Saturday, 6 January 2018

అనువాద సౌరభం-29.
Introduction:-
          నేను 2013 నుంచి కవిత్వం రాస్తున్నా. ఇంటర్మీడియట్ వయసులో రాసిన ఆ తర్వాత చదవడం కొనసాగింది. 2016 లో కరీంనగర్ కవి మిత్రులు ప్రోత్సహించారు. ఈ నేపథ్యంలో “నది పలికిన వాక్యం” కవిత్వ సంకలనం వేసాను. పోయిన సంవత్సరం ప్రపంచ తెలుగు మహాసభల్లో నానీల నిప్కలు ఆవిష్కరణ  చేద్దాం అనుకున్న. కానీ నా సమస్యల కారణంగా వీలు కాలేదు.  బహుశా ఈ నెలలో ఆవిష్కరణ ఉంటుంది.  ఇది క్లుప్తంగా నా పరిచయం. ఇంకా రెండు మూడు సంపుటాలు వేయగలిగిన కవిత్వం ఉన్నది. వీలును బట్టి వేస్తాను.

          ఇక అనువాదం విషయానికి వస్తే 28 వారాల క్రితం ఒక గ్రూపులో ప్రారంభించాను. కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఆ గ్రూపులో నుంచి బయటపడిన వారం క్రితం.  నేను ఒక పని మొదలు పెట్టాను అంటే దాదాపు వదిలెయ్యను. అందుకే ఈ రోజు నుంచి వారంతో సంబంధం లేకుండా నా ఫేస్ బుక్ గోడపైననే పోస్ట్ చేస్తూ ఉంటాను. నేను ఇంకా అనువాద మెలకువలు నేర్చుకుంటూనే ఉన్న.  ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పమని పెద్దలకు మనవి.

     ఈ కవిత అనువాదం రెండు నెలల క్రితం చేసిన.  పోయిన నెలలో వేరే రాష్ట్రంలో ఒక కవి సమ్మేళనం లో పాల్గొన వలసి ఉండె. కానీ నా సమస్యల కారణంగా వీలు కాలేదు.  ఆ సందర్భంగా నా ఈ కవిత అనువాదం చేసిన. ఈ కవిత మూడేళ్ళ క్రితం రాసినా ఇప్పటి సమాజంలో అలాగే ఉన్నయి పరిస్థితులు.


What is This?
~~~ ~~~~~~~~
          Telugu Poet:- Vilasagaram Ravinder.
          Translated By Vilasagaram Ravinder.

Man is dying ...
Covering with religious beliefs
Encouraging with caste systems

What else
Man is unseen permanently
Without shedding teardrops ruthlessly...

Man is dying...
Without love and affection
Without giving the last lovable farewell...

Man is dying...
In the hands of ISM’s iron rods
He is cutting his head by himself
Unnecessary pleadings
He is dying...
He is hewing...
He is killing himself...
He is vanishing himself...

======== ========= ========== =======

Telugu Original poem:

ఏమిటిది?
~~~~~
       -విలాసాగరం రవీందర్.

మనిషి మరణిస్తున్నడు
మతం ముసుగేసి
కులం కుంపటి ఎగేసి.

కారణం ఏదయితేనేం
మనిషి రాలిపోతున్నడు.
కన్నీటి చుక్కలు కాకుండానే
మనిషి మాయమయితున్నడు
ఆత్మీయ వీడ్కోలు లేకుండానే.

ఇజాల ఇనుప పంజరంలో ఇరుక్కొని
తనను తాను తెగ నరుక్కుంటున్నడు.
పిడి వాదాల శరాలతో
తన తలను తానే పెకల్చుకుంటున్నడు.

తేది:20-05-2015 తేదిన రాసిన కవిత.

"నది పలికిన వాక్యం" సంకలనం లోని కవిత్వం.
======== =========== ========== =======

అనువాద సౌరభం-28 పెనుగొండ సరసిజ గారి కవిత

అనువాద సౌరభం-28
~~~~~~~~~~~~
Introduction:-

       పెనుగొండ సరసిజ గారు చాలా కాలం నుంచి కవిత్వం రాస్తున్నారు.  సాహితీ ప్రపంచంలో పెనుగొండ బసవేశ్వర్, సరసిజ దంపతులు కవిత్వం,  కథలు రాస్తున్న మరొక సాహితీ దంపతులు. వీరు ఇరువురు త్వరలో కవిత్వ సంకలనాలు వేయనున్నరు. పెనుగొండ సరసిజ గారు కరీంనగర్ సిటీ కేబుల్ లో వార్తలు చదువుతారు.  కవిత్వం రాస్తున్నారు.  కథలు కూడా రాస్తారు.

ఈ కవిత వారు ఈ మధ్యలో నే రాసినరు.  పెళ్ళి అయ్యాక కొత్తగా వచ్చిన వివిధ పరిస్థితులపై కొత్త కుటుంబ సభ్యులు ఎలా ఉంటరు, వారి ప్రేమ ఆప్యాయత ఈ కవితలో మనం గమనించవచ్చు.

Sky Like Memories...
~~~~~~~~~~~~

       Telugu Poet: Penugonda Sarasija
       Translated By Vilasagaram Ravinder

When
My mind turned into New Bridegroom
He made me not only happy but came also near to my heart...
The Nieces were like street friends at that time
Some Decency...
Some fear...
Some Own feelings
Some rightness...
The newly introduction
That made the total lifetime home
The Home of my Mother In law's...

...

When
We turned the street turning...
The Hibiscus flowers were seen like full moonlight
They welcomed us like their lovers...

...

The Marigold flowers
which were around the home
They were like flowers
of the mother's hair dressers...
They made that like beautiful home...

....

In between the home
In the Canopy
The Jasmines were weaving
Like the Young Lady's Beautiful Inert
The twisting and the twirling...

...

On the early mornings
On the the Winter Days
My Hand palms
are heaten And touching my cheeks
Are like my husband's kisses
Feelings
They turned into red roses...

...

However
Presently no Home of My Mother In law's is there
Yet
Our Landmarks are very
High Like Sky...
In our memories...
Remains...

========== ============ ==========

Telugu Original poem:-

///ఆకాశమంత జ్ఞాపకం///

కొత్త పెళ్ళికూతురైన నా మదిని
మురిపించిన మనసైనవాడు
దస్తీబిస్తీ ఆటల్లో
జట్టువిడవని జతగాళ్ళలా ఆడబిడ్దలు
కొంచెం బిడియం...
కొంచెం భయం ....
కొంచెం స్వంతం...
కొంచెం హక్కులా...
కొత్తగా పరిచయమై..
మొత్తంగా అయిన అత్తారిల్లు...

...

మూలమలుపు తిరగ్గానే కనిపించే
ముద్దగా పూసిన మందారాలు
ప్రియురాలి కోసమెదురొచ్చే
ప్రియుడిలా మమ్మల్ని ఆహ్వానించేవి.

...

ఇంటి చుట్టున్న బంతి చెట్లు
అమ్మ శిక చుట్టూ ముడిచిన
పువ్వుల్లా  ఇంటిని సింగారించేవి.

...

ఇక మధ్యలో పందిరికి పారిన
మల్లెతీగ, పడుచు పిల్ల వాలుజడలా
వయ్యారాలు బోయేది.

...

పొద్దు పొద్దునే మండే పొయ్యిలోని
సన్నని మంటకు వెచ్చచేసిన అరచేతులు
బుగ్గల్నితాకి తాకగనే మగని వెచ్చని
ముద్దులా తోచి చెక్కిళ్ళు ఎరుపెక్కేవి.

...

        అయితే
ప్రస్తుతానికి ఇప్పుడక్కడ
మా అత్తాగారిల్లు లేదు
కాని మా ఆనవాళ్ళు మాత్రం
ఆకాశమంత జ్ఞాపకంలా
ఇంకా మిగిలే వున్నాయి.

  -పెనుగొండ సరసిజ.

======== ========== ======== ======

https://www.facebook.com/groups/kavisammelanam/permalink/1493648740753446/

======== ========== ======== ======

Translated By Vilasagaram Ravinder.

Sunday, 24 December 2017

అనువాద సౌరభం-27 వర్చస్వి సార్ పోయెమ్

అనువాద సౌరభం-27.
(ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రత్యేకం)
Introduction:-
       వర్చస్వి గారు కవి, కథకులు,  చిత్రకారులు,  వ్యంగ్య చిత్రకారులు, అనువాదకులు. ఊపిరి సలపని లెక్కల శాఖలో ఉన్నత ఉద్యోగం చేస్తూ సృజనకారులుగా రాణిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి.
      వీరు ఇంతవరకు 1. వర్చస్వీయం ( తెలుగు విశ్వవిద్యాలయం ఆర్ధిక సహకారంతొ ప్రచురణ ) స్వీయ కథల సంపుటి, 2. లోకస్సమస్తా...(2014) కవితా సంకలనం,  3. ఒక కార్టూన్ల పుస్తకం (ఎమెస్కో పబ్లికేషన్స్ ద్వారా) వేసినారు. కొన్ని వ్యాసాలు కూడా వ్రాసారు. మరికొన్ని కవిత్వ, కథల,  అనువాద పుస్తకాలు వేయడానికి పూనుకుంటున్నారు.
    ప్రస్తుత కవిత వీరు చాలా కాలం క్రితం రాసారు.  డిసెంబర్ 15 నుంచి 19 వరకు హైదరాబాద్ లో జరిగే మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు వర్తించే విధంగా ఉన్న గొప్ప కవిత.  వారు ఈ మధ్యలో పోస్ట్ చేసారు. ఈ కవితను నేను వ్యాఖ్యానం చేయాలంటే మళ్ళీ అదో వ్యాసం అవుతుంది.  అక్షర శక్తి గురించి,  సాహిత్యం ప్రపంచాన్ని ఏ విధంగా ఏకం చేస్తుందో, సాహితీ ప్రక్రియలలో కవిత్వం ఒక విలక్షణమైన ప్రకృయ. చివరగా కవిత్వం విశ్వజనీనమైనవి,  విశ్వంభరం అవుతుంది అని చెప్తారు.
    ఈ అనువాదం విషయానికి వస్తే నేను అనువాదం చేసి దాన్ని పరిశీలించమని మరొక అనువాదక మిత్రునికి పంపినాను. వారు దాన్ని పరిశీలించి వారు మరొక అనువాదాన్ని పంపినారు. ఈ క్రింది విధంగా అవి ఉన్నవి.


Universe...
      Telugu Poet: Varchaswee.

When the character of the alphabet
Standing regal in crystal clear
On the horizon

When the churning of alphabets
sweeping the latitudes and longitudes

When the ends of the arcs of starts
In the wards of galaxies
Are touching the poles

When the Conglomeration of continents
Is cooking poesies in capacious pails

In the desert fields
In the river minds
In the Ghats and Valleys
In the Plateau Streets
Taking the poetry tongue In the bags
Wandering by the world pedestrians
Welcomes and welcomes

Character of the alphabet becomes
One Door at that times...
This time is that uniting into the universal One

Special thanks to the excellence of the world poetry

======== ======= ========= =======
Second Translation:-

Universe...
  Telugu Poet: Varchaswee.
   
When
Character of the alphabet is
clear in this
earth It is
very Perspective -

When
The character of the alphabet is digging
And Smashing
the Lines of latitude
and longitudes -

In the world of literature
The Arcs of Stars
Tactful the Poles -

All the Continents
allegro the poetry Cooks
in the Universal Bowl -

All the literatures
united All the tangents
for One -

In the desert fields
In the river minds
In the Ghats and Valleys
In the Plateau Streets
Taking the poetry tongue In the bags
Wandering by the world pedestrians
Welcomes and welcomes

The character of the alphabet becomes
One Door at that times...
This time is that uniting into the universal One

Special Thanks
to the excellence
of the World Poetry...

======= ======== ======== ===========

Original Telugu poem:-

//విశ్వంభరం //(ప్రపంచ మహాసభల సందర్భం...కాబట్టి, నా పాత కవితే)

అక్షరం క్షితిజంపై స్పష్టంగా
దృగ్గోచరమౌతుంటే -

అక్షర మధనం
అక్షాంశ రేఖాంశాల్ని చెరిపేస్తుంటే -

సాహితీ విను వీధుల్లో
నక్షత్ర చాపం రెండు ధృవాల్నీ
స్పర్శిస్తుంటే -

ఖండ ఖండాలు కవితాదరువులు
అఖిలాండ భాండంలో వండుతుంటే -
అక్షర చక్రభ్రమణం
దివారాత్రాలూ
భావచిత్రంగా చిత్రిక పడుతూంటే
సాహితీ సమాంతరాల్ని
ఒక ఏకీకృత తిర్యగ్రేఖ కలుపుతు పోతూ వుంటే -

ఎడారుల మడులలోనైనా
నదీ నదాల ఎదలనైనా
కనుమల లోయలనైనా
పీఠభూముల వాటికలలోనైనా
కవితా గొంతును సంచిలో  వుంచుకు
తిరిగే ప్రపంచ బాటసారిని...
స్వాగతించే హేల!
అక్షరం ఏకైక గవాక్షం అవుతున్న వేళ!!
అక్షరాన్ని విశ్వంభరంగా
చేస్తున్న వైనం ఈ దినం!
ప్రపంచ కవితా మతల్లికి ఇదే నా నీరాజనం...!!.
         -వర్చస్వి.
       ======= ======= ========= =========


https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1487087264742927

======= ======== =========== ======
English Translations...

Saturday, 16 December 2017

అనువాద సౌరభం-26

అనువాద సౌరభం-26.

Introduction:-

      కట్టా శ్రీనివాస్ గారు వృత్తి రీత్యా ఆంగ్ల ఉపాధ్యాయులు. వీరు 2001 లో “మూడు బిందువులు” 2012 లో “ మట్టి వ్రేళ్ళు” సంకలనాలు ప్రచురించారు. వీరి కుమార్తె అక్షిత కూడా రచయిత్రి. ఒక కవిత్వ సంకలనం వేసింది.

   ఇక ప్రస్తుత కవిత అనువాదం విషయానికి వస్తే ఒక ఆంగ్ల ఉపాధ్యాయుల కవితను అనువాదం చేయడం సాహసమే.  ఈ కవిత ఒక విశ్వజనీనమైనది. మనల్ని మనం పారుసుకోవడం మళ్ళీ మళ్ళీ మనమే వెతుక్కోవడం ప్రతి మనిషి చేసే పనే. అనుభూతి ప్రధానమైన విషయం ఈ కవిత నిండా ఉన్నది.  జీవితం నిండా అనుభవాలు వెంట తీసుకెళ్ళుతుంటాం. అప్పుడప్పుడు పారేసుకుంటం. మళ్ళీ వెతుక్కోవడం మామూలే. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ కవిత నిండా మనకు ఒక తాత్విక చింతన కనిపిస్తుంది.

See me off...
~~~~~~~~~

   Telugu Poet: Katta Srinivas
    Translated By Vilasagaram Ravinder.

To enjoy happiness in searching
See me off somewhere...
Again and again ...

When dried in thirsty and
Want to wet in Love rain with chatting...
Jumped into with keen eyes...

When the path visible for sight
I pricked the reins like brutal bull (Ganugeddu)...
As it was dangerous

I extracted my heart
And tie it to my leg as life resounding
When I didn't hear my leg sounds
For a Short Time...
While walking...

I felt happy as reach home
When I raised a question of Why?
Even I did More and more...

To search myself
See me off...
Again and again...

So that I live till now
So that I can touch myself
Yes
Because of that
I also reveal you...
I also indicate you...

========= ======== ========== =========
Original Telugu poem :-

కట్టా శ్రీనివాస్ || నన్ను నేనే పారేసుకుంటాను ||

వెతుక్కోవడంలో ఉన్న
సంతోషాన్ని ఆస్వాదించేందుకు
మళ్లీ మళ్లీ పారేసుకుంటుంటాను.

దాహంతో ఎండిపోయి
మాటల్లో కురిసే ప్రేమవర్షంలో తడవాలనిపించినప్పుడల్లా
కళ్లలోతుల్లోకి దూకేస్తాను.

గానుగెద్దులా నా నడక దారి
కనిపించినప్పుడల్లా
ప్రమాదమైనా సరే
పగ్గాలు తెంపుకుంటాను.

కొద్దికాలమైనా నడుస్తున్న
ఇదే దారిగుండా నా అడుగుల
నాదం వినిపించకపోతే
గుండెనంతా పెకలించుకుని
కాలిమువ్వగా కడతాను.

ఎన్ని చేసినా
ఎందుకనే ప్రశ్నలో మునగటంతో
ఇంటికొచ్చినంత సంబరపడతాను.

నన్ను నేనే వెతుకులాడుకునేందుకు
మళ్లీ మళ్లీ పారేసుకుంటాను.

అందుకే నేనింకా బ్రతికే వున్నాను.
అందుకే నన్ను నేను తాకగలుగుతున్నాను.
అందుకే అందుకే అందుకే
నేను నీక్కూడా కనిపిస్తున్నాను.

======= ========== ======== =====
Translated By Vilasagaram Ravinder.

Wednesday, 6 December 2017

అనువాద సౌరభం-25 కృష్ణ పి.వి గారి పోయెమ్

అనువాద సౌరభం-25
 Introduction:

      పి.వి. కృష్ణ గారు ఒంగోలు వాస్తవ్యులు. ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక  65 సంవత్సరాల వయసులో ఇప్పుడు కవిత్వం చదువుతూ కవిత్వం రాయడం మొదలుపెట్టినరు. వీరు మానవతావాదలు. సమాజాన్ని జాగ్రత్తగా గమనిస్తూ సమ సమాజం కోసం ఎదురు చూస్తున్నారు.

   ప్రస్తుత కవిత మానవ లక్షణాలను తెలుపుతది. ఒంటరిగా వచ్చిన మనిషి సమూహంలా మారి ఆ తర్వాత స్వార్థం కారణంగా ప్రకృతి విధ్వంసం చేయడం మనకు తెలిసిన విషయమే.  ఇప్పుడు ఇంకా ఎంత వినాశనానికి పూనుకుంటడొ అంతుచిక్కడం లేదు. ఇక అనువాద సౌరభం లోకి వెళదాం.

The Filmi  Peculiar Poem.
======== ============
        Telugu Poet : Krishna Pv
        Translated by Vilasagaram Ravinder.

A new Planet was
born in this Universe
One Day.

That Planet was
delivered a new live as.

That live becomes so
many lives and so
on.

In that One live behaviour changes
It behaves
strange and various

They behaved that
The Earth
The Sky
The air,
The Water and all are their.

That lives destroyed
the half of the life time wealth.

They wanted
to blast the remaining whole
to ruin the total wealth
as the fraudness touch the peak
In that
The waste live
The worst live..

======= ======== ======== ========
Telugu Original poem:-

విశ్వములో చిత్ర
విచిత్ర కవిత.
---
విశ్వములో ఓ రోజు
విశ్వం ఓ విచిత్ర గ్రహన్ని
అవిర్భవించింది.

ఆ గ్రహం ఓ రోజు
ఓ జీవికి
పురుడుపోసింది.

ఆ జీవి జీవాలయి
విస్తరించింది.

ఆ జీవులులో ఓ జీవి
ఓ రోజు చిత్రంగా
ప్రవర్తించడం
మొదలు పెట్టింది.

కొద్ది కాలములో
భూ, జల, వాయు,
ఆకాశాలు నావే అని
ఘుకరించింది.

స్వార్ధముతో ఆ జీవి
అర్ధ భాగం జీవ సంపదను
ధ్వంసం చేసింది.

తన స్వార్ధం పరాకాష్టకు
చేరి మిగిలి సర్వాన్నిఅంతం
చేయసంకల్పించింది
జీవులులో తప్ప పుట్టిన
ఈ నికృష్టపు ఈ జీవి.

పి. వి.కృష్ణ..

========= ========== ========= ===
https://www.facebook.com/groups/kavisammelanam/permalink/1472244936227160/
============ ========= ===========
Translated by Vilasagaram Ravinder.

Wednesday, 29 November 2017

అనువాద సౌరభం-24 అరుణ సందడి గారి Poem "The weeping Tree"

అనువాద సౌరభం-24.
 
Introduction:-

      అరుణ సందడి గారు నెల్లూరు కు చెందిన ఆర్టిస్ట్.  బొమ్మలు వేయడమే కాకుండా సందర్భాన్ని బట్టి కవిత్వం చాలా తక్కువగా రాసినరు.  వీరు M.A. B.Ed. పూర్తి చేసి 10 సంవత్సరాలు Special Educator గా సేవలు అందించారు.  వీరు IRCSMSR  Spastics సెంటర్ లో మెంబర్ గా ఉన్నారు.  వీరు రాష్ట్రస్థాయిలో చిత్రకలలో పాల్గొన్నారు. చిత్రకళా ప్రపుార్ణ ఆవార్డు, రాజా రవి వర్మ ఆవార్దు, నెల్లూరు  ఇతర సంస్ధల నుండి ప్రతిభ పురస్కారం అందుకున్నారు. వీరు సందర్భాన్ని బట్టి మృత వీరుల కోసం అనేక చిత్రాలు గీసినరు. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి అయినా సాధారణంగా ఉండటం ఇష్టం.

ఇక ప్రస్తుత కవిత వీరు ఈ మధ్యలో నే రాసినరు.  చెట్టు విషాదం కన్నీళ్ళుగా అక్షర రూపం ఇచ్చారు. ప్రస్తుతం మనుషుల స్వార్థం కారణంగా చెట్లు మృత దేహాలుగా మారుతున్నయి.  ఇక అనువాద సౌరభం లోకి వెళదాం.

Weeping Tree...
===========
      Telugu Poet: Aruna Sandadi.
       Translated By Ravinder Vilasagaram.

Yes
I am crying...
I am woeing for my badness...

I have been shown as green for decades
I have been given oxygen to living beings...
Given coolness...
I have been given pleasant to nature lovers
Now I am cut into pieces...
Yes
I am weeping...

I am in the cradle hands for the children
I am for the chats of old men...
I am for the sake of the  Nature conservation...
I am given the flowers and sweet fruits
I am in the burning....dyeing...
Yes
I am crying...

I have feast your eyes with my flowers
I have been spreading the wonderful fragrance
I have been given ever health verbal herbs...
I have been seen so many harassments
I have been in the daily silent griefs...
I have been watched without pitiless people
Yes
I am Bevailing...
I am weeping...
I am crying...
I am woeing for my badness...

========= ========== ============ =====

Original Telugu poem:-

వృక్ష  విలాపం
=========

అవును నేను విలపిస్తున్నాను,
నాకు పట్టిన దుస్ధితిని చుాసి నేనువిలపిస్తున్నాను.
దశాబ్దాల తరబడి పచ్చగా వెలిగిన నేను,
ప్రాణ కోటికి జీవ వాయువు నోసంగిన నేను,
చల్లని ప్రసాదించిన నేను,
ప్రకృతి ప్రేమికులకు ఆహ్లదాన్ని అందించిన నేను,
రంపపు కోతలతో ముక్కలుగా నేను,
అవును విలపిస్తున్నాను,

చిన్నారుల ఊయలల కు నేను,
ముదుసలుల ముచ్ఛట్లకు నేను,
పర్యావరణ పరిరక్షణకు నేను,
ఫల మాధుార్యాలను అందించిన నేను,
కాల్చి బోగ్గు చేసి నా ప్రాణం పోతుా నేను,
అవును విలపిస్తున్నాను నేను,

కన్నుల విందు చేసే పువ్వులతొ నేను,
మనోహరమైన సువాసనలు వెదజల్లిన నేను,
నిత్య ఆరోగ్య ముాలికలు ప్రసాధించిన నేను,
కని విని ఎరుగని ఘాతుకాలు చుాసిన నేను,
నిత్య ముాగ రోదనలతో అలసి సోలసి నేను,
జాలి దయ లేని మానవ జాతిని చుాసి నేను,
అవును విలపిస్తున్నాను,
నాకు పట్టిన ఈ నా దుస్థితిని చుాసి నేను
                                   విలపిస్తున్నాను...
                                   
                                   సందడి అరుణ కుమారి,
                                            ఆర్టిస్ట్ , నెల్లూరు ..

=============== ========== ===========

https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1458915410893446

============ =========== =============

Translated By Vilasagaram Ravinder.

Sunday, 26 November 2017

అనువాద సౌరభం-23 అలిశెట్టి ప్రభాకర్ గారి కవిత్వం

అనువాద సౌరభం-23
Introduction:-
      అలిశెట్టి ప్రభాకర్(12-01-1954 –12-01-1993)
పాత కరీంనగర్ జిల్లా జగిత్యాల జన్మ స్థలం. మొదట ఆర్టిస్ట్ గా ఎదిగారు. ప్రారంభంలో పత్రికలకు పండుగలు,  ప్రకృతి, సినీ నటుల బొమ్మలు వేసేవారు.  తరువాత జ్యగిత్యాల సాహితీ మిత్ర దీప్తి పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించినరు. 1974 సంవత్సరంలో ఆంధ్ర సచిత్ర వారపత్రిక లో “పరిష్కారం” అచ్చయిన మొదటి కవిత. జీవిక కోసం జ్యగిత్యాలలో స్టూడియో పూర్ణిమ(1976) కరీంనగర్ లో స్టూడియో శిల్పి(1979) హైదరాబాద్ లో స్టూడియో చిత్రలేఖ(1983) ఏర్పాటు.  జీవిక కోసం ఫోటో గ్రాఫర్ గా, జీవిత పోరాటంలో కవిగా ఎదిగారు.  ఏనాడూ సంపాదన కోసం ఆరాటపడలేదు. తన కళ ప్రజల కోసమే అని చివరికంటా నమ్మినరు.
1. ఎర్ర పావురాలు (1978)
2. మంటల జెండాలు (1979)
3. చురకలు (1979)
4. రక్త రేఖ (1985)
5. ఎన్నికల ఎండమావి (1989)
6. సంక్షోభ గీతం (1990)
7. సిటీ లైఫ్ (1992) అచ్చయిన కవిత్వ సంకలనాలు.
    తండ్రి అలిశెట్టి చినరాజం, తల్లి లక్ష్మి, సహచరి భాగ్య, కుమారులు సంగ్రామ్ సాకేత్ లు హైదరాబాద్ లో నివాసం.

   ఇక ప్రస్తుత అనువాద కవితలు వారు సంవత్సరాల క్రితం రాసినా ప్రస్తుత సామాజిక పరిస్థితులకు కూడా వర్తించే విధంగా ఉన్న గొప్ప కవిత్వం.  ఈ కవిత్వం ముద్రణ వెనుక వీరి మిత్రుల కృషి ఎంతో ఉంది.  ఈ మధ్యలో వీరు కవిత్వం ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన Narsan Badri సార్ కు శనార్తులు.

     ఈ కవితలు అనువాదానికి ఎంచుకోవడానికి బహుశా నా నిజ జీవితంలో జరిగిన సంఘటనలు కొంచెం కారణం కావచ్చు.  కాలం మారచ్చు, సందర్భాలు మారచ్చు, కవిత్వం నిత్య చైతన్య మనడానికి అలిశెట్టి ప్రభాకర్ గారి కవిత్వం గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  ఇక అనువాద సౌరభం లోకి వెళదాం.  నాది స్వేచ్ఛానువాదం.

స్వేచ్ఛానువాదం:-

Even you are not competent to Apologise..
Or
You are inexcusable!
~~~~ ~~~~~ ~~~~~~~~~~~~~~~~~
         Telugu Poet: Alishetty Prabhakar
          Translated By Vilasagaram Ravinder.

You knew the the robbers
Who stole all of yours
Warm blood and flesh
By opening yours
Body in the presence
Of the public eyes...

You knew the Fraud
intellectuals Who supported
With nowadays
Methods of knave music's
On the Hunger-starves Dulcimer's
Within seconds...

You knew the pseudo political bulldozers
Who destructed the very very littles
Ambitious homes...

Even though
You didn't open your mouth
And didn't attack/give one little wordth

You didn't
unfurl the secret
flag
For the revolutionaries
Who was
in the Way of Agitations
At last...

Original Telugu poem:-

నువ్ క్షమార్హుడివి కావు...
                -అలిశెట్టి ప్రభాకర్.

యధేచ్ఛగా
నీ శరీరం బీరువా తెరిచి
వెచ్చని
నీ రక్త మాంసాల్ని కొల్లగొట్టే
బందిపోట్లెవరో నీకు తెలుసు.

సుతారంగా
నీ ఆకలి పేగుల సితారపై
సరికొత్త
దోపిడీ సంగీతాన్ని సమకూర్చిన
కుహనా మేధావులెవరో నీకు తెలుసు .

నీ చిరు చిరు
ఆశల కుటీరాల్ని విధ్వంసం గావించే
అరాజకీయ బుడ్డోజర్జెవరో నీకు తెలుసు.

అయినా
పెదవి విప్పి మాటన్నా సంధించవు.

చివరికి
ఉద్యమ రహదారుల్లో విలీనమైన వాళ్ళకి
ఒక రహస్య కేతనమైనా ఎగరెయ్యవు.

======== ========= ========= =====

https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1456866771098310
======== ======== ======== =======
Scenery...
~~~~~~

     Telugu Poet: Alishetty Prabhakar.
      Translated By Vilasagaram Ravinder.

Did you see ever
The transparent flowing blood river
turned into Sweat river...?

Did you read whenever
The green green
Block soil was written
by the ploughs language whenever...

Did you find the muscle redness
of factories fire place
with fire blowingness...

However
If it is Marble Statue Or
it is Parliamentary Building
He is the founder
He is the builder...
Yes it is ever...

======== ======== ========= ======
Telugu Original Poem:-

దృశ్యం...

   -అలిశెట్టి ప్రభాకర్.

పారదర్శకంగా కురుస్తున్న
రక్త వర్షం
చెమట నదిగా
రూపాంతరం చెంది
ప్రవహించడం
మీరెపుడైన చూశారా?

హరితహరితంగా
నల్ల రేగడి నేల మీద
సృజియించిన
నాగళ్ల లిపిని
మీరెపుడైన చదివారా?

కర్మాగారాల కొలిమిలో
కణకణా మండుతున్న
కండరాల ఎరుపుని
మీరెపుడైన కనుగొన్నారా?

యింతకూ పాలరాతి బొమ్మౌనా
పార్లమెంటు భవనమైనా
వాడు చుడితేనే శ్రీకారం
వాడు కడితేనే ఆకారం!

======= ======= ======= ===========

https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1457796094338711

======== =========== =========== ==

Translated By Vilasagaram Ravinder .