Monday, 30 October 2017

SKY... SIGH... అనువాద సౌరభం-20 BIKKI KRISHNA SIR'S POEM

అనువాద సౌరభం-20

Introduction:
~~~~ ~~~~

           బిక్కీ కృష్ణ గారు ప్రముఖ కవి, విమర్శకులు,  గేయ రచయిత, సింగర్, నటులు, సామాజిక కార్యశాలి, దక్షిణ భారతదేశంలో 5000లకు పైగా పాత్రికేయులకు గ్రామాభివృద్ధి సంస్థ ద్వారా ముద్రణా వెబ్ జర్నలిస్టులకు శిక్షణను ఇచ్చిన వారు. వీరు ప్రస్తుతం 10TV Programme Director గా పని చేస్తున్నారు.

               వీరు S.S. Trust కు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.  గిడుగు ఫౌండేషన్ కు Organizing Secretary గా పని చేస్తున్నారు.  వీరు “కవితా వికాస సంస్థ” కు జనరల్ సెక్రెటరీ గా సేవ చేస్తున్నారు. వీరు అనేక సంస్థల ద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు.

         వీరు పత్రికలలో అనేక వ్యాసాలు రాస్తూ కొత్త కవులకు,  రచయితలకు, పాత్రికేయులకు,  నటులకు  మార్గ నిర్దేశం చేస్తున్నారు. అనేక రచనలు చేస్తూ సమ సమాజ నిర్మాణం కొరకు వ్యూహాలూ రచిస్తున్నరు. వీరు నిత్య చైతన్య శీలురు.

        ఇక  ప్రస్తుత కవిత విషయానికి వస్తే ఈ కవిత చదివిన కొద్దీ కొత్త కొత్త సందర్భాలకు, భిన్నమైన సమాజాలను ఈ కవితలోని పంక్తులు అక్షర సాక్షాలు.  నేను సంక్లిష్ట సందర్భంలో ఉండి ప్రయాణంలో చేసిన అనువాదం ఇది. నా ఈ అనువాద సౌరభానికి CV Suresh గారు సుగంధాన్ని అద్దుతనే ఉన్నరు. ఇక అనువాద సౌరభం లోకి వెళదాం.

స్వేచ్చానువాదం :-

Sky... Sigh...!
~~~~~~~~
     Original Telugu Poet: Bikki Krishna Garu .
      Translated By Vilasagaram Ravinder.

Honour to the air...
Just  with  the incense of the flowers!

Is it the real leeway!
If the storming winds
Bulldoze the trees
Which gives
Oxygen, Flowers
Leaves...!
May not be gratitude
To the axe...
But , how obligatory to the tree
Which gives the axe stick
From her trunk!!

Because of joining the rivers
The oceans make Salty waters...!

By watching the drainage waters
Of the rivers
The hills laugh and laughers
Planting the moustaches of trees
Everywhere in hills...!

The cotton crop gets
 the jealous
By watching the birds
feeding nuts
in near by crops...
It weaves
the white threads
with so many twists
as soon as the innocent birds
 immolate to the cruel prowl webs...!

Else
What can I describe about animals?
They jumps and jumps
Here and there in the nights
In the name of freedom and freeness...
They hide them in the shades
Of trees and bushes
Of dark forests
In the mornings
Not to see the Sunlights...!

The Sky silently sighs
Meanwhile the timelence is watching
The wonders and surprises...!

====== ======= ======== =======

ఆకాశం ..నిట్టూర్పు!

పూల పరిమళాల వల్లనే
గాలికి గౌవరం లభిస్తుంది!
పూలు ఆకులతోపాటు ఆక్సిజన్ ఇచ్చిన
చెట్టును కూల్చే పెనుగాలిది
నిజమైన స్వేచ్ఛఅవుతుందా?

గొడ్డలికి కృతజ్ఞత లేకపోవచ్చు
తనను కూల్చడానికి కట్టెపిడి నిచ్చే
చెట్టుది ఎంత త్యాగ గుణమో కదా?

నది తనలో చేరడం వల్లనే కదా
సముద్రం ఉప్పునీరుగా మారింది!
వాగులు వంకలతో మైలపడిన నదిని చూసి
పర్వతాలు చెట్లకొమ్మలమీసాలు మెలివేస్తూ
గంభీరంగా నవ్వుకుంటాయి!

పక్కచేనులోవాలిన పక్షుల్ని చూసి
అసూయ చెందిన పత్తిచేను
చివరకు చిక్కుముడి దారాల వలగా మారి
అమాయక పక్షుల్ని వేటగానికి బలిస్తుంది!

ఇక జంతువుల గురించి చెప్పే దేముంది?
స్వేచ్ఛపేరుతో చీకటిలో చిందులుతొక్కుతాయి
వెలుగునిచ్చిన సూర్యుడు ఎక్కడ చూస్తాడోనని
తెల్లారగానే అభయారణ్యాల్లో దాక్కుంటాయి!

కాలం కెమరాలో (వి)చిత్రాలను చూస్తూ
ఆకాశం మౌనంగా..నిట్టూరుస్తుంది.!

 -బిక్కి కృష్ణ
 సెల్:8374439053

https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1428740793910908
======= ====== ======== ========
Translation by Vilasagaram Ravinder.

Tuesday, 24 October 2017

అనువాద సౌరభం-19 నాగెళ్ళ కవిత

అనువాద సౌరభం-19

Introduction:-

         నాగిళ్ళ రమేష్ గారు వృత్తి రీత్యా తెలుగు ఉపాధ్యాయులు. మారుమూల పల్లెలో పిల్లలతో కవిత్వం రాపిస్తూ తను కవిత్వం అయి జీవిస్తున్నారు. వీరు మొదట ఒక నానీల సంపుటి “వడిసెల రాళ్ళు”  మొన్న మొన్ననే ఒక కవిత్వ సంపుటి “ఉద్దరాసి పూల చెట్టు” వేసి ఉన్నరు. త్వరలో వీరు విద్యార్థుల కవిత్వ సంకలనం వేయనున్నరు. ప్రస్తుతం  వీరు కొలకనూరి ఇనాక్ నవలల పై పి. హెచ్.  డి చేస్తున్నరు.

       ఈ కవిత విషయానికి వస్తే అనువాదం చేయడం కొంచెం కష్టమే అయింది. ముఖ్యంగా కవితా నిర్మాణం, తెలంగాణ భాషలోని నుడికారం ఆంగ్లంలోకి తేవడానికి చాలా కష్ట పడాల్సి వచ్చింది.  ఇంకా కొన్ని మార్పులు అవసరమే.  కొంచెం ఎక్కువ స్వేచ్ఛను తీసుకున్న.

స్వేచ్చానువాదం:-
   

Who...?
~~~~
       Telugu Poet: Nagilla Rajesh
       Translated By: Vilasagaram Ravinder

Introducing the Sun rising first time
Holding my little finger
Treating Eyelid of my eyelids
Who is that Earthly Rainbow...!?

In this untasted life
pouring the tasted harsegram’s soup
With the love utensil
Who is He?

For made me as purely paddy dumpling
Who is the moon leaf
Which is break as tree metel leaf ?

In that heading
milk with ghee boiling
For introducing
Me the life's grammar
Who is that grammar teacher ?

Who is the Eternal river ?
In this long travelling
Not to shed my heart flower
In this long travelling...

==== ====== ====== =======

Original Telugu poem:-

ఎవరు?
=== ==

నా వేలు పట్టుకొని
నా కంటికి కనుపాపై
సూర్యోదయాన్ని కొత్తగా పరిచయం చేసిన
ఈ మట్టి సింగిడి ఎవరు

ఈ సయిలేని బతుకుల
కమ్మటి ఉలువ చారుగా
ఒంపబడిన
ఈ ప్రేమ పాత్ర ఎవరు

నన్ను తేటని
వడ్లకుప్పను జేసేతందుకు
ఆకుపెల్లలా ఇరిగిపోయిన
ఈ ఎన్నీల కొమ్మ ఎవరు

నెత్తిన నెయ్యివాలు ఉడుకంగ
బతుకు వ్యాకరణాన్ని
నేర్పిన
ఈ వైయాకరణి ఎవరు

ఇంత దూరపు పయనంలో
నా గుండెపువ్వును వాడపోనియ్యక వుంచిన
ఈ ఎండిపోని నది ఎవరు.

నాగిళ్ళ రమేశ్ .
====== ====== ======= ========= ==
https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1433000820151572

====== ====== ====== ========= ====

Translated By Vilasagaram Ravinder.

Tuesday, 17 October 2017

అనువాద సౌరభం-18 Prabhakar Jaini Sir's Poem

అనువాద సౌరభం-18
Introduction:-
             ప్రభాకర్ జైని గారు ముఖ్యంగా నవలా రచయిత. వీరికి ‘కెరటం’ ఆదర్శం. పడిపోయి పతనమైనందుకు కాదు. పడిపోయినా ఉత్తుంగ తరంగమై లేచినందుకు. బహుశా వీరి జీవితం కూడా తీవ్ర ఒడిదిడుకుల నుంచి ఇప్పటి స్థితిలొకి వచ్చి ఉంటది. వీరు తెలుగు యూనివర్సిటీ లో Post Graduation Diploma in Film Direction పూర్తి చేసి డిస్టిక్షన్ లో పాసయ్యారు. ఆ తర్వాత 1. అమ్మా నీకు వందనం, 2. ప్రణయ వీధుల్లో 3. అంపశయ్య నవీన్ గారి నవల ఆధారంగా తక్కువ ఖర్చుతో ఒక వినూత్న రీతిలో 1969లో విద్యార్థుల జీవితానికి దర్పణంలా నిలిచేలా “క్యాంపస్ అంపశయ్య” పేరుతో సినిమా తీయడమే కాకుండా బతుకమ్మ ఉత్సవంలో భాగంగా సెప్టెంబర్ 26న రవీంద్ర భారతి, హైదరాబాద్ లో ప్రదర్శించారు. వీరు నవ్య వారపత్రిక లో రాసిన “సినీవాలి” నవల బాగా చదువరులను ఆకర్షించింది.  ప్రభాకర్ జైని గారు ఈ మధ్యనే “పాద ముద్రలు” అనే కవిత్వ సంకలనం వెలువరించారు.   వీరు “జైని ఇంటర్ నేషనల్ “ సంస్థ ద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

              ఇక ప్రస్తుత అనువాద కవిత వీరు ఈ మధ్యలోనే రాసినరు. ప్రతి వారూ కలలు కంటరు. ఆ కలలు సాకారం అయ్యే విధంగా తమ కృషి చేయవలసి ఉంటుంది.  One should take a long or roundabout route that is taken to avoid something or to visit somewhere along the way.
ఇక నా అనువాద సౌరభంనకు సి.వి. సురేష్ సార్ తోడ్పాటును అందస్తనే ఉన్నరు. ఇందులో రెండు అనువాదాలను పొందు పరుస్తున్నను ఒకటి నేను మరొకటి మరో అనువాదకులు చేసినది.    ఇక అనువాదం లోకి వెళదాం. 

స్వేచ్చానువాదం:-

DETOUR INTO DREAMLAND.

Go to sleep, go to sleep.
Dream-workers are turning up. 
They will wipe away your tears and tribulations, and make you cleansed up.
They will soothe your tired body, offer solace to your fatigued mind and pamper you up. 

They will put you in the lap of the departed dear and make them sing lullabies to your ears. 
They will provide you with music that shall be a feast on your ears. 

For a picnic in amazing and enchanting worlds, they will groom you.
For tomorrow's struggle in life, they will pep you up by energizing you. 

Go to sleep, go to sleep.
Dream-makers are turning up.

======== ======== ======
Another Version:-

Detour of Dreamland
~~~~~~ ~~~~~~ ~~~~
Hey!
Go to the sleep.. Guys..
Slumber again n' again !
The dreamers are coming through....!

To
Clear and clean the 
Sorrowed heads 
N' to wipe off the tears...!

For
Smoothening and cradling
The disgusted soul
And the tired body!

They will make you sleep deeper
on your 
loveable disappeared personalities 
With lovely songs...!

They will SING melodies 
And make your eyes 
Feast and feel Happiness..!

They will send you to the Dream Land of Detour 
You will be in the land of wonderful sights are
 Blinking and shaking...!

They will fill your body with 
great energy 
They will fill your mind with 
grandeur enthusiasm...
To live the next life with 
zeal and jest...!

That's why !
Go for a sleep
Slumber again n again..!
The dreamers came through...!

======== ======== ======


Original Telugu poem:-

స్వప్న లోక విహారం
======= =====
పడుకోండి, పడుకోండి 
కలల కార్మికులొచ్చేసేస్తున్నారు! 

కష్టాలను, కన్నీళ్ళను 
శుభ్ర పరిచి శుద్ధి చేసేస్తారు! 

అలసిన ఒంటిని, సొలసిన మనసును
లాలించి సేద దీర్చేసేస్తారు! 

కనుమరుగైన ప్రియతముల
ఒడిలో పడుకోబెట్టి లాలి పాడించేసేస్తారు! 

కమ్మని గానంతో
వీనుల విందు చేసేస్తారు! 

అద్భుత సుందరలోకాల
వాహ్యాళికి సిద్ధం చేసేస్తారు! 

రేపటి జీవన పోరాటానికి
జవసత్వాలు నింపి సమాయత్తం చేసేస్తారు! 

అందుకే, 
పడుకోండి, పడుకోండి, 
కలల కార్మికులొచ్చేసారు! 
- ప్రభాకర్ జైని. 


https://m.facebook.com/story.php?story_fbid=1230802423733303&id=100004106718350

తేది:17.10.2017.

Saturday, 14 October 2017

He-She Avari Ashok's poem

She-He
~~~~~
          Telugu: Ashok Avari
          Translation: Vilasagaram Ravinder.

She opens her watching ears always
He always with her remembering showdow like of her
Eventhough he was far away.

She made him as her romantic King in her dream.
He crowned her as Harem Queen in his earth consciously.

She turned into Jasmine and spreads the Tricky smell for him
He made as Firefly and sung romantic melodies for loving her.

She closed her Window eyes when he came her...
He opened his Minddoors when she touched him.

Tricky words for Sometimes...
Bundle of Smiles for a long time...
Music leg sounds for so much time...
Hand bangle noise sounds...
rings...  rings... rings...
Sounds... Sounds...Sounds...
Silence is tired and retired into deep Silence in that room...

Silence...
Silence...
Silence...

అశోక్ అవారి | అతడు-ఆమె

ఆమె అతని కోసం..
చూపుల కిటికీలు తెరిచే వుంచుతుంది.
అతడు దూరంగా ఉన్నా..
ఆమె జ్ఞాపకమై నీడలా వెంటే వుంటాడు.

ఆమె అతన్ని కలలో..
తన విరహ సౌధానికి రాజుని చేస్తుంది.
అతడు ఆమెను ఇలలో..
వలపు అంతఃపురానికి రాణిని చేస్తాడు.

ఆమె అతని కొరకు..
మల్లెపూవై గమ్మత్తు వెదజల్లుతుంది.
అతడు ఆమె కోసం..
తుమ్మెదై ప్రణయస్వరాలు శ్రుతి చేస్తాడు

ఇప్పుడతని రాకతో...
ఆమె చూపుల కిటికీలను మూసేస్తుంది.
అప్పుడామె స్పర్శలో..
అతను తన ఎద తలుపులు తెరుస్తాడు.

కాసేపు గమ్మత్తైన మాటలు..
ఇంకాసేపు నవ్వుల మూటలు..
కొన్ని కాలి అందెల రవళులు..
ఇంకొన్ని చేతిగాజుల సవ్వళ్ళు..
గదిలో శబ్దాలను మోసి అలసిన నిశ్శబ్దం.

(తేది: 28.5.2017న నవతెలంగాణ జోష్ లో ప్రచురించబడింది).

Monday, 9 October 2017

అనువాద సౌరభం-17 CV Suresh Sir Poem

అనువాద సౌరభం-17.

Introduction:-

            C. V. Suresh గారు రాయలసీమ పొద్దుటూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది.  ప్రవృత్తి రీత్యా కవి, రచయిత,  అనువాదకులు, విమర్శకులు,  విశ్లేషకులు, గజల్ కవి. కవుల పరిచయాలు రచిస్తూ తెలుగు కవులను పరిచయం చేసినరు.  వీరు  అల్ ఇండియా రేడియో ఫోక్ ఆడిషన్ సింగర్.   వీరు Journalist గా Andhra Bhoomi, Deccan Chronicle లో ఆరు సంవత్సరాలు పని చేసారు. కొంత కాలం ఫ్రీలాన్స్ జర్నలిస్టు గా ఉన్నారు. వీరు “మన ఆలయం” పుస్తకం లో అన్నమయ్య కీర్తనాలపై  రాయలసీమ కోణం లో విశ్లేషణలు ధారావాహికంగా రాశారు. ఇప్పుడు “కవి సంగమం” గ్రూపులో ఆంగ్ల కవుల రచనలు తెలుగులో, తెలుగు కవుల రచనలు ఆంగ్లంలోకి విరివిగా అనువాదం చేస్తున్నారు.  చాలా ప్రేమ కవితలు రాసారు.  వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి.  ఎక్కువ పని చేయడం తక్కువ చెప్పుకోవడం వీరి ప్రత్యేకత.  భవిష్యత్తులో వీరి గురించి ఒక వ్యాసం రాసేది ఉంది.  అప్పుడు సంపూర్ణంగా చెబుతాను.

              సి. వి. సురేష్ గారు మృదు స్వభావం కల వారు. మీది మిక్కిలి తోటి వారికి సాయం చేయడం వీరి సుగుణం. వచ్చే జనవరికల్లా వీరు నాలుగు పుస్తకాలు సాహితీ ప్రపంచంలోకి తేనున్నారు.

         ఇక ప్రస్తుత కవిత అనువాదం విషయానికి వస్తే ముందు నేను అనువాదం చేసి మరొక ఫేస్ బుక్ అనువాదక మిత్రునికి పంపాను.  అతను కూడా మరో అనువాదం పంపారు. ఇదంతా ఒక 6,7 గంటలలో జరిగింది.   ఈ పోస్ట్ లో రెండు అనువాదాలను జత చేస్తున్నాను.  నాకైతే నా మిత్రుని అనువాదం బాగా నచ్చింది.  వారు చేయి తిరిగిన అనువాదకులు కదా. నాది స్వేచ్చానువాదం.

స్వేచ్చానువాదం:-
~~~ ~~~~~

“..........”

      Telugu Poet: Cv Suresh
      Translated By Ravinder Vilasagaram

You are catching my waiting seconds
Which aren't dropped from my edge of eye lids
Like an equator...!

You are delighted me with your heartful
melody songs like the best singer
Before my mind sings my inner beautiful
melodies which are singing in my inner
Mind...!

You are dropping elegant melodies
Heart touching beets
Touches
with your fingers...!

In between so many alone times
My Endless love feelings
Which are ready to prove
Are waiting before you...!

Some preludes are incompleting
Some emotional feelings are bursting
When you are in silence
And mouthlessness

My desire is to
Dedicate you
A poem...!

When wonderful
movements
Are twisting
And twirling...!!

========= ========= =======

The following translation is by my another FB Friend.
~~~~~ ~~~

"........"

You Behold
My  awaited seconds
Even before they dropped from eyelids...!
Like an equator!!

You start singing...
My echoed music  of my deepen hearts..
Before it was sung...!
Like a sweet singer!!

You start dropping...
An amazing  romantic feel in me..
By smoothening with your fingers tips..!

Between the abundant loneliness
Enormous love proposals of mine..
Are waiting in your corridor!

Some preludes are incompleting
Some emotional feelings are bursting
When you are in silent and mouthless

My desire is to dedicate
you a poem
When wonderful movements
are twisting and twirling...!!

======== ========= =========
Original Telugu poem :-

సి.వి. సురేష్ ॥......... ॥

నాలో  నిరీక్షణ క్షణాలను
కనురెప్పల అ౦చులను౦డి జారకము౦దే
అ౦దుకొ౦టావు క్షితిజరేఖలా....

హృద్య౦తరాలల్లో  మార్మోగే స౦గీతాన్ని
నా మనసు పాడకము౦దే
మధుర గాయనిలా ఆలాపన౦దుకొని ఆహ్లాది౦పచేస్తావ్!

ముని వ్రేళ్ళతో  సవరిస్తూ..
హృదయాన్ని కదిలి౦పచేసే
ఓ రసరమ్య భావన్ని  నాలోకి  జారవిడుస్తావు
....
ఎన్నో ఏకా౦తల మద్య
అన౦తమైన నా ప్రేమను నిరూపి౦చే సమయాలు
నీ ము౦గిట వేచి ఉన్నాయి..

కొన్ని పూర్తికాని పల్లవిలు....ఇ౦కొన్ని భావావేశాలు...
బహిర్గతమవుతున్నాయ్..
నీ మౌన పరిభాషల‌ తాకిడిలో.....!

...
అద్భుతాల సమాగమైన నీకో
కవిత అ౦కితమివ్వాలన్నది  నా కోరిక !!

('తొలిఅడుగులు"...నా కవితల కలెక్షన్ ను౦డి)

https://www.facebook.com/groups/kavisammelanam/permalink/1422480284536959/

తేది: 10-09-2017.

Tuesday, 3 October 2017

He is He... అనువాద సౌరభం-16

అనువాద సౌరభం-16
స్వేచ్చానువాదం...

He is He...
~ ~ ~ ~ ~

         Telugu Poet : Bheempally Srikanth
         Translated By Vilasagaram Ravinder

If he laughs the home will lighten...
If he plays the home will turn into cinema hall...

If any one draws the horizontal lines
No stimulation will stop him...
If anybody creates So many Padma Strategies(Padma Vyuhaas)
No one will catch him on their cages...

He is He
If we watch him
He will remember like Child Krishna (Bala Krishna)
If we observe him
He is in his world
He is in his thoughts...

He is like listening us
But
He listens nothing... nothing...

He shakes his head to do as we said
But
He does nothing... nothing...

He is He
The house is silent and peaceful
He lightens the flower smiles...!
The home is full of sounds and sounds
He is Silent and peaceful...!!

Excitement is his address
Exhilaration is his moon like...

He does not stand like wastage paper in a second
He does not stop his fracas and naughtiness...

If we preach him so many times
The child life will interweave him all times...!
 If we will tell him so many times
His mind will drag him all times...!!

He embraces his beautiful childhood
He makes his beautiful life’s ways by himself...

If I see him I feel I am into my childhood
If I watch him I feel I lose my golden childhood...

We feel
His naughtiness is evergreen leaves for us
His naughty things are happiness for us...

If He is He
The home is beautiful
If he is in childhood
We are happy and cheerful...

Yes
He is He
He is the cover of golden brick...
He is the Hero of the Childhood like Budugu...

He is the light of our House...
He is the lighten of our Eyes...

======= ===== ======== =============
Original Telugu Poem:-

*వాడు వాడే*

వాడు నవ్వితేనే
ఇల్లు కళకళలాడుతుంది
వాడు ఆడితేనే
ఇల్లు సినిమాను తలపిస్తుంది

ఎన్ని అడ్డు గీతలు గీసినా
వాడిని ఏ చైతన్యం నిలువ నియ్యదు
ఎన్ని పద్మ వ్యూహాలు రచించినా
వాడు ఆ పంజరంలో చిక్కడు

వాడు వాడే
వాడిని చూస్తుంటే
బాలకృష్ణుడే గుర్తుకొస్తాడు
వాడి తీరు చూస్తుంటే
తనో లోకంలోనే విహరిస్తుంటాడు

అన్నీ వింటున్నట్టే ఉంటాడు
ఏదీ వినడు
అన్నిటికీ తల ఊపుతూనే ఉంటాడు
ఏదీ చేయడు

వాడు వాడే
ఇల్లంతా మౌనం రాజ్యమేలుతుంటే
వాడు నవ్వులపూలు పూయిస్తుంటాడు
ఇల్లంతా సందడిగా ఉంటే
వాడు మౌనవ్రతం పాటిస్తుంటాడు

ఉత్సాహం వాడి చిరునామా
ఉల్లాసం వాడికి చందమామ

క్షణం పాటు కూడా
వాడు చిత్తరువులా ఉండడు
నిమిషం పాటు కూడా
వాడు అల్లరి మానడు

ఎంత ఉపదేశంచినా
బాల్యం వాడిని అల్లుకుంటుంది
ఎన్నిసార్లు చెప్పినా
తన మనసే లాగుకుంటుంది

అందమైన బాల్యాన్ని వాడు
కౌగిలించుకుంటున్నాడు
అందమైన జీవితానికి వాడు
బాటలు వేసుకుంటున్నాడు

వాడిని చూస్తుంటే
నా బాల్యంలోకి నేను
తొంగి చూస్తున్నట్లుంటుంది
వాడి అల్లరిని చూస్తుంటే
నా బంగారు బాల్యం
మాయమైనట్లు అనిపిస్తుంది

వాడి అల్లరే
మాకు నిత్యం పచ్చతోరణం
వాడి చేష్టలే
మాకు రోజూ ఆనందదాయకం

వాడు వాడయితేనే
ఇంటికి అందం
వాడు బాల్యంలోనే
ఉంటేనే మాకు ఆనందం

అవును...వాడు వాడే
వాడు బంగారానికి తొడుగు
వాడు బాల్యానికి బుడుగు

వాడు మా ఇంటి వెలుగు
          మా  కంటి వెలుగు

🖌 *భీంపల్లి శ్రీకాంత్*

https://www.facebook.com/groups/kavisammelanam/permalink/1416975271754127/

https://m.facebook.com/story.php?story_fbid=1395118413934671&id=100003095774583

======= ======= ======= ============
Translated By Vilasagaram Ravinder.