Monday, 30 October 2017

SKY... SIGH... అనువాద సౌరభం-20 BIKKI KRISHNA SIR'S POEM

అనువాద సౌరభం-20

Introduction:
~~~~ ~~~~

           బిక్కీ కృష్ణ గారు ప్రముఖ కవి, విమర్శకులు,  గేయ రచయిత, సింగర్, నటులు, సామాజిక కార్యశాలి, దక్షిణ భారతదేశంలో 5000లకు పైగా పాత్రికేయులకు గ్రామాభివృద్ధి సంస్థ ద్వారా ముద్రణా వెబ్ జర్నలిస్టులకు శిక్షణను ఇచ్చిన వారు. వీరు ప్రస్తుతం 10TV Programme Director గా పని చేస్తున్నారు.

               వీరు S.S. Trust కు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.  గిడుగు ఫౌండేషన్ కు Organizing Secretary గా పని చేస్తున్నారు.  వీరు “కవితా వికాస సంస్థ” కు జనరల్ సెక్రెటరీ గా సేవ చేస్తున్నారు. వీరు అనేక సంస్థల ద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు.

         వీరు పత్రికలలో అనేక వ్యాసాలు రాస్తూ కొత్త కవులకు,  రచయితలకు, పాత్రికేయులకు,  నటులకు  మార్గ నిర్దేశం చేస్తున్నారు. అనేక రచనలు చేస్తూ సమ సమాజ నిర్మాణం కొరకు వ్యూహాలూ రచిస్తున్నరు. వీరు నిత్య చైతన్య శీలురు.

        ఇక  ప్రస్తుత కవిత విషయానికి వస్తే ఈ కవిత చదివిన కొద్దీ కొత్త కొత్త సందర్భాలకు, భిన్నమైన సమాజాలను ఈ కవితలోని పంక్తులు అక్షర సాక్షాలు.  నేను సంక్లిష్ట సందర్భంలో ఉండి ప్రయాణంలో చేసిన అనువాదం ఇది. నా ఈ అనువాద సౌరభానికి CV Suresh గారు సుగంధాన్ని అద్దుతనే ఉన్నరు. ఇక అనువాద సౌరభం లోకి వెళదాం.

స్వేచ్చానువాదం :-

Sky... Sigh...!
~~~~~~~~
     Original Telugu Poet: Bikki Krishna Garu .
      Translated By Vilasagaram Ravinder.

Honour to the air...
Just  with  the incense of the flowers!

Is it the real leeway!
If the storming winds
Bulldoze the trees
Which gives
Oxygen, Flowers
Leaves...!
May not be gratitude
To the axe...
But , how obligatory to the tree
Which gives the axe stick
From her trunk!!

Because of joining the rivers
The oceans make Salty waters...!

By watching the drainage waters
Of the rivers
The hills laugh and laughers
Planting the moustaches of trees
Everywhere in hills...!

The cotton crop gets
 the jealous
By watching the birds
feeding nuts
in near by crops...
It weaves
the white threads
with so many twists
as soon as the innocent birds
 immolate to the cruel prowl webs...!

Else
What can I describe about animals?
They jumps and jumps
Here and there in the nights
In the name of freedom and freeness...
They hide them in the shades
Of trees and bushes
Of dark forests
In the mornings
Not to see the Sunlights...!

The Sky silently sighs
Meanwhile the timelence is watching
The wonders and surprises...!

====== ======= ======== =======

ఆకాశం ..నిట్టూర్పు!

పూల పరిమళాల వల్లనే
గాలికి గౌవరం లభిస్తుంది!
పూలు ఆకులతోపాటు ఆక్సిజన్ ఇచ్చిన
చెట్టును కూల్చే పెనుగాలిది
నిజమైన స్వేచ్ఛఅవుతుందా?

గొడ్డలికి కృతజ్ఞత లేకపోవచ్చు
తనను కూల్చడానికి కట్టెపిడి నిచ్చే
చెట్టుది ఎంత త్యాగ గుణమో కదా?

నది తనలో చేరడం వల్లనే కదా
సముద్రం ఉప్పునీరుగా మారింది!
వాగులు వంకలతో మైలపడిన నదిని చూసి
పర్వతాలు చెట్లకొమ్మలమీసాలు మెలివేస్తూ
గంభీరంగా నవ్వుకుంటాయి!

పక్కచేనులోవాలిన పక్షుల్ని చూసి
అసూయ చెందిన పత్తిచేను
చివరకు చిక్కుముడి దారాల వలగా మారి
అమాయక పక్షుల్ని వేటగానికి బలిస్తుంది!

ఇక జంతువుల గురించి చెప్పే దేముంది?
స్వేచ్ఛపేరుతో చీకటిలో చిందులుతొక్కుతాయి
వెలుగునిచ్చిన సూర్యుడు ఎక్కడ చూస్తాడోనని
తెల్లారగానే అభయారణ్యాల్లో దాక్కుంటాయి!

కాలం కెమరాలో (వి)చిత్రాలను చూస్తూ
ఆకాశం మౌనంగా..నిట్టూరుస్తుంది.!

 -బిక్కి కృష్ణ
 సెల్:8374439053

https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1428740793910908
======= ====== ======== ========
Translation by Vilasagaram Ravinder.

No comments:

Post a Comment