Saturday, 14 October 2017

He-She Avari Ashok's poem

She-He
~~~~~
          Telugu: Ashok Avari
          Translation: Vilasagaram Ravinder.

She opens her watching ears always
He always with her remembering showdow like of her
Eventhough he was far away.

She made him as her romantic King in her dream.
He crowned her as Harem Queen in his earth consciously.

She turned into Jasmine and spreads the Tricky smell for him
He made as Firefly and sung romantic melodies for loving her.

She closed her Window eyes when he came her...
He opened his Minddoors when she touched him.

Tricky words for Sometimes...
Bundle of Smiles for a long time...
Music leg sounds for so much time...
Hand bangle noise sounds...
rings...  rings... rings...
Sounds... Sounds...Sounds...
Silence is tired and retired into deep Silence in that room...

Silence...
Silence...
Silence...

అశోక్ అవారి | అతడు-ఆమె

ఆమె అతని కోసం..
చూపుల కిటికీలు తెరిచే వుంచుతుంది.
అతడు దూరంగా ఉన్నా..
ఆమె జ్ఞాపకమై నీడలా వెంటే వుంటాడు.

ఆమె అతన్ని కలలో..
తన విరహ సౌధానికి రాజుని చేస్తుంది.
అతడు ఆమెను ఇలలో..
వలపు అంతఃపురానికి రాణిని చేస్తాడు.

ఆమె అతని కొరకు..
మల్లెపూవై గమ్మత్తు వెదజల్లుతుంది.
అతడు ఆమె కోసం..
తుమ్మెదై ప్రణయస్వరాలు శ్రుతి చేస్తాడు

ఇప్పుడతని రాకతో...
ఆమె చూపుల కిటికీలను మూసేస్తుంది.
అప్పుడామె స్పర్శలో..
అతను తన ఎద తలుపులు తెరుస్తాడు.

కాసేపు గమ్మత్తైన మాటలు..
ఇంకాసేపు నవ్వుల మూటలు..
కొన్ని కాలి అందెల రవళులు..
ఇంకొన్ని చేతిగాజుల సవ్వళ్ళు..
గదిలో శబ్దాలను మోసి అలసిన నిశ్శబ్దం.

(తేది: 28.5.2017న నవతెలంగాణ జోష్ లో ప్రచురించబడింది).

No comments:

Post a Comment