Friday, 29 September 2017

The Eyed Pen



అనువాద సౌరభం-1
~~~~~~~~~
         కవిత్వాన్ని ప్రేమించే కవి సమ్మేళనం సభ్యులకు నమస్కారాలు. కవి సమ్మేళనం మిత్రులు నన్ను ఏదైనా శీర్షిక నిర్వహించ వలెనని చాలా రోజులుగా అడుగుతున్నారు. నా వ్యక్తిగత సమస్యల కారణంగా నేను ముందుకు రాలేదు.
         
          ఈమధ్యనే కొన్ని తెలుగు నుంచి ఆంగ్లంలో చేసిన అనువాదాలను చూసిన గ్రూప్ అడ్మిన్మిన్లు మళ్ళీ నన్ను సంప్రదించినారు. ఇప్పుడు నాకు కూడా కొంచెం రాసే ఓపిక వచ్చింది.  కాబట్టి  ఈ “అనువాద సౌరభం” శీర్షిక నిర్వహించడానికి ఒప్పుకున్నాను.

          నేను ప్రస్తుతం తెలుగు ఉపాధ్యాయులుగా పని చేస్తున్న.  కొంత కాలం ఆంగ్లం కూడా బోధించిన.  ఎం.ఏ తెలుగు, ఆంగ్లం ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల నుంచి పూర్తి చేసిన.  పరీక్షల కోసం కొంత ఆంగ్ల సాహిత్యంతో పరిచయం ఉంది.  అనువాదం మాత్రం ఈ మధ్యలో మొదలయ్యింది. ఫేస్ బుక్ లో కవిసంగమం లో అనువాద శీర్షిక నిర్వహిస్తున్న Cv Suresh గారి నుంచి కొన్ని మెలకువలు నేర్చుకున్నాను. వారికి ధన్యవాదాలు.

         అనుసృజన కంటే నాకు అనువాదం కష్టంగానే అనిపిస్తుంది.  అయినా ఇష్టంతో చేస్తున్న కాబట్టి
కష్టం తెలియడం లేదు. ఈ ప్రకృయకు నేను కొత్త కాబట్టి మిత్రుల, పెద్దల నుంచి సలహాలు కోరుతున్నాను.
ఇక అనువాద సౌరభం లోకి ప్రవేశిద్ధాం. ఈ నా అనువాదాన్ని స్వేచ్ఛానువాదం గారు భావించగలరు.

స్వేచ్ఛానువాదం
~~~~~~~~~

The Eyed Pen
~~~~~~~~~

         Poem by Kukatla Thirupathi
         Translation : Vilasagaram Ravinder.

Either, the pen turns into a typical ghantam
and haptic the "thalapathra"

Or, by becoming a hard pen and touch the copper plate....

Or, by transformed into a quill and kiss the folded prathi

Spreads the stone body with the chisel !
Sharpen bigger than the needle’s neck !
Searching the Earth Sky
Form the powerful feelings
The pen has the eyes
The Eyed pen !

The murmurs flying in the air,
The wings thinking
The words dwell
Twisting the love with the names
Presented the beautiful personality...

Let the cazed birds flying
The silent wounded mouths
Touch with the song ointment
And finally
Adventurous doors will be opened...

The plotted austere seeds at the castle,
The fully cavities distroying
The motive ways pouring
Like floods
The swagger generating will touch
The other end of the quasside...

The uneqal society sounds
The freedom songs
The culture Aura smells splash
The dreamy screen eyes
Touch the equality panoramis...

The enlightened pen
Chopped the limbs

It is like weapon
Which reaches its destination

It is like mirror
To that rolling time
And the sceneries of evidences.

Telugu Original poem :

కలానికి కళ్ళుంటాయి
******************
ఘంటమై తాళపత్రం తడిమినా!
చువ్వై తామ్రపత్రం తాకినా!
నెమలీకై ముడుతప్రతి ముద్దాడినా!
ఉలై శిలదేహంపై పరుచుకొని
సూది మొన కన్న సూటిగా
భూమ్యాకాశాలను గాలిస్తూ
భావాలకు రూపం పోసే
కలానికి కళ్ళుంటాయి

గాలిలో తేలియాడే ఊసులు
రెక్కలు తొడిగిన ఊహలకు
అక్షరాల ఆవాసమల్లుతూ
పేరును పేరిమితో పెనేసి
ఒక వ్యక్తిత్వాన్ని బహుకరిస్తుంది

పంజరంలోని పదపక్షుల
పాదాలు మొలిపిస్తూ
మూగ గొంతు గాయాలకు
గేయ మలాం అద్దుతూ
సాహస ద్వారాలు తెరిపిస్తుంది

పన్నాగాల పల్లేరు కోటల
కుత్సిత కుహరాల కూల్చుతూ
ఆశయాలను దారులుగా ధారవోస్తూ
ఆయువోసుకున్న ఆత్మ విశ్వాసం
ఆవలి తీరాన్ని తాకిస్తుంది

అసమ సమాజ స్మశానంలో
స్వేచ్ఛా విపంచి ఆలాపన
సాంస్కృతిక సౌరవాలను చల్లుతూ
కళలీను నేత్ర తెరలపై
సమరసతా దృశ్యాదృశ్యాలు

మేల్కొల్పే కలం కాలుచేతులు నరికినా
ఉరితాడు ప్రాణాలను పెరికినా
గురి తప్పని ఆయుధమవుతూ
కదులుతున్న కాలానికి దర్పణంగా
సదృశ్యమాన సాక్ష్యమవుతుంది.

రచన: కూకట్ల తిరుపతి, 9949247591.

ఆంగ్లంలో అనువాదం:
Ravinder Vilasagaram.

No comments:

Post a Comment