Wednesday, 29 November 2017

అనువాద సౌరభం-24 అరుణ సందడి గారి Poem "The weeping Tree"

అనువాద సౌరభం-24.
 
Introduction:-

      అరుణ సందడి గారు నెల్లూరు కు చెందిన ఆర్టిస్ట్.  బొమ్మలు వేయడమే కాకుండా సందర్భాన్ని బట్టి కవిత్వం చాలా తక్కువగా రాసినరు.  వీరు M.A. B.Ed. పూర్తి చేసి 10 సంవత్సరాలు Special Educator గా సేవలు అందించారు.  వీరు IRCSMSR  Spastics సెంటర్ లో మెంబర్ గా ఉన్నారు.  వీరు రాష్ట్రస్థాయిలో చిత్రకలలో పాల్గొన్నారు. చిత్రకళా ప్రపుార్ణ ఆవార్డు, రాజా రవి వర్మ ఆవార్దు, నెల్లూరు  ఇతర సంస్ధల నుండి ప్రతిభ పురస్కారం అందుకున్నారు. వీరు సందర్భాన్ని బట్టి మృత వీరుల కోసం అనేక చిత్రాలు గీసినరు. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి అయినా సాధారణంగా ఉండటం ఇష్టం.

ఇక ప్రస్తుత కవిత వీరు ఈ మధ్యలో నే రాసినరు.  చెట్టు విషాదం కన్నీళ్ళుగా అక్షర రూపం ఇచ్చారు. ప్రస్తుతం మనుషుల స్వార్థం కారణంగా చెట్లు మృత దేహాలుగా మారుతున్నయి.  ఇక అనువాద సౌరభం లోకి వెళదాం.

Weeping Tree...
===========
      Telugu Poet: Aruna Sandadi.
       Translated By Ravinder Vilasagaram.

Yes
I am crying...
I am woeing for my badness...

I have been shown as green for decades
I have been given oxygen to living beings...
Given coolness...
I have been given pleasant to nature lovers
Now I am cut into pieces...
Yes
I am weeping...

I am in the cradle hands for the children
I am for the chats of old men...
I am for the sake of the  Nature conservation...
I am given the flowers and sweet fruits
I am in the burning....dyeing...
Yes
I am crying...

I have feast your eyes with my flowers
I have been spreading the wonderful fragrance
I have been given ever health verbal herbs...
I have been seen so many harassments
I have been in the daily silent griefs...
I have been watched without pitiless people
Yes
I am Bevailing...
I am weeping...
I am crying...
I am woeing for my badness...

========= ========== ============ =====

Original Telugu poem:-

వృక్ష  విలాపం
=========

అవును నేను విలపిస్తున్నాను,
నాకు పట్టిన దుస్ధితిని చుాసి నేనువిలపిస్తున్నాను.
దశాబ్దాల తరబడి పచ్చగా వెలిగిన నేను,
ప్రాణ కోటికి జీవ వాయువు నోసంగిన నేను,
చల్లని ప్రసాదించిన నేను,
ప్రకృతి ప్రేమికులకు ఆహ్లదాన్ని అందించిన నేను,
రంపపు కోతలతో ముక్కలుగా నేను,
అవును విలపిస్తున్నాను,

చిన్నారుల ఊయలల కు నేను,
ముదుసలుల ముచ్ఛట్లకు నేను,
పర్యావరణ పరిరక్షణకు నేను,
ఫల మాధుార్యాలను అందించిన నేను,
కాల్చి బోగ్గు చేసి నా ప్రాణం పోతుా నేను,
అవును విలపిస్తున్నాను నేను,

కన్నుల విందు చేసే పువ్వులతొ నేను,
మనోహరమైన సువాసనలు వెదజల్లిన నేను,
నిత్య ఆరోగ్య ముాలికలు ప్రసాధించిన నేను,
కని విని ఎరుగని ఘాతుకాలు చుాసిన నేను,
నిత్య ముాగ రోదనలతో అలసి సోలసి నేను,
జాలి దయ లేని మానవ జాతిని చుాసి నేను,
అవును విలపిస్తున్నాను,
నాకు పట్టిన ఈ నా దుస్థితిని చుాసి నేను
                                   విలపిస్తున్నాను...
                                   
                                   సందడి అరుణ కుమారి,
                                            ఆర్టిస్ట్ , నెల్లూరు ..

=============== ========== ===========

https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1458915410893446

============ =========== =============

Translated By Vilasagaram Ravinder.

Sunday, 26 November 2017

అనువాద సౌరభం-23 అలిశెట్టి ప్రభాకర్ గారి కవిత్వం

అనువాద సౌరభం-23
Introduction:-
      అలిశెట్టి ప్రభాకర్(12-01-1954 –12-01-1993)
పాత కరీంనగర్ జిల్లా జగిత్యాల జన్మ స్థలం. మొదట ఆర్టిస్ట్ గా ఎదిగారు. ప్రారంభంలో పత్రికలకు పండుగలు,  ప్రకృతి, సినీ నటుల బొమ్మలు వేసేవారు.  తరువాత జ్యగిత్యాల సాహితీ మిత్ర దీప్తి పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించినరు. 1974 సంవత్సరంలో ఆంధ్ర సచిత్ర వారపత్రిక లో “పరిష్కారం” అచ్చయిన మొదటి కవిత. జీవిక కోసం జ్యగిత్యాలలో స్టూడియో పూర్ణిమ(1976) కరీంనగర్ లో స్టూడియో శిల్పి(1979) హైదరాబాద్ లో స్టూడియో చిత్రలేఖ(1983) ఏర్పాటు.  జీవిక కోసం ఫోటో గ్రాఫర్ గా, జీవిత పోరాటంలో కవిగా ఎదిగారు.  ఏనాడూ సంపాదన కోసం ఆరాటపడలేదు. తన కళ ప్రజల కోసమే అని చివరికంటా నమ్మినరు.
1. ఎర్ర పావురాలు (1978)
2. మంటల జెండాలు (1979)
3. చురకలు (1979)
4. రక్త రేఖ (1985)
5. ఎన్నికల ఎండమావి (1989)
6. సంక్షోభ గీతం (1990)
7. సిటీ లైఫ్ (1992) అచ్చయిన కవిత్వ సంకలనాలు.
    తండ్రి అలిశెట్టి చినరాజం, తల్లి లక్ష్మి, సహచరి భాగ్య, కుమారులు సంగ్రామ్ సాకేత్ లు హైదరాబాద్ లో నివాసం.

   ఇక ప్రస్తుత అనువాద కవితలు వారు సంవత్సరాల క్రితం రాసినా ప్రస్తుత సామాజిక పరిస్థితులకు కూడా వర్తించే విధంగా ఉన్న గొప్ప కవిత్వం.  ఈ కవిత్వం ముద్రణ వెనుక వీరి మిత్రుల కృషి ఎంతో ఉంది.  ఈ మధ్యలో వీరు కవిత్వం ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన Narsan Badri సార్ కు శనార్తులు.

     ఈ కవితలు అనువాదానికి ఎంచుకోవడానికి బహుశా నా నిజ జీవితంలో జరిగిన సంఘటనలు కొంచెం కారణం కావచ్చు.  కాలం మారచ్చు, సందర్భాలు మారచ్చు, కవిత్వం నిత్య చైతన్య మనడానికి అలిశెట్టి ప్రభాకర్ గారి కవిత్వం గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  ఇక అనువాద సౌరభం లోకి వెళదాం.  నాది స్వేచ్ఛానువాదం.

స్వేచ్ఛానువాదం:-

Even you are not competent to Apologise..
Or
You are inexcusable!
~~~~ ~~~~~ ~~~~~~~~~~~~~~~~~
         Telugu Poet: Alishetty Prabhakar
          Translated By Vilasagaram Ravinder.

You knew the the robbers
Who stole all of yours
Warm blood and flesh
By opening yours
Body in the presence
Of the public eyes...

You knew the Fraud
intellectuals Who supported
With nowadays
Methods of knave music's
On the Hunger-starves Dulcimer's
Within seconds...

You knew the pseudo political bulldozers
Who destructed the very very littles
Ambitious homes...

Even though
You didn't open your mouth
And didn't attack/give one little wordth

You didn't
unfurl the secret
flag
For the revolutionaries
Who was
in the Way of Agitations
At last...

Original Telugu poem:-

నువ్ క్షమార్హుడివి కావు...
                -అలిశెట్టి ప్రభాకర్.

యధేచ్ఛగా
నీ శరీరం బీరువా తెరిచి
వెచ్చని
నీ రక్త మాంసాల్ని కొల్లగొట్టే
బందిపోట్లెవరో నీకు తెలుసు.

సుతారంగా
నీ ఆకలి పేగుల సితారపై
సరికొత్త
దోపిడీ సంగీతాన్ని సమకూర్చిన
కుహనా మేధావులెవరో నీకు తెలుసు .

నీ చిరు చిరు
ఆశల కుటీరాల్ని విధ్వంసం గావించే
అరాజకీయ బుడ్డోజర్జెవరో నీకు తెలుసు.

అయినా
పెదవి విప్పి మాటన్నా సంధించవు.

చివరికి
ఉద్యమ రహదారుల్లో విలీనమైన వాళ్ళకి
ఒక రహస్య కేతనమైనా ఎగరెయ్యవు.

======== ========= ========= =====

https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1456866771098310
======== ======== ======== =======
Scenery...
~~~~~~

     Telugu Poet: Alishetty Prabhakar.
      Translated By Vilasagaram Ravinder.

Did you see ever
The transparent flowing blood river
turned into Sweat river...?

Did you read whenever
The green green
Block soil was written
by the ploughs language whenever...

Did you find the muscle redness
of factories fire place
with fire blowingness...

However
If it is Marble Statue Or
it is Parliamentary Building
He is the founder
He is the builder...
Yes it is ever...

======== ======== ========= ======
Telugu Original Poem:-

దృశ్యం...

   -అలిశెట్టి ప్రభాకర్.

పారదర్శకంగా కురుస్తున్న
రక్త వర్షం
చెమట నదిగా
రూపాంతరం చెంది
ప్రవహించడం
మీరెపుడైన చూశారా?

హరితహరితంగా
నల్ల రేగడి నేల మీద
సృజియించిన
నాగళ్ల లిపిని
మీరెపుడైన చదివారా?

కర్మాగారాల కొలిమిలో
కణకణా మండుతున్న
కండరాల ఎరుపుని
మీరెపుడైన కనుగొన్నారా?

యింతకూ పాలరాతి బొమ్మౌనా
పార్లమెంటు భవనమైనా
వాడు చుడితేనే శ్రీకారం
వాడు కడితేనే ఆకారం!

======= ======= ======= ===========

https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1457796094338711

======== =========== =========== ==

Translated By Vilasagaram Ravinder .

Wednesday, 15 November 2017

అనువాద సౌరభం-22 జగదీష్ కరే సార్ పోయెమ్

అనువాద సౌరభం-22.

Introduction:-
                జగదీష్ కరే గారు అనంతపురం జిల్లా రాయదుర్గంలో జర్నలిస్టు గా గత 33 యేళ్ళుగా పనిచేస్తున్నారు.
1990 - 91 ప్రాంతంలో వారి ఊరిలో సాహిత్య కార్యక్రమాలు,  కవి సమ్మేళనాలు చేస్తూ సాహిత్యం పట్ల అభిరుచిని పెంచుకుని దాదాపు 2003 ప్రాంతంలో కవితలు రాయడం ప్రారంభించారు. తదనంతరం వీరి కవితలు వివిధ దిన వారపత్రికల్లో ప్రచురించడంతో మరింత ఉత్సాహంతో కవితలు రాశారు. వీరికి 2010 లో గుండె ఆపరేషన్ బైపాస్ జరగడంతో ఆ సందర్భంగా మరింత సీరియస్ గా కవితలు రాశారు.  2011 లో వీరి మొదటి పుస్తకం 'సముద్రమంత గాయం' కవితా సంపుటి ఆవిష్కరించారు.  తర్వాత 2012 లో అంధుల జీవితాలను అంశంగా తీసుకుని 'రాత్రిసూర్యుడు' దీర్ఘకావ్యం విడుదల చేశారు. ఈ దీర్ఘకావ్యం హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ భాషలలో అనువాదమయ్యింది.  అలాగే బ్రెయిలీలోనూ వచ్చింది.  ఇంకా కన్నడ, ఒరియా భాషలలో అనువాదమవుతూవుంది.
ఇక వీరి మూడవ పుస్తకం 'రాత్రి నిశ్శబ్దం' కవితాసంపుటి ఈనెల 26న ఆవిష్కరిస్తున్నరు.
మంత్రి కాలవ శ్రీనివాసులు గారూ మరియు కె శివారెడ్డి గారూ ఈ ఆవిష్కరణోత్సవంలో పాల్గొననున్నరు.

             వీరు కన్నడ కుటుంబంలోజన్మించినరు. వీరి మాతృభాష కన్నడం. ఇది క్లుప్తంగా వీరి వివరాలు.

              ఇక ప్రస్తుత కవిత వీరు ఈ మధ్యలోనే రాసినరు. వర్తమాన ప్రపంచ ముఖ చిత్రం ఈ కవిత లో కనిపిస్తంది.  ఈ కవితలోని నది బహుశా మనిషిలోని మనసు కావచ్చు. మనషులలోని మనసులు ఎండిపోయాయి.  భౌతికంగా నదులూ ఎండిపోయాయి. స్వార్థం ఇవన్నిటికి కారణం. ఈ కవిత అనువాదం చేయడం కొంచెం కష్టమే అయింది. అందుకే కొంచెం ఎక్కువ స్వేచ్ఛను తీసుకున్న.
     
స్వేచ్చానువాదం:-

For River's Flow
                 Telugu Poet: Jagadeesh Kere
                 Translated By Vilasagaram Ravinder.

Here
And there
Banks are there
But inbetween no river
Flowing ever...

Sighs and sighs
You and me are uprooted waitings
For River flowings
In that waitings
Our inner hearts
Are cool and chillings
With Fire distresses

The paper boats
Are floating in the flowings
Of SKY clouds
Rainy journeys...

Coasts from Coasts
The inner waves
Running and running always
Disppearings
In the silent nights...

The coastal areas
Thirstiness
plants the flower plants
in the deserts...

The Spring opens
It's wings
In the Phantasm's sheds
In the seconds
Time it turned As
Autumn without leaves...

We are waiting and awaiting
For River flowing
In wounded and suffering...

In searching
We are sharing
Teardrops
And confounds...
We will conserve the memories...!
===== ======= ========= ===========
ORIGINAL TELUGU POEM:-

' నదీప్రవాహం కోసం '
    -Jagadeesh Kere.

అటూ
ఇటూ...
తీరాలున్నాయి
కానీ...
మధ్యలో నది ప్రవహించడం లేదు

నిట్టూర్పులతో
నేను....నీవు
నిరాశ్రయులై
నది ప్రవాహం కోసం నిరీక్షణ..
ఆ నిరీక్షణతో
హృదయాంతరాలలోని
బాధాగ్నిజ్వాలలు చల్లబడుతున్నాయి..

నింగి నుండి జారిన
వానజల్లు జాతరలో
కాగితప్పడవల ప్రయాణం...

తీరాల నుండి తీరానికి
ఉరుకుతున్న అంతరంగతరంగాలు
నిశ్శబ్ధ చీకటిలో జారిపోతున్నాయి

తీరాల దాహం ఎడారిలో
పూల మొక్కలను నాటుతూ
స్వప్నించిన గూటిలో
రెక్కలు విప్పిన వసంతం
క్షణాల ప్రయాణంలో
ఆకులు రాలిన శిశిరంలా మారింది..

నదీ ప్రవాహం కోసం నిరీక్షిస్తూ
గాయపడి
బాధపడి
వెదుకులాటలో తోడుగా
కన్నీటిని పంచుకుందాం
జ్ఞాపకాలను దాచుకుందాం....!

................................................................

https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1451781098273544

====== ======== ========== ======== ==========
Translated By Vilasagaram Ravinder.

Thursday, 9 November 2017

The Last Stanza... Ashok Avari

The Last Stanza...

The begining stanza is likely
show you
the height attraction...

The second stanza will
slip into your mouth as curd rice smoothly...

The third stanza digests and filled with meaningful message into your mind
And dances you like chemical electricity...

The remaining stanzas will overflow and run you like awareness sweats...

The last stanza balanced you and me and leads the next poem starting stanza...

(Telugu poem, Avari Ashok, 9000576581)

Translated :

Vilasagaram Ravinder.
94409 32934.

తెలుగు పోయెం:

శీర్షిక:
చివరి పాదం
========

ప్రారంభ పాదం
నిన్ను ఆకర్షించడానికి
ఒక ఎత్తుగడలాగనే కనిపిస్తది

రెండో పాదం ఆ వెంటే
మీగడ కలిపిన అన్నంలా
గొంతుకలకు సర్రున జారుతది.

ఇక మూడో పాదం
జీర్ణమై రసాయనిక విద్యుత్తులా
మస్తిష్కాన్ని భావమై ఎలిగిత్తది

ఆ తదుపరి పాదం
ఆపాదమస్తకాల్ని పరిగెత్తించి
నీలో చైతన్య స్వేదాన్ని చిందిస్తది.

చివరి పాదం మాత్రం
నిన్నూ నన్ను కలగలిపి
తులాదండంలా సరిసూత్తది
మరో ప్రారంభం వైపు కదిలిస్తది

Avari Ashok, 9000576581


08.05.2017.

Wednesday, 8 November 2017

అనువాద సౌరభం-21 అన్వర్ LIFE

అనువాద సౌరభం-21

Introduction:-
 
     అన్వర్ గారు సీనియర్ ప్రముఖ కవి, కవిత్వంతో పాటు నవల, కథలు రాసి తెలుగు సాహిత్యంలో ఒక సుస్థిర స్థానాన్ని పొందారు.
రచనలతోపాటు సామాజిక సేవ చేస్తున్న అన్వర్ యం. ఏ (సోషియాలజీ, తెలుగు) చదివారు.వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ ఎడుకేటర్ గా పని చేస్తూ విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులకు నిరంతరం ఆరోగ్య విద్యతోపాటు సామాజిక స్పృహతో కూడిన చైతన్యవంతమైన మోటివేషన్, టైం మేనేజ్మెంట్  కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఆరోగ్య విద్యాధికారిగా , కవిగా తన సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్న చైతన్యవంతమైన సామాజిక కవి.చిన్న వారి నుంచి పండు ముసలోళ్ళ వరకూ ఆరోగ్య రహస్యాలు వివరించే ఆరోగ్య సహాయకులు. అద్భుతమైన రచనలు చేస్తూనే అందమైన జీవన రహస్యాలు వివరించే మంచి కౌన్సిలర్. కొత్తగా రాస్తున్న కవులకు మార్గదర్శిగా నిలబడుతూ ఎన్నో సాహిత్య విషయాలను తెలిపి ఉత్తమ రచనలకు ప్రేరణగా నిలబడుతున్నారు.

         వీరు 1.“తలవంచని అరణ్యం” (1999 ), “ముఠ్ఠీ” (2007),  “సవాల్” (2012 )కవితా సంపుటాలను, “బక్రీ” కథల సంపుటి ( 2015 ), “జమీలాబాయి” నవల ( 2017) వెలువరించారు.  1.“అజా” 2.“నాయిన” 3.“తెలంగాణ కవిత” మొదలైన కవితా సంపుటాలకు సంపాదకత్వం వహించారు. 1."1969 వరంగల్ అమరవీరులు”, 2. “ఆత్మ బలిదానాలు” మొదలైన ఉద్యమ రచనలు చేశారు.వీరు రాష్ట్ర స్థాయిలో అనేక అవార్డులు పొందారు.

       ప్రస్తుత కవిత వీరు మూడేళ్ళ క్రితం రాసినా ప్రస్తుత సామాజిక పరిస్థితులకు కూడా వర్తించే విధంగా ఉన్న గొప్ప కవిత. ఈ కవిత హైదరాబాద్ హై కోర్ట్ ప్రాంగణంలో నా స్నేహితుని ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారం కొరకు వచ్చి అక్కడి చెట్టు కింద కూర్చుని  చేసిన స్వేచ్చానువాదం. ఇలాంటి కవిత అనువాదానికి ఒదగదు. అందుకే కొంచెం ఎక్కువ  స్వేచ్ఛను తీసుకున్న.
======== ========= ========== ==========
స్వేచ్చానువాదం:-
=============

LIFE...
       Telugu Poet : Anwar.
       Translated By Vilasagaram Ravinder.

Perhaps...
There is the the Sea
dried in Either You Nor Me.

Tears are pouring
Body is shivering
The tongue is losing
The speech continuing...

We are like swooning
Fainted...
And horrified...

Our arms are Widening
We are embracing
With love and affection

We are deciding
There is nothing
We want nothing
Silently
Unwantedly
Condemning
Or Rejecting.

We remain watching
with pressing
All the directions

We are pirouetting
Like dead body last Travelling
Taking in our mind The Indignity
The Incivility
The social Raping
The Society Murdering.

Passing all the days
Like that with the above documentary evidences...

We are walking and walking
With buried our minds continuing
Like Refugees
Like Evacuees
without the camps Living
as the last days.

After Learning The Acting
To our Lifes Travelling
We are Listening
The Real Life Tragedies sadness sounds
As Musical Sounds...!
As Musical Rhythms...!!

====== ======= ========== ==========

Telugu Original Poem:-

బతుకు
~~~~
        -అన్వర్.

బహుశా  నీలోనో  నాలోనో
ఇప్పుడొక ఒక సముద్రం ఇంకిపోయింది.

కన్నీళ్ళు కారుస్తూనే ఉంటం
గొంతు గాద్గాధికమై ఒళ్ళు కంపిస్తూనే ఉంటుంది.
సొమ్మసిల్లి పడిపోయినంత బేజారైపోతం.
బాహువులు చాలా విశాలమైపోయి ఆర్తిగానే కౌగిలించుకుంటం.
ఇప్పుడిక వేరే ఏదీ లేదని అసలేదీ వద్దని
మౌనంగానో నిరాలంగానో నిరాసక్తంగానో
ఖండిస్తూనో నిరసిస్తూనో
దిక్కుల్ని గుచ్చి గుచ్చి చూస్తూ ఉండిపోతం.

అవమానం, సామూహిక మానభంగం, జాతి హననం
నిత్యం పాడె మోసినట్టే మోస్తూ తిరుగుతం.

అంతా అలాగే
ప్రతి రోజూ నిత్యమై సాక్షమై నిలబడుతది.

మనం మాత్రం హృదయాన్ని పాతరేసి
శిబిరం లేని శరణార్థుల్లెక్క
చివరి క్షణపు బతుకు లెక్క  సాగుతుంటం.

జీవితానికి నటించడం నేర్పించాక
నిజ జీవిత దుక్కాలాపన కూడా
రాగమై వినిపిస్తది.

https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1447251148726539

=====  ========  =========  ==========
Translated By Vilasagaram Ravinder.

Monday, 30 October 2017

SKY... SIGH... అనువాద సౌరభం-20 BIKKI KRISHNA SIR'S POEM

అనువాద సౌరభం-20

Introduction:
~~~~ ~~~~

           బిక్కీ కృష్ణ గారు ప్రముఖ కవి, విమర్శకులు,  గేయ రచయిత, సింగర్, నటులు, సామాజిక కార్యశాలి, దక్షిణ భారతదేశంలో 5000లకు పైగా పాత్రికేయులకు గ్రామాభివృద్ధి సంస్థ ద్వారా ముద్రణా వెబ్ జర్నలిస్టులకు శిక్షణను ఇచ్చిన వారు. వీరు ప్రస్తుతం 10TV Programme Director గా పని చేస్తున్నారు.

               వీరు S.S. Trust కు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.  గిడుగు ఫౌండేషన్ కు Organizing Secretary గా పని చేస్తున్నారు.  వీరు “కవితా వికాస సంస్థ” కు జనరల్ సెక్రెటరీ గా సేవ చేస్తున్నారు. వీరు అనేక సంస్థల ద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు.

         వీరు పత్రికలలో అనేక వ్యాసాలు రాస్తూ కొత్త కవులకు,  రచయితలకు, పాత్రికేయులకు,  నటులకు  మార్గ నిర్దేశం చేస్తున్నారు. అనేక రచనలు చేస్తూ సమ సమాజ నిర్మాణం కొరకు వ్యూహాలూ రచిస్తున్నరు. వీరు నిత్య చైతన్య శీలురు.

        ఇక  ప్రస్తుత కవిత విషయానికి వస్తే ఈ కవిత చదివిన కొద్దీ కొత్త కొత్త సందర్భాలకు, భిన్నమైన సమాజాలను ఈ కవితలోని పంక్తులు అక్షర సాక్షాలు.  నేను సంక్లిష్ట సందర్భంలో ఉండి ప్రయాణంలో చేసిన అనువాదం ఇది. నా ఈ అనువాద సౌరభానికి CV Suresh గారు సుగంధాన్ని అద్దుతనే ఉన్నరు. ఇక అనువాద సౌరభం లోకి వెళదాం.

స్వేచ్చానువాదం :-

Sky... Sigh...!
~~~~~~~~
     Original Telugu Poet: Bikki Krishna Garu .
      Translated By Vilasagaram Ravinder.

Honour to the air...
Just  with  the incense of the flowers!

Is it the real leeway!
If the storming winds
Bulldoze the trees
Which gives
Oxygen, Flowers
Leaves...!
May not be gratitude
To the axe...
But , how obligatory to the tree
Which gives the axe stick
From her trunk!!

Because of joining the rivers
The oceans make Salty waters...!

By watching the drainage waters
Of the rivers
The hills laugh and laughers
Planting the moustaches of trees
Everywhere in hills...!

The cotton crop gets
 the jealous
By watching the birds
feeding nuts
in near by crops...
It weaves
the white threads
with so many twists
as soon as the innocent birds
 immolate to the cruel prowl webs...!

Else
What can I describe about animals?
They jumps and jumps
Here and there in the nights
In the name of freedom and freeness...
They hide them in the shades
Of trees and bushes
Of dark forests
In the mornings
Not to see the Sunlights...!

The Sky silently sighs
Meanwhile the timelence is watching
The wonders and surprises...!

====== ======= ======== =======

ఆకాశం ..నిట్టూర్పు!

పూల పరిమళాల వల్లనే
గాలికి గౌవరం లభిస్తుంది!
పూలు ఆకులతోపాటు ఆక్సిజన్ ఇచ్చిన
చెట్టును కూల్చే పెనుగాలిది
నిజమైన స్వేచ్ఛఅవుతుందా?

గొడ్డలికి కృతజ్ఞత లేకపోవచ్చు
తనను కూల్చడానికి కట్టెపిడి నిచ్చే
చెట్టుది ఎంత త్యాగ గుణమో కదా?

నది తనలో చేరడం వల్లనే కదా
సముద్రం ఉప్పునీరుగా మారింది!
వాగులు వంకలతో మైలపడిన నదిని చూసి
పర్వతాలు చెట్లకొమ్మలమీసాలు మెలివేస్తూ
గంభీరంగా నవ్వుకుంటాయి!

పక్కచేనులోవాలిన పక్షుల్ని చూసి
అసూయ చెందిన పత్తిచేను
చివరకు చిక్కుముడి దారాల వలగా మారి
అమాయక పక్షుల్ని వేటగానికి బలిస్తుంది!

ఇక జంతువుల గురించి చెప్పే దేముంది?
స్వేచ్ఛపేరుతో చీకటిలో చిందులుతొక్కుతాయి
వెలుగునిచ్చిన సూర్యుడు ఎక్కడ చూస్తాడోనని
తెల్లారగానే అభయారణ్యాల్లో దాక్కుంటాయి!

కాలం కెమరాలో (వి)చిత్రాలను చూస్తూ
ఆకాశం మౌనంగా..నిట్టూరుస్తుంది.!

 -బిక్కి కృష్ణ
 సెల్:8374439053

https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1428740793910908
======= ====== ======== ========
Translation by Vilasagaram Ravinder.

Tuesday, 24 October 2017

అనువాద సౌరభం-19 నాగెళ్ళ కవిత

అనువాద సౌరభం-19

Introduction:-

         నాగిళ్ళ రమేష్ గారు వృత్తి రీత్యా తెలుగు ఉపాధ్యాయులు. మారుమూల పల్లెలో పిల్లలతో కవిత్వం రాపిస్తూ తను కవిత్వం అయి జీవిస్తున్నారు. వీరు మొదట ఒక నానీల సంపుటి “వడిసెల రాళ్ళు”  మొన్న మొన్ననే ఒక కవిత్వ సంపుటి “ఉద్దరాసి పూల చెట్టు” వేసి ఉన్నరు. త్వరలో వీరు విద్యార్థుల కవిత్వ సంకలనం వేయనున్నరు. ప్రస్తుతం  వీరు కొలకనూరి ఇనాక్ నవలల పై పి. హెచ్.  డి చేస్తున్నరు.

       ఈ కవిత విషయానికి వస్తే అనువాదం చేయడం కొంచెం కష్టమే అయింది. ముఖ్యంగా కవితా నిర్మాణం, తెలంగాణ భాషలోని నుడికారం ఆంగ్లంలోకి తేవడానికి చాలా కష్ట పడాల్సి వచ్చింది.  ఇంకా కొన్ని మార్పులు అవసరమే.  కొంచెం ఎక్కువ స్వేచ్ఛను తీసుకున్న.

స్వేచ్చానువాదం:-
   

Who...?
~~~~
       Telugu Poet: Nagilla Rajesh
       Translated By: Vilasagaram Ravinder

Introducing the Sun rising first time
Holding my little finger
Treating Eyelid of my eyelids
Who is that Earthly Rainbow...!?

In this untasted life
pouring the tasted harsegram’s soup
With the love utensil
Who is He?

For made me as purely paddy dumpling
Who is the moon leaf
Which is break as tree metel leaf ?

In that heading
milk with ghee boiling
For introducing
Me the life's grammar
Who is that grammar teacher ?

Who is the Eternal river ?
In this long travelling
Not to shed my heart flower
In this long travelling...

==== ====== ====== =======

Original Telugu poem:-

ఎవరు?
=== ==

నా వేలు పట్టుకొని
నా కంటికి కనుపాపై
సూర్యోదయాన్ని కొత్తగా పరిచయం చేసిన
ఈ మట్టి సింగిడి ఎవరు

ఈ సయిలేని బతుకుల
కమ్మటి ఉలువ చారుగా
ఒంపబడిన
ఈ ప్రేమ పాత్ర ఎవరు

నన్ను తేటని
వడ్లకుప్పను జేసేతందుకు
ఆకుపెల్లలా ఇరిగిపోయిన
ఈ ఎన్నీల కొమ్మ ఎవరు

నెత్తిన నెయ్యివాలు ఉడుకంగ
బతుకు వ్యాకరణాన్ని
నేర్పిన
ఈ వైయాకరణి ఎవరు

ఇంత దూరపు పయనంలో
నా గుండెపువ్వును వాడపోనియ్యక వుంచిన
ఈ ఎండిపోని నది ఎవరు.

నాగిళ్ళ రమేశ్ .
====== ====== ======= ========= ==
https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1433000820151572

====== ====== ====== ========= ====

Translated By Vilasagaram Ravinder.