Tuesday, 17 October 2017

అనువాద సౌరభం-18 Prabhakar Jaini Sir's Poem

అనువాద సౌరభం-18
Introduction:-
             ప్రభాకర్ జైని గారు ముఖ్యంగా నవలా రచయిత. వీరికి ‘కెరటం’ ఆదర్శం. పడిపోయి పతనమైనందుకు కాదు. పడిపోయినా ఉత్తుంగ తరంగమై లేచినందుకు. బహుశా వీరి జీవితం కూడా తీవ్ర ఒడిదిడుకుల నుంచి ఇప్పటి స్థితిలొకి వచ్చి ఉంటది. వీరు తెలుగు యూనివర్సిటీ లో Post Graduation Diploma in Film Direction పూర్తి చేసి డిస్టిక్షన్ లో పాసయ్యారు. ఆ తర్వాత 1. అమ్మా నీకు వందనం, 2. ప్రణయ వీధుల్లో 3. అంపశయ్య నవీన్ గారి నవల ఆధారంగా తక్కువ ఖర్చుతో ఒక వినూత్న రీతిలో 1969లో విద్యార్థుల జీవితానికి దర్పణంలా నిలిచేలా “క్యాంపస్ అంపశయ్య” పేరుతో సినిమా తీయడమే కాకుండా బతుకమ్మ ఉత్సవంలో భాగంగా సెప్టెంబర్ 26న రవీంద్ర భారతి, హైదరాబాద్ లో ప్రదర్శించారు. వీరు నవ్య వారపత్రిక లో రాసిన “సినీవాలి” నవల బాగా చదువరులను ఆకర్షించింది.  ప్రభాకర్ జైని గారు ఈ మధ్యనే “పాద ముద్రలు” అనే కవిత్వ సంకలనం వెలువరించారు.   వీరు “జైని ఇంటర్ నేషనల్ “ సంస్థ ద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

              ఇక ప్రస్తుత అనువాద కవిత వీరు ఈ మధ్యలోనే రాసినరు. ప్రతి వారూ కలలు కంటరు. ఆ కలలు సాకారం అయ్యే విధంగా తమ కృషి చేయవలసి ఉంటుంది.  One should take a long or roundabout route that is taken to avoid something or to visit somewhere along the way.
ఇక నా అనువాద సౌరభంనకు సి.వి. సురేష్ సార్ తోడ్పాటును అందస్తనే ఉన్నరు. ఇందులో రెండు అనువాదాలను పొందు పరుస్తున్నను ఒకటి నేను మరొకటి మరో అనువాదకులు చేసినది.    ఇక అనువాదం లోకి వెళదాం. 

స్వేచ్చానువాదం:-

DETOUR INTO DREAMLAND.

Go to sleep, go to sleep.
Dream-workers are turning up. 
They will wipe away your tears and tribulations, and make you cleansed up.
They will soothe your tired body, offer solace to your fatigued mind and pamper you up. 

They will put you in the lap of the departed dear and make them sing lullabies to your ears. 
They will provide you with music that shall be a feast on your ears. 

For a picnic in amazing and enchanting worlds, they will groom you.
For tomorrow's struggle in life, they will pep you up by energizing you. 

Go to sleep, go to sleep.
Dream-makers are turning up.

======== ======== ======
Another Version:-

Detour of Dreamland
~~~~~~ ~~~~~~ ~~~~
Hey!
Go to the sleep.. Guys..
Slumber again n' again !
The dreamers are coming through....!

To
Clear and clean the 
Sorrowed heads 
N' to wipe off the tears...!

For
Smoothening and cradling
The disgusted soul
And the tired body!

They will make you sleep deeper
on your 
loveable disappeared personalities 
With lovely songs...!

They will SING melodies 
And make your eyes 
Feast and feel Happiness..!

They will send you to the Dream Land of Detour 
You will be in the land of wonderful sights are
 Blinking and shaking...!

They will fill your body with 
great energy 
They will fill your mind with 
grandeur enthusiasm...
To live the next life with 
zeal and jest...!

That's why !
Go for a sleep
Slumber again n again..!
The dreamers came through...!

======== ======== ======


Original Telugu poem:-

స్వప్న లోక విహారం
======= =====
పడుకోండి, పడుకోండి 
కలల కార్మికులొచ్చేసేస్తున్నారు! 

కష్టాలను, కన్నీళ్ళను 
శుభ్ర పరిచి శుద్ధి చేసేస్తారు! 

అలసిన ఒంటిని, సొలసిన మనసును
లాలించి సేద దీర్చేసేస్తారు! 

కనుమరుగైన ప్రియతముల
ఒడిలో పడుకోబెట్టి లాలి పాడించేసేస్తారు! 

కమ్మని గానంతో
వీనుల విందు చేసేస్తారు! 

అద్భుత సుందరలోకాల
వాహ్యాళికి సిద్ధం చేసేస్తారు! 

రేపటి జీవన పోరాటానికి
జవసత్వాలు నింపి సమాయత్తం చేసేస్తారు! 

అందుకే, 
పడుకోండి, పడుకోండి, 
కలల కార్మికులొచ్చేసారు! 
- ప్రభాకర్ జైని. 


https://m.facebook.com/story.php?story_fbid=1230802423733303&id=100004106718350

తేది:17.10.2017.

No comments:

Post a Comment