My Hands. .

అనువాద సౌరభం-13

Introduction:

        మెట్టా నాగేశ్వరరావు గారు ఇప్పుడు బాగా మంచి కవిత్వం రాస్తున్న వారిలో మొదటి వరుసలో ఉన్నరు.  పుస్తక విశ్లేషణలు కూడా విరివిగా చేస్తున్నరు. వీరు “మెట్టామాణిక్యాలు” అనే రుబాయీల పుస్తకం అచ్చవేసినరు. త్వరలో “కవితలుపూచిన చెట్టు” పేరుతో (వచనకవిత్వం) “నాన్నకవితలు” “మెట్టానానీలు” మొ|| పుస్తకాలు అచ్చు వేయుటకు సిద్ధం అయితున్నరు.

        ఈ కవిత విషయానికొస్తే ఎవరి పనులు అయినా చేతుల తోనే గొప్పగా పూర్తయితయి. పేరు తెస్తయి. మెట్టా గారికి వారి అమ్మ నాన్న అంటే ఎక్కడ లేని ప్రేమ.  చివరికి కవిత్వం దగ్గర ఆ చేతులు శాశ్వతం అయితయి అనే వాక్యం నాకు బాగా నచ్చింది.  ఇక అనువాదం లోకి వెళదాం.

స్వేచ్ఛానువాదం: -

My Hands...
=========
Telugu Poet: Metta Nageshwar Rao.
English Translation: Vilasagaram Ravinder.

I don't know
my mother how many times kissed my little hands
They empurpled starts
They rejects and doing small kids works
They don't know
hemianesthesia in their blood.

When I write the words like diamonds
Her eyes are like nightingale.
When she fells with fever and doesn't get down the bed
I feel like child Bheema and prepares food
She calls me near and pats my head with love
When I clean before our home and
Lightens the stars
She becomes the oceans happiness in her heart.

She amplifies my hands
I do not through even one stone on others.
I do not claps my hands
to any rich person for their fevers.
I do not support any false persons for their fevers.

My mother feeds my hands
They take knifes and cut the water fruits
And give among the friends with love.
They take the axes
And chop the palms/Munjakaayalu
And help the father like little squirrel
They take books and
Rub the illiteracy of our ancestors.
My hands are afraid anyone
But they revolt on my mindlessness
within seconds like light running On the clouds
My hands are like sweet friends
To reform me.

I will die like anyone anywhere anytime
And disappear in the blanket
But my hands live forever eternal
Because they catch the poetry and poetry
They write the poetry and poetry...
====== ======== ======== ==============

Telugu Original poem:

నా చేతులు  
========
Telugu  poet : Metta Nageshwar Rao

చిన్నప్పుడు మా అమ్మ
ఎన్నిసార్లు ముద్దాడిందో తెలీదు గానీ
నా చిట్టి చేతుల్నీ
అవి కండపోసుకోవడం మొదలు
ముద్దాయి పనులను నిరసిస్తూ
ముద్దు ముద్దు పనుల్నే చేస్తున్నాయి!
మొద్దుతనం వాటి రక్తంలో లేదు

పలకపై అక్షరాల్ని వజ్రాల్లా రాసినపుడు
అమ్మ కళ్లు నెమలి పింఛాలయ్యేవి
జ్వరమొచ్చి అమ్మ మంచం దిగనపుడు
బాల భీముణ్ణయి గరిట తిప్పినపుడల్లా
దగ్గరకు పిలిచి ప్రేమగా తలను నిమిరేది
నా చిన్న చేతులు కళ్లాపి జల్లి
వాకిల్లో నక్షత్రాల్ని గీస్తే సంతోష సాగరమయ్యేది

అమ్మ పెంచిన నా చేతులు
ఎవరిపై రాళ్లను వేయలేదు
బానిసత్వం నింపుకుని
ఏ బలిసినోడి దగ్గర భజనా చెయ్యలేదు
ఏ అవినీతి నాయకుడికైనా జైలూ కొట్టలేదు!

అమ్మ సాకిన నా చేతులు
కత్తులు పట్టాయి
ముంజలు కొట్టి నేస్తాలకు పంచాయి
గొడ్డళ్లను పట్టాయి
తాటి మొద్దుల్ని నరుక్కొచ్చి
అయ్యకు ఉడత సాయాన్ని అందించాయి
పుస్తకాల్ని పట్టాయి
మా వంశంపైనున్న నిశానిముద్రని చెరిపాయి!

నాచేతులు
ఎవరి మీదైైనా జంకుతాయి కానీ
నామనసు బుద్ధిహీనంగ ఆలోచిస్తే మాత్రం
మెరుపువేగంతో చెయ్యిచేసుకుంటాయి
నన్ను సంస్కరించడంలో
నాచేతులపాత్ర మిత్రునిచందం!

ఏదో ఓ రోజు
నేను మరణిస్తాను
అందరిలాగే నేను కూడా
మట్టిబొంత కింద జేరి అంతమవుతాను
కానీ
నా చేతులు బతికేవుంటాయి
ఎందుకంటే
అవి కవిత్వాన్ని కవిత్వాన్ని పట్టుకున్నాయి!!
కవిత్వాన్ని కవిత్వాన్ని రాశాయి!!

               **************

English translation: Vilasagaram Ravinder.

Unhappy Flower

అనువాద సౌరభం- 12

Introduction :

     రవి వీరెల్లీ గారు సీనియర్ కవి. కవిత్వం అంటే ప్రాణమిచ్చే కవి. వీరు 2012 లో దూప కవితా సంకలనం ప్రచురించారు. ఆ తర్వాత 50 కి పైగా కవితలు మాత్రమే రాసినరు.  ఈ సంవత్సరం “కుందాపన” 48 కవితలతో వేసినరు. ఆ సంకలనం కొద్ది రోజుల క్రితం ఒక ప్రియ పిత్రుని ద్వారా అందింది. పుస్తకం మొత్తం చదవలేదు. నాలుగు ఐదు మాత్రం నా అంతులేని సమస్యల మధ్య చదవ గలిగిన. అందులో నాకు బాగా నచ్చిన పోయెమ్ ఇది. అన్ని కవితల చాలా గాఢత కలిగినవే. అన్నీ అనువాదానికి లొంగవు. నిన్న ఒక పుస్తక ఆవిష్కరణ కు హైదరాబాద్ వెళుతూ ఈ కవిత అనువాదం చేసిన. ఈ కవితా సంపుటికి కె శివారెడ్డి గారు, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గార్లు ముందు మాట రాసినరు.  ఈ కవిత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారికి బాగా నచ్చింది.

       నేను స్వేచ్ఛానువాదం ఎంచుకోవడం జరిగింది.  కవి భావం వచ్చే విధంగా ఆంగ్లంలోకి అనువాదం అనుసరిస్తున్న. నా సొంత భావాలు ఏవీ దరిచేరనీయడం లేదు. ఈ మధ్యలో పెద్దల సలహా మేరకు అనువాదం ఈ విధంగా చేస్తున్న.  ఇక అనువాదంలోకి వెళదాం.

Unhappy Flower

    Telugu Poet:  Ravinder Verelly
    English Translation:  Vilasagaram Ravinder.

In a prolonged discussion...
May be at an end,
Suddenly stopped ending
In the Time hands
The dark and light weaves
Suddenly the threads colour changed.

May be they think to dance with moon
Lightens,
darkens,
The stars are tuning
The variety tunes tuning.

I am stretch the bed before the house
And resting the body...
The sky is drubbing my memories one by one.

I enlighten the past
As usual and breathe tightly.

The unhappy flower, which born on the night branch
Does not want to exfoliate at this time.

====== ======== ======== =========
English Translation:  Vilasagaram Ravinder.

Mother River

అనువాద సౌరభం-11.

Introduction: -

     వారాల ఆనంద్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి.  కవిత్వం రాయగలరు. ఇంటర్వ్యూ చేయగలరు. వ్యాసం రాయగలరు. కథలు రాయగలరు. అనువాదం చేయగలరు. వీరి గురించి రాయాలంటే అదే ఒక వ్యాసం అవుతుంది. ఆ సాహసం తర్వాత చేస్తాను.  ఇప్పుడు రేఖా మాత్రంగా వారి గురించి చెబుతాను. వీరు ఇప్పటి వరకు 3 కవిత్వ సంపుటిలు, ఒక విమర్శ పుస్తకం, ఒక ఇంటర్వ్యూ పుస్తకం,  ఒక ఆంగ్ల అనువాదం,  పిల్లల సినిమాల అనువాదం ఇంకా చాలా గ్రంధాలు ఆల్బం లు వేసారు. వీరికి సినిమా రంగంలో అద్భతమైన అనుభవం ఉంది.  వీరు వీరి మిత్రుల కారణంగా ఇప్పుడు కరీంనగర్ లో ఫిల్మ్ భవన్ నిర్మాణం జరిగింది.  ప్రస్తుతం వారు జాతీయ స్థాయిలో సెన్సార్ బోర్డు సభ్యులుగా ఉన్నరు.

        ప్రస్తుత కవిత విషయానికొస్తే కవి నదిని తన తల్లి తో పోల్చడం.  కవిత్వం అంటెనే ప్రత్యేకంగా ఉండటం, చెప్పడం జరుగుతుంది.  ఈ కవిత సర్వజనీనమైనది పూర్తి భావం మరో భాషలో చెప్పడం కష్టం అందుకే నేను స్వేచ్ఛానువాదం చేస్తున్న.

స్వేచ్ఛానువాదం: -

Mother River
~~~~~~~~

Telugu Poet:  Varala Anand

English Translation:  Vilasagaram Ravinder.

In the branches of trees
There spread the greenish nature  densely..
The clouds watching this
They are scattered the drizzle somewhere in the starting of the river.

One by one the drops made
the flow and flow
It becomes the river.

The river accosted the Villages
They jump and jump the heights
Run and run that made flowing and flowing
It lives and lives...

If the water flow have the wings
They would fly like birds
They would touch the fields and the barren lands
They would engulf the all lands in this earth...

I go to the river and touch with my hands
I asked it “How are you dear”
She replies happily and eagerly
I think my mother call me
The thoughts and thoughts of mother memories layers...
My eyes drops four eye drops silently
They mixes with the river and through away with flowing...
I am like statue in the river bank still now...

====== ======== ========== ==========

English Translation: Vilasagaram Ravinder.

We will change...

అనువాద సౌరభం- 10.
Introduction :-

ఈ గ్రూప్ లో ఇది పదవ అనువాదం. లక్ష్మి నారాయణ  (కుం చె గారు)  చాలా కవిత్వం రాసారు.  చాలా కథలు కూడా రాశారు.  ఈ కవిత ఇప్పటి సమాజానికి అవసరమైన వస్తువు. అభివృద్ధి పేరుతో మనిషి ప్రకృతిని నాశనం చేస్తున్నడు. ఈ కవితలో కూడా ఇది ప్రధానమైన అంశం.

      లక్ష్మి నారాయణ గారు మనిషి తన అవసరానికి ఒక చెట్టును నరికితే పది చెట్లను నాటాలంటరు. ఇది నాకు బాగా నచ్చింది.

         అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా భూమండలమంతా పరిశ్రమలతో నిండిపోతున్నది. పరిశ్రమలను ఆపలేం. కనీసం ఆ పరిశ్రమల ప్రాంతమంతా చెట్లతో నింపాలంటరు. ఇది నాకు చాలా నచ్చింది.

  నేను ఎప్పుటి మాదిరిగా స్వేచ్ఛానువాదం అనుసరిస్తున్న...

స్వేచ్ఛానువాదం...

We will change..

Telugu Poet: కుం చె గారు
English Translation: Vilasagaram Ravinder.

Will we change...
The sun red Ray’s into
The greenish nature with Plants?

Will we change...
The brackish sky buildings
Into blueish white colours mingled?

Will we change...
The broken Ozone layer with fulfilling that into full layer...

Will we change...
The plastics garbage water into pure water
with the help of cows whiteness...

will we change...
The pollution casuases into great works...?

Will we change...
The earth into plants forest
If we cut one tree for our necessaries or unnecessarily...
We will plant ten trees...?

Will we change...
If we establish one factory
We can plant trees to dry up all the carbon di oxides...?

Yes
We will Change...
We welcome the modernization
We can establish the old nature...
Yes...
We should build the ancient nature...

Yes...
We would Change it...
We would  Change it...

English Translation:  Vilasagaram Ravinder.

My Village and Me

అనువాద సౌరభం-9

Introduction:

• ఈ కవిత స్వర్గీయ నరేంద్ర బాబు గారు 2015 రాసింది. నరేంద్ర బాబు గారు కవిత్వం అంటే ప్రాణమిచ్చే వారు. వ్యక్తిగతంగా పరిచయం లేదు. ఫేస్ బుక్ ద్వారానే పరిచయం.  చాలా తక్కువ కవిత్వం రాసారు.  కవిత్వం ప్రేమించే వారి కోసం యాకూబ్ సార్ లాగానే “కవి సమ్మేళనం” గ్రూపు ఏర్పాటు చేసారు.  ఏమయిందో తెలియదు. చాలా తొందరగా ఈ ప్రపంచం నుంచి మాయమయ్యారు.

• ప్రస్తుత కవిత విషయానికొస్తే ఈ కవిత వారి స్వంత గ్రామానికి వెళ్ళినపుడు తన అనుభవాన్ని కవిత్వం చేసారు.  ఎవరికైనా తమ స్వంత ఊరంటే ఎక్కడ లేని ప్రేమ ఉప్పొంగుతది. మనల్ని మనం మరిచి గ్రామ పరిసరాలతో, చిన్న నాటి దోస్తులతో అప్రయత్నంగా అనువణువూ మమేకకమయి పోతం. ఈ కవిత అలాంటిదే. కవి తన ఊరెళ్ళినపుడు వర్షం రావడం ఆ ఆనంద పరవశం కనిపిస్తుంది.

• ఆ మధ్యలో నేను హైదరాబాద్ వెళ్ళి వస్తూ మా ఊరు పొలిమేరలో గాలి కూడా కన్న తల్లి స్పర్శ లా ఉందని రాశాను.  ఈ భావాలు విశ్వజనీనమైనవి.

• ఇక అనువాదం మామూలే “స్వచ్ఛానువాదం”. Cv Suresh Sir చాలా సహాయం చేస్తున్నారు. కవిత్వం రాసుడు కంటే అనువాదం ద్వారా చాలా విషయాలు తెలుస్తున్నయి.

• ఇక అనువాదం లోకి ప్రవేశిద్దాం.

స్వేచ్ఛానువాదం:
============

My Village and Me in between Rain...
======= ========= ======== =====

    Telugu Poet : Narendra Babu...
      Date 30 May, 2015.
    English Translation: Vilasagaram Ravinder.

Seems may be strange !
Sounds like peculiar !

Something interrelated ...!

Yes!
I even feel like so..!
My Village and Me in between Rain...!

Soul will swing...!
When those thoughts arise !

On my arrival..!
The village mother hugs me..!

The Rain friend
Comes to see me...!
Briskly!
Kisses me...!
Force me to dance along with her..
Demands me to sing a compassion song
     in the drought sticken area...!

Wipes the age old  tears...!

In the complete hot sun ...!
She touches my feet with chilled water..!

I don’t care her and go...!
She comes and blows
the air like thunder...!
She comes with ardent rumble...!

I don’t grasp at that time...!
She blows the stave with lots of air...!

What ever it may be...
My Mother Village has been thirsting for water for a long time...!

She pours water into her mouth...!
and
she regains
her life again...!

Perhaps for that...!

My Village boggles me always...!
Like my mother !

====== ======== ======== ==========
Telugu Original poem:

//మా ఊరు నేను మధ్యలో వర్షం//
                                   -నరేంద్రబాబు.

వింతగా వుండొచ్చు..
విచిత్రమూ అనిపించవచ్చు!
మా ఊరు నేను మధ్యలో వర్షం
ఈ మూడింటికీ ఏదో సంబంధముంది

అవును
ఆలోచిస్తే నాకే లీలగా అనిపిస్తుంది
ఊహిస్తే మనసు ఊయల ఊగుతుంది

తల్లిలాంటి ఊరికి వచ్చినప్పుడల్లా
నన్ను చుడటానికే అన్నట్లు
క్షణం ఆలశ్యం చేయకుండా వచ్చేస్తుంది

తల నిమురుతుంది
బుగ్గలు ముద్దాడుతుంది
అబ్బో నా చేతులు పట్టుకొని
అదే పనిగా తనతో ఆడమంటుంది

కరువు సీమలో కన్నీటి పాట పాడమంటుంది
తరాలుగా గూడుగట్టుకొని
ఉబికి ఉబికి కన్నీరొస్తే
అవేవి కనిపించకుండా మాయ చేస్తుంది

బస్సు దిగి ఊళ్లోకి నడుస్తుంతే
యెక్కడుంటుందో అమాంతం వచ్చేస్తుంది

భగ భగ మండే ఏండల్లోను
చల్లటి నీటితో పాదాలను ముద్దాడుతుంది

దాన్ని నేను పట్టించుకోనట్టు వెళ్లానా
ఉరుమై ఉరుముతుంది
పిడుగై ఘర్జిస్తుంది

అప్పటికీ గ్రహించలేదో
హోరు గాలితో బెంబేలెత్తిస్తుంది

ఏమైతేనేం
దాహంతో తడారిన నా పల్లె తల్లి
ఇన్ని నీళ్లు గొంతులో పోసుకొని
మళ్లీ ప్రాణం పోసుకుంటుంది

బహుసా
ఇందుకోసమేనేమో
మా ఊరు నన్నెప్పుడూ కలవరిస్తూనే వుంటుంది...
అచ్చంగా మా అమ్మలా!

https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=771327982985529