Friday, 29 September 2017

My Village and Me

అనువాద సౌరభం-9

Introduction:

• ఈ కవిత స్వర్గీయ నరేంద్ర బాబు గారు 2015 రాసింది. నరేంద్ర బాబు గారు కవిత్వం అంటే ప్రాణమిచ్చే వారు. వ్యక్తిగతంగా పరిచయం లేదు. ఫేస్ బుక్ ద్వారానే పరిచయం.  చాలా తక్కువ కవిత్వం రాసారు.  కవిత్వం ప్రేమించే వారి కోసం యాకూబ్ సార్ లాగానే “కవి సమ్మేళనం” గ్రూపు ఏర్పాటు చేసారు.  ఏమయిందో తెలియదు. చాలా తొందరగా ఈ ప్రపంచం నుంచి మాయమయ్యారు.

• ప్రస్తుత కవిత విషయానికొస్తే ఈ కవిత వారి స్వంత గ్రామానికి వెళ్ళినపుడు తన అనుభవాన్ని కవిత్వం చేసారు.  ఎవరికైనా తమ స్వంత ఊరంటే ఎక్కడ లేని ప్రేమ ఉప్పొంగుతది. మనల్ని మనం మరిచి గ్రామ పరిసరాలతో, చిన్న నాటి దోస్తులతో అప్రయత్నంగా అనువణువూ మమేకకమయి పోతం. ఈ కవిత అలాంటిదే. కవి తన ఊరెళ్ళినపుడు వర్షం రావడం ఆ ఆనంద పరవశం కనిపిస్తుంది.

• ఆ మధ్యలో నేను హైదరాబాద్ వెళ్ళి వస్తూ మా ఊరు పొలిమేరలో గాలి కూడా కన్న తల్లి స్పర్శ లా ఉందని రాశాను.  ఈ భావాలు విశ్వజనీనమైనవి.

• ఇక అనువాదం మామూలే “స్వచ్ఛానువాదం”. Cv Suresh Sir చాలా సహాయం చేస్తున్నారు. కవిత్వం రాసుడు కంటే అనువాదం ద్వారా చాలా విషయాలు తెలుస్తున్నయి.

• ఇక అనువాదం లోకి ప్రవేశిద్దాం.

స్వేచ్ఛానువాదం:
============

My Village and Me in between Rain...
======= ========= ======== =====

    Telugu Poet : Narendra Babu...
      Date 30 May, 2015.
    English Translation: Vilasagaram Ravinder.

Seems may be strange !
Sounds like peculiar !

Something interrelated ...!

Yes!
I even feel like so..!
My Village and Me in between Rain...!

Soul will swing...!
When those thoughts arise !

On my arrival..!
The village mother hugs me..!

The Rain friend
Comes to see me...!
Briskly!
Kisses me...!
Force me to dance along with her..
Demands me to sing a compassion song
     in the drought sticken area...!

Wipes the age old  tears...!

In the complete hot sun ...!
She touches my feet with chilled water..!

I don’t care her and go...!
She comes and blows
the air like thunder...!
She comes with ardent rumble...!

I don’t grasp at that time...!
She blows the stave with lots of air...!

What ever it may be...
My Mother Village has been thirsting for water for a long time...!

She pours water into her mouth...!
and
she regains
her life again...!

Perhaps for that...!

My Village boggles me always...!
Like my mother !

====== ======== ======== ==========
Telugu Original poem:

//మా ఊరు నేను మధ్యలో వర్షం//
                                   -నరేంద్రబాబు.

వింతగా వుండొచ్చు..
విచిత్రమూ అనిపించవచ్చు!
మా ఊరు నేను మధ్యలో వర్షం
ఈ మూడింటికీ ఏదో సంబంధముంది

అవును
ఆలోచిస్తే నాకే లీలగా అనిపిస్తుంది
ఊహిస్తే మనసు ఊయల ఊగుతుంది

తల్లిలాంటి ఊరికి వచ్చినప్పుడల్లా
నన్ను చుడటానికే అన్నట్లు
క్షణం ఆలశ్యం చేయకుండా వచ్చేస్తుంది

తల నిమురుతుంది
బుగ్గలు ముద్దాడుతుంది
అబ్బో నా చేతులు పట్టుకొని
అదే పనిగా తనతో ఆడమంటుంది

కరువు సీమలో కన్నీటి పాట పాడమంటుంది
తరాలుగా గూడుగట్టుకొని
ఉబికి ఉబికి కన్నీరొస్తే
అవేవి కనిపించకుండా మాయ చేస్తుంది

బస్సు దిగి ఊళ్లోకి నడుస్తుంతే
యెక్కడుంటుందో అమాంతం వచ్చేస్తుంది

భగ భగ మండే ఏండల్లోను
చల్లటి నీటితో పాదాలను ముద్దాడుతుంది

దాన్ని నేను పట్టించుకోనట్టు వెళ్లానా
ఉరుమై ఉరుముతుంది
పిడుగై ఘర్జిస్తుంది

అప్పటికీ గ్రహించలేదో
హోరు గాలితో బెంబేలెత్తిస్తుంది

ఏమైతేనేం
దాహంతో తడారిన నా పల్లె తల్లి
ఇన్ని నీళ్లు గొంతులో పోసుకొని
మళ్లీ ప్రాణం పోసుకుంటుంది

బహుసా
ఇందుకోసమేనేమో
మా ఊరు నన్నెప్పుడూ కలవరిస్తూనే వుంటుంది...
అచ్చంగా మా అమ్మలా!

https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=771327982985529

No comments:

Post a Comment