Friday, 29 September 2017

The pity Mother...

అనువాద సౌరభం-15.

Introduction:-

       ఈ గ్రూపులో ఇది నా 15వ అనువాదం.  ఉష శ్రీ గారు మంచి భావుకతతో కొంత కాలంగా ఫేస్ బుక్ లో కవిత్వం రాస్తున్నారు.  వీరు నా పూర్వపు పాఠశాలలో సహ ఉపాధ్యాయుని. కొన్ని వ్యక్తిగతమైన కారణాలతో మా మధ్య ఈ మధ్యలో సంభాషణ లేదు.

       కవిత్వం నా ప్రాణం.  కవిత్వం రాయకుండా ఉన్నట్లయితే ఈ అనువాదం నేను చేసి ఉండే వాడిని కాదు. శూన్యంలో ఎక్కడో గిరికీలు కొడుతూ ఉండే వాడిని.

      ఉష శ్రీ గారు మంచి కవయిత్రి.  కొంచెం సామాజిక స్పృహతో రాస్తే మంచి పేరు తెచ్చుకుంటారు.

      ఈ కవిత విషయానికి వస్తే అమ్మ ఎవరికి అయినా ఆది దేవత. ఆ అవ్వను అనాదగా వదిలేయడం అమానుషం.

      ఈ అనువాదం “స్వేచ్చానువాదం” కొన్ని భావాలు ఇతర భాషలలో చెప్పడం అసాధ్యం.  అందుకే నేను ఈ పద్ధతి ఎంచుకున్న.

ఇక అనువాద సౌరభంలోకి వెళదాం.

స్వేచ్చానువాదం:-
=========

Pity Mother...
~~~~~~~~

Telugu Poem: Ushasree Veggalam

English Translation: Vilasagaram Ravinder.

Yes...
She is your mother...
She loves you a lot...

Yes
She is your mother
She feels that you are her dreams like
She loves you a lot...

Your father went to other country
And comes with dead body
Her heart is broken.

Yet
She is running with time for yours sake
She forgets all her hungry
She doesn't drink even water
She eats with your smiles
She works for your smiles...
She made you as a Great Officer
And
She gives a Great name and fame
In the society.

Now you are shame while watching her folded skin
Which give the bundle of sweat...
Her eyes are forgotten her sleep
She doesn't lift her back for your happiness
That is still like that straight.

You feel Shame... shame...
Whenever sees this dirty body...

You take all of her wealth and existentialism
You remain her on the roadside...

She doesn't work like the past
Her shelter is not permanent
She doesn't beg because she lives in the prestigious life
If anybody offers anything she doesn't reject...

Yet
She doesn't curse you
But
But
She has been waiting for you since a long time
With the Fussa eyes
She likes to bless you
She doesn't want your Air Conditioning rooms
She waits and waits
One day her eyes are closed
She gives her life to you
But
She is no more
She is no more
She will not see you
She will not see you forever...
She disappeared from this world forever...

======== ======= ============

👵పాపం అమ్మ👵

అవును తను నీ అమ్మే

తన కలలకు ప్రతిరూపానివి నీవని
నిను అమితంగా ప్రేమించిన నీ అమ్మ

నీ తండ్రి నీ భవిత కోసం
పరాయి దేశం వెళ్లి శవమై వస్తే...
తన గుండె పగిలినా...

నీ కోసం కాలంతో పరుగెత్తుతూ...
ఆకలి నిద్రల చెలిమి వదిలి
నీ చిరునవ్వులో తన ఆకలి తీర్చుకొని
నిన్నో గొప్ప ఉద్యోగిని చేసి
సమాజంలో నీకు ఓ పేరునిచ్చిన నీ అమ్మ

ఇప్పుడు ఆమెను చూస్తే నీకవమానం

నీకై చెమట చిందించిన దేహపు ముడతలు
నీకై నిదురను మరచిన ఆ కను గుంటలు
నీకై వంచిన నడుం ఎత్తలేదు కదా!
అది అలాగే ఉండిపోయింది

ఛీ ఛీ ఏం బాగా లేదు
ఎవరైనా చూస్తే ఎలా...

అందుకే ఆమె ఆస్తిని అస్థిత్వాన్ని లాక్కుని
ఆమెను రోడ్డు పాలు చేశావు

తానిప్పుడు మునిపటిలా శ్రమించలేదు
తనాశ్రయం శాశ్వతమేమీ కాదు
గౌరవంగా పని చేసుకు బతికిన తను
చేయి చాచలేదు
ఎవరైనా పెడితే కాదనదు

అయినా తను నిన్నెపుడూ శపించలేదు
కానీ... కానీ...
తను నీ కోసం ఆశగా ఎదురు చూస్తుంది
అదే ఆ గుంటలు పడిన కళ్ళతో...
నిన్ను చల్లగా ఉండమని దీవించడానికే గానీ...
నీ ఏసీ గదిలో సేదదీరాలనే ఆశేమీ లేదు

ఎంత వరకిలా...
చివరికోరోజు తను నిదుర పోయింది
మళ్ళీ ఇక లేవలేదు
ఇన్నాళ్లూ నీకే ఇచ్చిన తన నిద్రను తను పూర్తిగా తీసేసుకుంది

నీకు మళ్ళీ కనిపించనంత దూరంగా...
వెళ్ళి పోయింది

*ఉషఃశ్రీ 23.9.17

https://www.facebook.com/groups/kavisammelanam/permalink/1408473579270963/

========== ========== ===========
English Translation: Vilasagaram Ravinder.

You are Me... I am You...

అనువాద సౌరభం- 14

You are me... I am you...
==== ====== =======
Telugu Original poem: Sudha Rani
English Translation: Vilasagaram Ravinder.

I know all my memories are you
I know all my accosts are you
I know all my watching lines are you
I know all my inner feelings are you.

I know all my hopes shore is you
I know all my likes waves are you
I know all my words sweets are you
I know my breath fragrance is you.

I know your smiling flowery buds are me
I know all your mind feelings fragrance is me
I know all your mind singing moon songs are me
I know all your heart musical Ragas are me.

The sky and the earth linked rainbows are us
The eye lids disappeared shape is us
If we find other life We are One for One...

In this life
We are Made for each other...
One is the Other...

======== ======== ======== ===
🌹నువ్వే..నేను🌹నేనే..నువ్వు🌹

నా కలవరింతలన్నీ నువ్వేనని తెలుసు
నా ప్రతీ పులకరింపు నీదేనని తెలుసు
నా చూపురేఖలన్నీ నీవేనని తెలుసు
నా అంతరంగ భావనలన్నీ నీవని తెలుసు

నా ఆశలతీరం నీవేనని తెలుసు
నా కోరికల అలలన్నీ నీవని తెలుసు
నా మాటల్లో సుధలన్నీ నువ్వేనని తెలుసు
నా ఊపిరి పరిమళం నీదేనని తెలుసు

నీ నవ్వుల విరితావుల్లో నేనున్నానని తెలుసు
నీ మదిభావనా సుగంధం నాదేనని తెలుసు
నీ మది పాడే వెన్నెలగీతం నేనేనని తెలుసు
నీ హృదయ రాగ తాళాలు నావేనని తెలుసు

నింగినీ నేలను కలిపే హరివిల్లే మనము
కనుపాపలో 'కలగలిసిన' రూపం మనది
మరుజన్మంటూ ఉంటే ఒకరికి ఒకరై.......

ఈ జన్మంతా.........ఇద్దరం.......ఒకటై

సుధా మైత్రేయి
16.09.17

https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1402678816517106

======= ======== ========= =======
English Translation: Vilasagaram Ravinder.

My Hands. .

అనువాద సౌరభం-13

Introduction:

        మెట్టా నాగేశ్వరరావు గారు ఇప్పుడు బాగా మంచి కవిత్వం రాస్తున్న వారిలో మొదటి వరుసలో ఉన్నరు.  పుస్తక విశ్లేషణలు కూడా విరివిగా చేస్తున్నరు. వీరు “మెట్టామాణిక్యాలు” అనే రుబాయీల పుస్తకం అచ్చవేసినరు. త్వరలో “కవితలుపూచిన చెట్టు” పేరుతో (వచనకవిత్వం) “నాన్నకవితలు” “మెట్టానానీలు” మొ|| పుస్తకాలు అచ్చు వేయుటకు సిద్ధం అయితున్నరు.

        ఈ కవిత విషయానికొస్తే ఎవరి పనులు అయినా చేతుల తోనే గొప్పగా పూర్తయితయి. పేరు తెస్తయి. మెట్టా గారికి వారి అమ్మ నాన్న అంటే ఎక్కడ లేని ప్రేమ.  చివరికి కవిత్వం దగ్గర ఆ చేతులు శాశ్వతం అయితయి అనే వాక్యం నాకు బాగా నచ్చింది.  ఇక అనువాదం లోకి వెళదాం.

స్వేచ్ఛానువాదం: -

My Hands...
=========
Telugu Poet: Metta Nageshwar Rao.
English Translation: Vilasagaram Ravinder.

I don't know
my mother how many times kissed my little hands
They empurpled starts
They rejects and doing small kids works
They don't know
hemianesthesia in their blood.

When I write the words like diamonds
Her eyes are like nightingale.
When she fells with fever and doesn't get down the bed
I feel like child Bheema and prepares food
She calls me near and pats my head with love
When I clean before our home and
Lightens the stars
She becomes the oceans happiness in her heart.

She amplifies my hands
I do not through even one stone on others.
I do not claps my hands
to any rich person for their fevers.
I do not support any false persons for their fevers.

My mother feeds my hands
They take knifes and cut the water fruits
And give among the friends with love.
They take the axes
And chop the palms/Munjakaayalu
And help the father like little squirrel
They take books and
Rub the illiteracy of our ancestors.
My hands are afraid anyone
But they revolt on my mindlessness
within seconds like light running On the clouds
My hands are like sweet friends
To reform me.

I will die like anyone anywhere anytime
And disappear in the blanket
But my hands live forever eternal
Because they catch the poetry and poetry
They write the poetry and poetry...
====== ======== ======== ==============

Telugu Original poem:

నా చేతులు  
========
Telugu  poet : Metta Nageshwar Rao

చిన్నప్పుడు మా అమ్మ
ఎన్నిసార్లు ముద్దాడిందో తెలీదు గానీ
నా చిట్టి చేతుల్నీ
అవి కండపోసుకోవడం మొదలు
ముద్దాయి పనులను నిరసిస్తూ
ముద్దు ముద్దు పనుల్నే చేస్తున్నాయి!
మొద్దుతనం వాటి రక్తంలో లేదు

పలకపై అక్షరాల్ని వజ్రాల్లా రాసినపుడు
అమ్మ కళ్లు నెమలి పింఛాలయ్యేవి
జ్వరమొచ్చి అమ్మ మంచం దిగనపుడు
బాల భీముణ్ణయి గరిట తిప్పినపుడల్లా
దగ్గరకు పిలిచి ప్రేమగా తలను నిమిరేది
నా చిన్న చేతులు కళ్లాపి జల్లి
వాకిల్లో నక్షత్రాల్ని గీస్తే సంతోష సాగరమయ్యేది

అమ్మ పెంచిన నా చేతులు
ఎవరిపై రాళ్లను వేయలేదు
బానిసత్వం నింపుకుని
ఏ బలిసినోడి దగ్గర భజనా చెయ్యలేదు
ఏ అవినీతి నాయకుడికైనా జైలూ కొట్టలేదు!

అమ్మ సాకిన నా చేతులు
కత్తులు పట్టాయి
ముంజలు కొట్టి నేస్తాలకు పంచాయి
గొడ్డళ్లను పట్టాయి
తాటి మొద్దుల్ని నరుక్కొచ్చి
అయ్యకు ఉడత సాయాన్ని అందించాయి
పుస్తకాల్ని పట్టాయి
మా వంశంపైనున్న నిశానిముద్రని చెరిపాయి!

నాచేతులు
ఎవరి మీదైైనా జంకుతాయి కానీ
నామనసు బుద్ధిహీనంగ ఆలోచిస్తే మాత్రం
మెరుపువేగంతో చెయ్యిచేసుకుంటాయి
నన్ను సంస్కరించడంలో
నాచేతులపాత్ర మిత్రునిచందం!

ఏదో ఓ రోజు
నేను మరణిస్తాను
అందరిలాగే నేను కూడా
మట్టిబొంత కింద జేరి అంతమవుతాను
కానీ
నా చేతులు బతికేవుంటాయి
ఎందుకంటే
అవి కవిత్వాన్ని కవిత్వాన్ని పట్టుకున్నాయి!!
కవిత్వాన్ని కవిత్వాన్ని రాశాయి!!

               **************

English translation: Vilasagaram Ravinder.

Unhappy Flower

అనువాద సౌరభం- 12

Introduction :

     రవి వీరెల్లీ గారు సీనియర్ కవి. కవిత్వం అంటే ప్రాణమిచ్చే కవి. వీరు 2012 లో దూప కవితా సంకలనం ప్రచురించారు. ఆ తర్వాత 50 కి పైగా కవితలు మాత్రమే రాసినరు.  ఈ సంవత్సరం “కుందాపన” 48 కవితలతో వేసినరు. ఆ సంకలనం కొద్ది రోజుల క్రితం ఒక ప్రియ పిత్రుని ద్వారా అందింది. పుస్తకం మొత్తం చదవలేదు. నాలుగు ఐదు మాత్రం నా అంతులేని సమస్యల మధ్య చదవ గలిగిన. అందులో నాకు బాగా నచ్చిన పోయెమ్ ఇది. అన్ని కవితల చాలా గాఢత కలిగినవే. అన్నీ అనువాదానికి లొంగవు. నిన్న ఒక పుస్తక ఆవిష్కరణ కు హైదరాబాద్ వెళుతూ ఈ కవిత అనువాదం చేసిన. ఈ కవితా సంపుటికి కె శివారెడ్డి గారు, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గార్లు ముందు మాట రాసినరు.  ఈ కవిత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారికి బాగా నచ్చింది.

       నేను స్వేచ్ఛానువాదం ఎంచుకోవడం జరిగింది.  కవి భావం వచ్చే విధంగా ఆంగ్లంలోకి అనువాదం అనుసరిస్తున్న. నా సొంత భావాలు ఏవీ దరిచేరనీయడం లేదు. ఈ మధ్యలో పెద్దల సలహా మేరకు అనువాదం ఈ విధంగా చేస్తున్న.  ఇక అనువాదంలోకి వెళదాం.

Unhappy Flower

    Telugu Poet:  Ravinder Verelly
    English Translation:  Vilasagaram Ravinder.

In a prolonged discussion...
May be at an end,
Suddenly stopped ending
In the Time hands
The dark and light weaves
Suddenly the threads colour changed.

May be they think to dance with moon
Lightens,
darkens,
The stars are tuning
The variety tunes tuning.

I am stretch the bed before the house
And resting the body...
The sky is drubbing my memories one by one.

I enlighten the past
As usual and breathe tightly.

The unhappy flower, which born on the night branch
Does not want to exfoliate at this time.

====== ======== ======== =========
English Translation:  Vilasagaram Ravinder.

Mother River

అనువాద సౌరభం-11.

Introduction: -

     వారాల ఆనంద్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి.  కవిత్వం రాయగలరు. ఇంటర్వ్యూ చేయగలరు. వ్యాసం రాయగలరు. కథలు రాయగలరు. అనువాదం చేయగలరు. వీరి గురించి రాయాలంటే అదే ఒక వ్యాసం అవుతుంది. ఆ సాహసం తర్వాత చేస్తాను.  ఇప్పుడు రేఖా మాత్రంగా వారి గురించి చెబుతాను. వీరు ఇప్పటి వరకు 3 కవిత్వ సంపుటిలు, ఒక విమర్శ పుస్తకం, ఒక ఇంటర్వ్యూ పుస్తకం,  ఒక ఆంగ్ల అనువాదం,  పిల్లల సినిమాల అనువాదం ఇంకా చాలా గ్రంధాలు ఆల్బం లు వేసారు. వీరికి సినిమా రంగంలో అద్భతమైన అనుభవం ఉంది.  వీరు వీరి మిత్రుల కారణంగా ఇప్పుడు కరీంనగర్ లో ఫిల్మ్ భవన్ నిర్మాణం జరిగింది.  ప్రస్తుతం వారు జాతీయ స్థాయిలో సెన్సార్ బోర్డు సభ్యులుగా ఉన్నరు.

        ప్రస్తుత కవిత విషయానికొస్తే కవి నదిని తన తల్లి తో పోల్చడం.  కవిత్వం అంటెనే ప్రత్యేకంగా ఉండటం, చెప్పడం జరుగుతుంది.  ఈ కవిత సర్వజనీనమైనది పూర్తి భావం మరో భాషలో చెప్పడం కష్టం అందుకే నేను స్వేచ్ఛానువాదం చేస్తున్న.

స్వేచ్ఛానువాదం: -

Mother River
~~~~~~~~

Telugu Poet:  Varala Anand

English Translation:  Vilasagaram Ravinder.

In the branches of trees
There spread the greenish nature  densely..
The clouds watching this
They are scattered the drizzle somewhere in the starting of the river.

One by one the drops made
the flow and flow
It becomes the river.

The river accosted the Villages
They jump and jump the heights
Run and run that made flowing and flowing
It lives and lives...

If the water flow have the wings
They would fly like birds
They would touch the fields and the barren lands
They would engulf the all lands in this earth...

I go to the river and touch with my hands
I asked it “How are you dear”
She replies happily and eagerly
I think my mother call me
The thoughts and thoughts of mother memories layers...
My eyes drops four eye drops silently
They mixes with the river and through away with flowing...
I am like statue in the river bank still now...

====== ======== ========== ==========

English Translation: Vilasagaram Ravinder.

We will change...

అనువాద సౌరభం- 10.
Introduction :-

ఈ గ్రూప్ లో ఇది పదవ అనువాదం. లక్ష్మి నారాయణ  (కుం చె గారు)  చాలా కవిత్వం రాసారు.  చాలా కథలు కూడా రాశారు.  ఈ కవిత ఇప్పటి సమాజానికి అవసరమైన వస్తువు. అభివృద్ధి పేరుతో మనిషి ప్రకృతిని నాశనం చేస్తున్నడు. ఈ కవితలో కూడా ఇది ప్రధానమైన అంశం.

      లక్ష్మి నారాయణ గారు మనిషి తన అవసరానికి ఒక చెట్టును నరికితే పది చెట్లను నాటాలంటరు. ఇది నాకు బాగా నచ్చింది.

         అలాగే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా భూమండలమంతా పరిశ్రమలతో నిండిపోతున్నది. పరిశ్రమలను ఆపలేం. కనీసం ఆ పరిశ్రమల ప్రాంతమంతా చెట్లతో నింపాలంటరు. ఇది నాకు చాలా నచ్చింది.

  నేను ఎప్పుటి మాదిరిగా స్వేచ్ఛానువాదం అనుసరిస్తున్న...

స్వేచ్ఛానువాదం...

We will change..

Telugu Poet: కుం చె గారు
English Translation: Vilasagaram Ravinder.

Will we change...
The sun red Ray’s into
The greenish nature with Plants?

Will we change...
The brackish sky buildings
Into blueish white colours mingled?

Will we change...
The broken Ozone layer with fulfilling that into full layer...

Will we change...
The plastics garbage water into pure water
with the help of cows whiteness...

will we change...
The pollution casuases into great works...?

Will we change...
The earth into plants forest
If we cut one tree for our necessaries or unnecessarily...
We will plant ten trees...?

Will we change...
If we establish one factory
We can plant trees to dry up all the carbon di oxides...?

Yes
We will Change...
We welcome the modernization
We can establish the old nature...
Yes...
We should build the ancient nature...

Yes...
We would Change it...
We would  Change it...

English Translation:  Vilasagaram Ravinder.

My Village and Me

అనువాద సౌరభం-9

Introduction:

• ఈ కవిత స్వర్గీయ నరేంద్ర బాబు గారు 2015 రాసింది. నరేంద్ర బాబు గారు కవిత్వం అంటే ప్రాణమిచ్చే వారు. వ్యక్తిగతంగా పరిచయం లేదు. ఫేస్ బుక్ ద్వారానే పరిచయం.  చాలా తక్కువ కవిత్వం రాసారు.  కవిత్వం ప్రేమించే వారి కోసం యాకూబ్ సార్ లాగానే “కవి సమ్మేళనం” గ్రూపు ఏర్పాటు చేసారు.  ఏమయిందో తెలియదు. చాలా తొందరగా ఈ ప్రపంచం నుంచి మాయమయ్యారు.

• ప్రస్తుత కవిత విషయానికొస్తే ఈ కవిత వారి స్వంత గ్రామానికి వెళ్ళినపుడు తన అనుభవాన్ని కవిత్వం చేసారు.  ఎవరికైనా తమ స్వంత ఊరంటే ఎక్కడ లేని ప్రేమ ఉప్పొంగుతది. మనల్ని మనం మరిచి గ్రామ పరిసరాలతో, చిన్న నాటి దోస్తులతో అప్రయత్నంగా అనువణువూ మమేకకమయి పోతం. ఈ కవిత అలాంటిదే. కవి తన ఊరెళ్ళినపుడు వర్షం రావడం ఆ ఆనంద పరవశం కనిపిస్తుంది.

• ఆ మధ్యలో నేను హైదరాబాద్ వెళ్ళి వస్తూ మా ఊరు పొలిమేరలో గాలి కూడా కన్న తల్లి స్పర్శ లా ఉందని రాశాను.  ఈ భావాలు విశ్వజనీనమైనవి.

• ఇక అనువాదం మామూలే “స్వచ్ఛానువాదం”. Cv Suresh Sir చాలా సహాయం చేస్తున్నారు. కవిత్వం రాసుడు కంటే అనువాదం ద్వారా చాలా విషయాలు తెలుస్తున్నయి.

• ఇక అనువాదం లోకి ప్రవేశిద్దాం.

స్వేచ్ఛానువాదం:
============

My Village and Me in between Rain...
======= ========= ======== =====

    Telugu Poet : Narendra Babu...
      Date 30 May, 2015.
    English Translation: Vilasagaram Ravinder.

Seems may be strange !
Sounds like peculiar !

Something interrelated ...!

Yes!
I even feel like so..!
My Village and Me in between Rain...!

Soul will swing...!
When those thoughts arise !

On my arrival..!
The village mother hugs me..!

The Rain friend
Comes to see me...!
Briskly!
Kisses me...!
Force me to dance along with her..
Demands me to sing a compassion song
     in the drought sticken area...!

Wipes the age old  tears...!

In the complete hot sun ...!
She touches my feet with chilled water..!

I don’t care her and go...!
She comes and blows
the air like thunder...!
She comes with ardent rumble...!

I don’t grasp at that time...!
She blows the stave with lots of air...!

What ever it may be...
My Mother Village has been thirsting for water for a long time...!

She pours water into her mouth...!
and
she regains
her life again...!

Perhaps for that...!

My Village boggles me always...!
Like my mother !

====== ======== ======== ==========
Telugu Original poem:

//మా ఊరు నేను మధ్యలో వర్షం//
                                   -నరేంద్రబాబు.

వింతగా వుండొచ్చు..
విచిత్రమూ అనిపించవచ్చు!
మా ఊరు నేను మధ్యలో వర్షం
ఈ మూడింటికీ ఏదో సంబంధముంది

అవును
ఆలోచిస్తే నాకే లీలగా అనిపిస్తుంది
ఊహిస్తే మనసు ఊయల ఊగుతుంది

తల్లిలాంటి ఊరికి వచ్చినప్పుడల్లా
నన్ను చుడటానికే అన్నట్లు
క్షణం ఆలశ్యం చేయకుండా వచ్చేస్తుంది

తల నిమురుతుంది
బుగ్గలు ముద్దాడుతుంది
అబ్బో నా చేతులు పట్టుకొని
అదే పనిగా తనతో ఆడమంటుంది

కరువు సీమలో కన్నీటి పాట పాడమంటుంది
తరాలుగా గూడుగట్టుకొని
ఉబికి ఉబికి కన్నీరొస్తే
అవేవి కనిపించకుండా మాయ చేస్తుంది

బస్సు దిగి ఊళ్లోకి నడుస్తుంతే
యెక్కడుంటుందో అమాంతం వచ్చేస్తుంది

భగ భగ మండే ఏండల్లోను
చల్లటి నీటితో పాదాలను ముద్దాడుతుంది

దాన్ని నేను పట్టించుకోనట్టు వెళ్లానా
ఉరుమై ఉరుముతుంది
పిడుగై ఘర్జిస్తుంది

అప్పటికీ గ్రహించలేదో
హోరు గాలితో బెంబేలెత్తిస్తుంది

ఏమైతేనేం
దాహంతో తడారిన నా పల్లె తల్లి
ఇన్ని నీళ్లు గొంతులో పోసుకొని
మళ్లీ ప్రాణం పోసుకుంటుంది

బహుసా
ఇందుకోసమేనేమో
మా ఊరు నన్నెప్పుడూ కలవరిస్తూనే వుంటుంది...
అచ్చంగా మా అమ్మలా!

https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=771327982985529

Hanged Thread

అనువాద సౌరభం-8.
Introduction: -
ఈ కవిత ప్రస్తుత కాలంలో చేనేత కార్మికుల దీని స్థితిని గురించి హృదయ విధారకమైన వారి పరిస్థితిని తెలుపుతున్నది. ప్రస్తుత ప్రభుత్వాలు చేనేత కార్మికుల ఆకలి చావులు తెలిసి కూడా తెలియనట్లే ప్రవర్తున్నయి. ఈ కవిత లో చేనేత పనికి సంబంధించిన అనేక పారిభాషిక పదాలు పూర్తి స్థాయిలో అనువాదం చేయలేక పోయాను.  అందుకే నేను స్వేచ్ఛానువాదం ను అనుసరిస్తున్న.

           డా. పత్తిపాక మోహన్ గారు సిరిసిల్ల నివాసులు. నేతన్నల మరణాలను ప్రత్యక్షంగా చూసిన వారు. వారి హృదయం మరణవేదన చెంది రాసిన కవిత ఇది. ఊరు కు దూరంగా ఉన్నా ప్రతిరోజూ అనేక మంది నేతన్నల క్షేమ సమాచారం రోజూ తెలుసుకుంటారు.

స్వేచ్ఛానువాదం:

Hanged thread...
    Telugu poem : Dr. Mohan Pathipaaka
    English translation:  Vilasagaram Ravinder.

If fibre cuts we can join it
If thread ruins we can add it
If life thread cuts we can’t join it...

The whole family hard-fought...
They weaves the plus like Sarees
They weaves filigree like Dhotees...
The banners flying in the shoulders
Like coffins...

Learning even no word...
The bundle of beam threads counting
Like skilled worker
The weavers carved with hands
The plumes and the moon like frames...

What curses
What sins
The life beams miscounting...

The weavers
The clothing masters
Are behaving themselves
No one understands any one...
Then
The weavers lives are like the railway lines
They are like beams without threads !
They are threads without fagends...
You can weave warps and woofs ..
Mingled and mingled...

You can down the rainbows
by mixing the colour of threads...

The weaver’s lives are like up and downs...
Sometimes go ups
And sometimes down and down...

The warps and whoofs are mingled and mingled...
The weavers save the decency of other humans
If they meet the death only salvation of their problems...!

Then this is the wrong of
The patched lives of lives
It questioned the death of them...

It must be the wrong of hanged Sirilla also...!

It is the wrong of beams
which do not feed them
even one morning with the rice...!

It is the wrong of the profession,
Which do not feed them
Even one morning with four small rice bits....!!

( the poem is in memory of the dead weavers of Siricilla every day continuously)
======== ========= ========= ===============

Telugu Original poem:
      DrPathipaka Mohan

పోగు తెగితే కలిపి అతుకు పెట్టొచ్చు
దారం పురి తప్పితే వడి పెట్టొచ్చు
బతుకు తాడు తెగితేనే కష్టం.

ఇంటిల్లిపాది కష్టపడి
జమలంచు చీరలు, జరంచు దోతులు నేసినా
భుజమ్మీద జండలా ఎప్పుడూ
కఫన్ ఎగురుతూనే ఉంటుంది.

అక్షరం ముక్క నేర్వకున్నా
పుంజాలకు పుంజాలు పోగులు
తప్పులు పోకుండా లెక్కలు కట్టే నేర్పరి.
నెమలీకలు చంద్ర వంకలు చేతితో దింపిన నేతకాడు.

ఏం శాపమో పాపమో
బతుకు పుంజాలే లెక్క తప్పుతున్నాయి.
నేత నేసేటోళ్ళు బట్టలు నేయించెటోళ్ళు
ఎవరికీ వారే అయితే
నేత బతుకులు కలవని రైలు పట్టాల
బద్దెవడని ‘లచ్చన’ పోగులు
పడుగూ  పేకల్ని కలినేయొచ్చు.
రంగుల పోగులను
ఇద్రధనుస్సులుగా నేల దింపొచ్చు.

నేత బతుకులే అర్థం కాని వైకుంఠపాళీ.
పడుగు పేకల్ని కలనేసి
మానం కాపాడిన వాడికి
అర్థాంతర మరణం అనివార్యమయితే
పొక్కిలిగా బతుకుతున్న బతుకునే కాదు
చావును కూడా ప్రశ్నార్థకం చేసిన
ఉరిసిల్ల సిరిసిల్లదీ తప్పే!

బుక్కెడు బువ్వ పెట్టని మగ్గానిదీ తప్పె.
నాలుగు మెతుకులు పెట్టని ‘కశ్పి’ది తప్పే.

(ప్రతి రోజు ఆత్మ హత్యలకు పాల్పడుతున్న సిరిసిల్ల నేతన్నల యాది)

ఆ గంట వచ్చే సమయంలో...

అనువాద సౌరభం-7.

Introduction:

            ఈ కవిత Nilimela Bhaskar సార్ నాకు అనువాద మెలకువలు నేర్పుతూ తను చదువుతున్న IndIan Literature (Golden Jubilee Issue) Nov-Dec 2007 సంచిక నాకు ఇచ్చినరు. ఆ పుస్తకంలోని  మంచి కవిత ఇది.         నలిమెల భాస్కర్ గారు బాగా చదవాలని, చదివితేనే అనువాదం చేయగలమని చెప్పినరు.   ఈ కవిత Tapan Kumar Pradhan గారు ఒరియాలో రాసి English లోకి అనువాదం చేసినది. నేను తెలంగాణ/తెలుగు భాషలోకి కొంత భాగాన్ని రెండు నెలల క్రితం అనువాదం చేసిన.  నిన్న, ఇయ్యాల తుది మెరుగులు దిద్ది మీ కోసం అందిస్తున్న.  అనువాదానికి మూల రచయిత అనుమతి తీసుకోవాలి. కాని వారి చిరునామా దొరకలేదు.  అయినా ధైర్యం చేసి ఈ శీర్షిక కోసం అందిస్తున్న.

         మరణం ఎవరికైనా వారికి చెప్పి రాదు. నిర్దాక్షిణ్యంగా తన పని తాను చేస్తూ ఎవరికి చెప్పకుండా మనల్ని ఈ లోకం నుంచి తీసుకెళుతది. అంతే. ఇక ఈ లోకం గురించి కాని వ్యక్తుల గురించి కానీ ఏ సంబంధం ఉండదు.

      నేను గత సంవత్సరం డిసెంబర్ 3న ఇద్దరు మోసపూరిత స్నేహితుల మరియు దగ్గర బంధువుల కుట్ర కారణంగా మరణపు అంచుదాకా వెళ్ళి వచ్చిన వాడిని.  కొందరు కవి మిత్రులు, కొంతమంది పాత్రికేయ పెద్దలు, నా కుటుంబం సభ్యుల ప్రేమ కారణంగా తిరిగి మళ్ళీ బతకగలగాను. అయినా నా మోసపూరిత స్నేహితుల కుట్రలు నన్ను నా కుటుంబాన్ని వెంటాడుతూనే ఉన్నయి.  ఆకాశంలో రాబందులు నేను నా తలిదండ్రులు సంపాదించిన ఆస్తిని నోట్లో వేసుకుని తినేద్దామని చూస్తనే ఉన్నయి. కవిత్వం నన్ను బతికించింది. కవిత్వం కొరకు ఏదైనా చేసే ఈ లోకం నుంచి వెళతాను. అయినా అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. ఆ మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం.

      ఇక అనువాద సౌరభం లోకి వెళదాం.  ఇప్పటికే ఆలస్యం అయింది.  ఇది ఆంగ్లం నుంచి తెలుగులోకి స్వేచ్ఛానువాదం.  దీనికి ఇటీవల కవిసంగమం గ్రూప్ లో CV Suresh సార్ చేసిన అనువాదం ప్రేరణ.

============ ============= ============= ======== ===========

ఆ గంట వచ్చే సమయంలో...
~~~~~~~~~~~~~~~~~~~

        Original Oriya and
      Translation in English Poet:  Tapan Kumar Pradhan

       Telugu Translation:  Vilasagaram Ravinder.

చావు నీవు పిలిచినప్పుడు రాదు
నువ్వెంతరచినా నీ మాట వినడు,
నిన్ను పట్టించుకోడు.
అతనికి ఒక పక్కా గంట ఉంటుంది-
నీకు పక్కనే దాగుడుమూతలు ఆడుతూ రహస్యంగా
నిన్న గమనిస్తుంటడు
ఏదో ఒక రోజు అనుకోకుండా నిన్ను చేరుకుంటడు.

నువ్వు ఒంటరిగా
నీ పక్క మీద దుప్పట్ల మీద పండుకొని ఉంటవు,
నీ ముఖంపై ఈగలు ఆడుతుంటయి
నీ శరీర సిరులు రక్తం నిండి ఉంటయి
నీ కాళ్ళ పిక్కలు పీకుతుంటయి
నీకు పిర్రలు సలుపుతుంటయి
‘హలో మిత్రమా’ అండానికి ఎవరూ తోడుండరు...
దగ్గర ఉండరు.
నీకు ఉమ్మటానికి కూడ ఓపికుండదు
నీ కళ్ళ నిండా దుక్కపు కన్నీళ్ళు ఉబుకుతుంటయి
నువ్వు బిగ్గరగా మరణమా రమ్మని పిలుస్తుంటవు, అరుస్తుంటవు
‘నేను భరించలేను తొందరగా దూరంగా తీసుకెళ్ళి పో’ అని
ఎంతరిచినా అతడు నీ మాట వినడు, రాడు.

ఒక ఒంటరి రాత్రి నువ్వు కూర్చొని ఉంటవు
ఒక గ్రామంలో మర్రిచెట్టు నీడన బ్లాంకెట్లో కూరుకపోయి
నీ చిన్న తమ్ముడి శవానికి పెట్టిన అంత్యక్రియ మంటలు చూస్తూ...
ఆ మండే జ్వాలలో నీ మరణించిన భార్య ముఖం కనిసిస్తుంటది-
నీ ఆట దోస్తులు యాదాకస్తుంటరు
నీ బడి మిత్రులు గుర్తుకొస్తుంటరు... మరణ ముఖాలతో...
నువ్వు బిగ్గరగా నీ దుక్కపు ఎడదతో నీ గుండెలను బాదుతూ ఉంటవు
స్నేహితులు వెళ్ళిపోతరు, బంధువులు వెళ్ళిపోతరు, నీ కూతుర్లు అల్లుల్ల దగ్గరకు వెళ్ళిపోతరు;
ఓ భగవంతుడా!
నన్ను ఇంకా ఈ లోకంలో ఎందుకుంచినవు!
నువ్వు కోరుకుంటవు
వెంటనే రా అని...
రా మరణమా రా !
చావు నీ దరిదాపుల్లోకి రాదు... రాదు...!

నువ్వు పైకి విశ్రాంతిగా చూస్తుంటవు పక్కపైన
క్రికెట్ వివరాలు వింటూ రేడియోని బంజేయాలని నొక్కుతుంటవు;
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్,
పది పరుగుల దూరంలో విజయం.. ఇంతలో మరో వికెట్;
నీ బిడ్డ దగ్గరగా వస్తది, సంచలన వార్తలను చెరుపుతూ...
అల్లుడు ఉత్సాహంగా... ఎంత మంచి వార్త అంటుటడు...
నాలుగు నెలల పసి మనుమడు నీ ఒడిలో ఆడుతుంటడు...
అతని చిన్నని ఎర్రెర్రని మృదు వేళ్ళు నీకు గడ్డాన్ని ప్రేమగా తాకుతుంటయి;
“ఓ ప్రియ నేస్తమా!
నా విలువైన రత్నమా !
నా బంగారమా! నా చిన్న వాడా!
ఓ... నా జీవిత సంవత్సరాలన్నీ నీవే నా ప్రియతమా...!”
నువ్వు ఆప్యాయంగా నీ మనువడి నుడురుపై ముద్దిస్తుంటవు-
నాలుగు పరుగులైతే విజయమే:

అప్పుడు చావు నిన్ను ముద్దాడుతది!

========== ========== ============

Original Oriya,  English translation poem:

The Hour of Coming...
    Poet : Tapan Kumar Pradhan.

Death does not come when you call him
However much you call, He never comes:
He comes only at his appointed hour-
Playing hide and seek, just biding his time
Comes Death one day
All of a Sudden!

When you are lying alone in your bed of rags
With flies on your face, blood in the nostrils
Knees full of pus, boils under buttocks
With nobody near you just to say ‘Ah Dear!’ to you
With no strength left even to vomit things out
And with eyes filled with tears mixed  with pain
You cry out loud-Death! Death! O Death!
Can't bear it any more Oh take me away Death!!
But never comes Death!

When you are sitting alone in the middle of the night
Under the Village Bunyan tree wrapped in a blanket
Looking at your younger brother’s funeral pyre:
In the burning embers you see your wife’s dead face-
Remember your playmates, school-Friends, dead face
You cry out loud pressing your aching heart to your chest
Friends gone, Kims gone, daughter gone to her in-laws:
Why do you now, O Lord, still keep me in this world!
You wish, if only
Could just now
Come Death!
Never comes Death!

When you are relaxing supine in your bed
Pressing the radio close, listening to cricket:
India versus Pakistan-Ah final match,
Just ten runs to win, and another wicket:
Your daughter comes near, and breaks the news
Of Son-in-laws’s promotion-Ah what a good news,
Playing in her lap your four-month old grandson
With his soft pink little fingers fondless your beard:
“Oh dear One! My diamond! My golden one, my little one!
Umhh... let my remaining years be all yours O lovely one...!”
You softly kiss your grandson’s-
Four runs to win:

Then comes Death!

========== ============ =========.
Telugu Translation:  Vilasagaram Ravinder.

Infinite War in Emptiness...

అనువాద సౌరభం-6.

Infinite War in Emptiness...!

        Telugu Poet :- Anuradha Bandi.
       Translator: Ravinder Vilasagaram.

Hunt for infinity...
We have been taken anxiety
Increasing the wings...
The wings...

Is there fewer the wings ?
There are insects, birds and human beings
Who is not ?
Which is not ?

Searching infinite...
Forgetting insight..
We are doing null fighting...
Doesn’t knowing...

How much cost ?
How much excretion?
To erase the distance of light-year

Came with empty handed
Piled infinity
Remaining...
At last empty mind...

Wondering with emptiness
In the infinity...
Kissing the Black Holes
Searching the Milky Way Galaxy...

Removing the Real bright
Calling the Artificial Light

Man drying in the infinity
Like empty Pollen...!

Where are the Wings now ?
Where are They ?...

========= =========== ===========

Original Telugu poem: -

// అనంతపుటారాటం శూన్యంగా //

అనంతాల వేటకై
ఆరాటమెక్కువయ్యి
మనమనంతంగా రెక్కలు
కొనితెచ్చుకుంటున్నాం.

కీటకాలూ పక్షులూ మనుషులూ
ఒకరేమిటి
ఒకటేమిటి
రెక్కలకు కొదువా...

అనంతాన్ని వెదక
లోఅనంతాన్ని మరచి
శూన్యపోరాటం
చేస్తున్నామని తెలీదుగా.

కాంతిసంవత్సరాల దూరాన్ని
చెరపడానికెంత ప్రయాస
ఎంత వ్యయం.

రిక్తులుగా వచ్చి
అనంతాన్ని పోగేసుకొని
చివరికి శూన్యులుగా మిగుల..

శూన్యంలో..
అనంతంగా తిరుగనాడ
కృష్ణ బిలాలను ముద్దాడ
పాలపుంతలను వెదక..,,

ఉన్న కాంతిని విడిచి
లేని కాంతిని పిలిచి
మనిషెంత రాలుతున్నాడనంతంలో
శూన్యప్పొడిలా...

రెక్కలేవీ ఇప్పుడు....!!

✍అనూరాధ
https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1354103951374593

https://m.facebook.com/story.php?story_fbid=1982681965352405&id=100008318627233

English translation:  Vilasagaram Ravinder.

I am in the Way of Yesterday...

అనువాద సౌరభం-5.

             మరోసారి అనువాద ప్రపంచంలోకి మిత్రులకు స్వాగతం.  ఈ కవిత గరికపాటి మహెందర్ గారిది. వీరు కవిత్వం రాయబట్టి చాలా కాలం అవుతుంది.  ఒక కవిత్వ సంపుటి కూడా వేసారు.  కొత్త ప్రక్రియ నానోలు కూడా చాలానే రాసారు.  వీరి శ్రీమతి కూడా కవిత్వం రాయడం విశేషం. తెలుగు సాహిత్యంలో మరో కవిత్వ దంపతులు.
       
            ఇక ప్రస్తుత కవిత విషయానికొస్తే మనిషి వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తు కోసం కలలు కనడం ఉన్న స్థితికంటే ఉన్నత స్థితి గురించి ఆలోచించడం చేస్తుంటారు. కానీ ఈ కవికి గతాన్ని తలచుకుంటూ వర్తమానంలో జీవిస్తూ ఉండటమంటేనే ఎక్కువ ఇష్టం.  అందుకే భవిష్యత్తులో ఇలా ఉంటుంది అని ఎవరూ రిజిస్ట్రేషన్ చేయలేరు అంటారు. అది నిజమే. వీరికి పాటలంటే చాలా ఇష్టం అనుకుంటాను.  వీరు తమ అనుభవాలను సామాజికం చేయడం వలన ఎవరు చదివినా తమదే అనే భావం అందుకే వస్తుంది.  ఇక అనువాదంలోకి వెళదాం.

     పెద్దలకు/మిత్రులకు మనవి. నేను అనువాదానికి కొత్త.  ఏమైనా లోపాలుంటే కామెంట్ గా మీ అభిప్రాయం రాయండి.  మీరు ఆ విధంగా చేసే గొప్ప సాయం అదే. ఒక మంచి అనువాదకుడిగా మార్చిన ఘనత మీదవుతుంది. ధన్యవాదాలు.

స్వేచ్ఛానువాదం: -
~~~~~~~~

 I am in the way of yesterday...

         Telugu Poet : గరికపాటి మణిందర్
         English Translation:Ravinder Vilasagaram

Why do I think tomorrow, which is not guaranteed me ?
No One will Registrate tomorrow...

Dream yourselves...
You shall lift yourselves you into tomorrow
With great hardness...

You jump as dragonfly on the time
You jump as black bird singing dark songs
Doesn’t believed future
You will lift yourselves you into tomorrow...

I believe yesterday with the great love
I sing that song with my heart flute...
And will collect the memory asteroids...
And ecstasy with happiness...

The time walked with me like dog from my birth...
Touching its legs on my back...
Who was the best friend to me except it...?

The time gave me...
Mother, Father...
Brother, Sister...
Wife, sons and daughters...
Especially...
Better than a few poetry sentences...

I will read tomorrow the today’s book again and again...
The sentences flying and flying...
Singing the song of yesterday...
Again and again...
In my fiddle of heart...
Singing and Singing...

====================== =====================

Original Telugu poem: -
~~~~~~~~~~~~~~

నిన్నటి దారుల్లోనే నేను
          -గరికపాటి మహిందర్.

నాదికాని గ్యారంటీ లేని
రేపటి సంగతి నాకెందుకు.
ఎవడూ కూడా
రేపటిని గురించిన రిజిష్ట్రేషన్ చేయలేడు.

కలల కనండి
ఇన్నాళ్ళ జీవితాన్ని కష్టపడి
ఆపసోపాలు పడుతూ మరీ
రేపటిలోకి మిమ్మల్ని మీరే మోసుకు పొండి.

కాలంపై తూనీగల్లా పల్టీలు కొడుతూనో
కాటుక పిట్టల్లారా చీకటి పాటలు పాడుతూనో
అస్సలు నమ్మకం లేని భవిష్యత్తును
రాత్రి దారులెంట నాటుకుంటూ పొండి.

నాకు మాత్రం
నిన్నటి రోజంటనే వల్లమాలిన ప్రేమ
ఆ గీతాన్నే గుండె మురళిలో ఊదుకుంటూ
రాలిపోయిన జ్ఙాపకాల ఉల్కలను ఏరుకుంటూ
తన్మయం పొందుతాను.

కళ్ళు తెరిచిన రోజునుండి
కాలం నాతోనే కుక్కపిల్లలా కాళ్ళంటుకునే
నా చుట్టూ తిరిగింది.
దీనికి మించిన గొప్ప స్నేహితులెవరుంటారు నాకు.

అమ్మా నాన్నలను
అన్నదమ్ములను
ఆలు బిడ్డలను
అన్నింటికి మించి
నాలుగైదు అక్షరాలను
రవంత కవిత్వాన్నిచ్చింది

ప్రతి రేపటికి
నేటి పుస్తకాన్నే పదే పదే
తిరగేస్తుంటాను.
అక్షరాలు సీతాకోకలుగా ఎగిరే
నేటి పాటనే ప్రతిక్షణం గుండె సారంగిపై
అందుకుంటాను.

           ****

https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1340860312698957

English Translation: -
Vilasagaram Ravinder.

Bloomed Man

అనువాద సౌరభం-4.

            మిత్రులకు మరోసారి స్వాగతం.  ప్రపంచీకరణ తర్వాత ప్రపంచం దగ్గరయింది. కానీ మనిషి మరో మనిషికి చాలా దూరంగా జరిగాడు. ఎంత అంటే పక్కన మరో మనిషి జీవించి ఉన్నాడు. మాట్లాడితే సంతోష పడతాడు అనే విషయాన్ని మరిచేంతగా. ఒక్క కుటుంబంలో ఉన్న వారు కూడా మనసారా మాట్లాడు కోనేని పరిస్థితి.  దగ్గరి స్నేహితులు కూడా లాభం వస్తుంది అంటే చంపడానికి కూడా వెనుకాడని దుస్థితి.

            ఈ కవిత వారణాసి భాను మూర్తి గారు రాసింది.  ఇప్పటి హడావుడి బతుకులకు దర్పణం ఈ కవిత. భాను మూర్తి గారు ఇది వరకే రెండు మూడు కవితా సంపుటాలు వెలువరించారు.  మాతృ దేశానికి దూరంగా ఉన్నారు. ఈ మధ్యలో విరివిగా కవిత్వం రాస్తున్నారు.  యువకులతో పోటీపడుతూ సామాజిక సమస్యలను తన కవితా వస్తువులను తీసుకుని రాస్తున్నారు.

            ఈ కవిత చాలా రోజులయింది చూసి.  ఇప్పటి సమాజానికి అద్దం పడుతుంది.  మనిషి మనిషితో మాట్లాడనప్పుడు అతడు మనిషెలా అవుతాడు. నిజమే కదా. ఇక అనువాదంలోకి ప్రవేశిద్దాం. నా ఈ అనువాద శీర్షికకు కవి మిత్రులు Cv Suresh గారు ఎప్పటిలాగే తోడ్పాటునిస్తూనే ఉన్నారు. వారికి ధన్యవాదాలు.

స్వేచ్ఛానువాదం:-

Bloomed Man
~~~~~~~~~~~
      Telugu poem :  వారణాసి భాను మూర్తి
      Translation: Ravinder Vilasagaram

Some people are desert furzies..
And,
some are thorny trees
along with the roadside...

Some people are like
Smile flowers in the gardens!
Some are like
Jasmines in the house pots !

Some are measured with distances
We can't see any season dilated in some men’s faces...
They are like
Dead trunks
Dead faces...

Some people are given their
Love hearts within one small hug..
Some are exchanged their
Love rain within one small gander...

When
Some people are talking
The lovable fonts are bilging...

When
Some are laughing...
The amicable ponds are blithering...

What do you lose
If you are thrilled ?
Only some words are lost...
What do you empty
Heart accosts with another heart ?
Some seconds abdicating!

One should be formed bud...
One must blossom!

What is his entity..?
If he can't conservate with another...

Original Telugu poem:

పుష్పించిన  మనిషి

------------------------------------------------

కొందరు మనుషులు  ఎడారుల్లో  పెరిగే
బ్రహ్మ  జెముడు  చెట్లల్లా  ఉంటారు
కొందరు  మనుషులు  రోడ్ల పక్కనే
పెరిగే  తుమ్మ  చెట్లల్లా  ఉంటారు

కొందరు  మనుషులు  ఉద్యానవనంలో
పెరిగే  మొగిలి  పూవుల్లా  ఉంటారు
కొందరు  మనుషులు   మన  ఇంట్లో పెరిగే
మల్లె పూవుల్లా  ఉంటారు

ఎందుకో మరి కొందరు
మనుషులను   దూరాలతో  కొలత బెడతారు
ఆ మనిషి  ముఖంలో
ఏ  ఋతువూ   విప్పారదు   సరి గదా
మోడు  వారినట్లు  జీవం  లేనట్లు  ఉంటుంది

కొందరు ఒక్క ఆలింగనం  తోనే
మమతలని  ఇచ్చి పుచ్చు కొంటారు
కొందరు  కోన  చూపు తోనే
ప్రేమ  వర్షాల్ని  కురిపిస్తారు

కొందరు  మాట్లాడుతుంటే
అనురాగ  చలమలు  ఊరుతుంటాయి
కొందరు   నవ్వుతుంటే
మమతల  సరోవరాలు   నిండి పోతాయి

మనసు నిండా పలకరిస్తే   పొయ్యే దేముంది
కొన్ని  మాటల  ఖర్చు తప్ప
గుండెను  గుండెతో పలకరిస్తే  పొయ్యే దేముంది
కొన్ని  క్షణాల  త్యాగం తప్ప

మనిషి మొగ్గ తొడగాలి
మనిషి పుష్పించాలి

మనిషి మనిషితో  మాట్లాడని వాడు
అసలు  మనిషేట్టా అవుతాడు ?


 30.06.2015
వారణాసి  భాను మూర్తి  రావు

Translation  : VILASAGARAM RAVINDER.

The Stage

అనువాద సౌరభం-3
మిత్రులారా!
            ఇది మన “కవి సమ్మేళనం” గ్రూపులో మూడో అనువాదం. ఈ కవిత  అక్షరమాలి సురేశ్ గారు మొన్న ఆదివారం తన వారం వారం కవిత్వంలో ఉత్తమైన కవితల్లో మొదటిది. ఈ కవిత రామ కృష్ణ గారు రాసారు. ఈ కవి రాసిన కవితలు కూడా తక్కువగానే ఉన్నాయి. కవిత గురించి కవితో మాట్లాడాలి అనుకున్న అయినా నెంబర్ దొరకలేదు.
         
            కవికి అయినా, అనువాదకుడికి అయినా సంకెళ్ళు ఉండకూడదు.  అవి వారిని ఆ రంగంలో ఉండనివ్వవు. స్వేచ్ఛ లేని పక్షులు ఎలా అయితే బతుకలేవో, వారూ అంతే. నాకు ఇప్పుడు అనుభపూర్వకంగా తెలిసి వచ్చింది.
         
            ఈ కవిత abstract భావాలు కలిగి ఉన్నది. ఇలాంటి కవితలు చదివిన వారి, సమయ, సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అర్థం అయితయి. నేను అనువాదకున్నే కానీ విశ్లేషకుడిని కాదు. అందుకే నా అనువాదం సాధ్యమయినంత దగ్గరగా, సరళంగా చేయడానికి ప్రయత్నం చేసాను. ఇది “స్వేచ్ఛానువాదం”గా బావించ మనవి. ఇక అనువాదంలోకి ప్రవేశిద్దాం...

          మీరు చదివిన తర్వాత లైకు లేకున్నా పరవాలేదు.  మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో రాయండి.  నేను ఈ ప్రకృయకు కొత్త కాబట్టి.  నా తర్వాతి అనువాదాలకు మీ సూచనలు తోడ్పడతాయి. నేను నిత్య విద్యార్థినే కాబట్టి మీ అభిప్రాయం ఎలా ఉన్నా స్వీకరిస్తాను.

The Stage
========

     Telugu poem : Rama Krishna
     Translation:  Ravinder Vilasagaram

There are some collapsed Statues,
which spreads stench historical smells...

The morning, which not switched off
To be lighten...
The targeted aim blossoms in the four sides
The present changes into turning
The sword’s peak spreads the blood...
The stomach running with dark
The motherhood, which begets morning
The Stage is ready!

The running Sun embraces there
The burning flame of crowd
Singing the song of the eternal life...!

In that singing
The whole word flows like river
Ever, forever...

The crowd turns into flowing
The blooded song, which burning
To be write...
This world prepared a diary page
To be write...
Long ago...
Long ago...

At that time
At that time
Exactly...
Someone crying...
Born after a long
long time...
he recognised there
He is alive
Perhaps.... all...!
Perhaps.... all...!
Blossomed man...!!

---- ------ ------ ------ ------- ------- ------- -------- -------- -------

Original Telugu poem: -

రంగస్థలం
======

అక్కడ కొన్ని కూలిన విగ్రహాలు
చరిత్ర కంపు కొడుతున్నాయి

ఆరిపోని వేకువుల్ని వెలిగించడానికి
లక్ష్యాన్ని నలుదిక్కులా పూయిస్తూ
మలుపుగా మారుతున్న వర్తమానానికై
కత్తి అంచుమీద నెత్తుర్ని చిందించి
కడుపులో చీకటిని మోస్తూ..
ఉదయాన్ని ప్రసవించే మాతృత్వం కోసం
రంగస్థలం సిద్ధమౌతోంది...

పరిగెత్తుకుని సూర్యుణ్ణి కావలించుకునే
సమూహమొకటి నిప్పులు కక్కుతూ
అనంతజీవన గానం ఆలపించిందిక్కడే
ఆ గానంలో సమస్త ప్రపంచమెప్పటికీ
ఏరులా పారుతూనే ఉంటుంది..

సమూహం ప్రవాహమైనప్పుడు
ఆరని నిప్పులాంటి ఆ నెత్తుటి పాటను లిఖించడానికి
ఈ ప్రపంచం తన డైరీలో ఓ పేజీని ఎప్పుడో సిధ్ధం చేసుకుంది

అప్పుడే..
సరిగ్గా..అప్పుడే ఒకడేడుస్తాడు..
పుట్టిన ఇంతకాలానికి తాను బ్రతికునట్టు...
బహుశా.. అందరూ...!!
పుష్పించిన  మనిషి
- రామకృష్ణ
- - -   - - - -   - - - -  - - -  - - -  -- - -

https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1332675760184079

https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1333104413474547

====================================

Free Translation by:

Vilasagaram Ravinder.

The Mother Roots

అనువాద సౌరభం-2
~~~~~~~~~~~

              ఈ గ్రూపులో ఇది నా రెండో అనువాదం. ఈ అనువాదం అన్నవరం దేవేందర్ సార్ ఈ మధ్యలో రాసిన “తల్లి వేరు”. ఈ కవితకు ప్రపంచ స్థాయి ప్రాముఖ్యత ఉంది.
              అన్నవరం దేవేందర్ సార్ 2001 లో తన మొదటి కవిత్వ సంపుటి “తొవ్వ” నుంచి నిన్న మొన్నటి “ఇంటి దీపం” వరకు మొత్తం కవిత్వం 9 సంపుటాలు, ఒక సామాజిక వ్యాస సంపుటి వెలువరించినరు. వీరి కవితలను P. Jayalaxmi గారు “FARMLAND FRAGRANCE” పేర ఆంగ్లంలో అనువాదం చేసినరు. వీరి కవిత్వం పై ప్రముఖ సాహిత్య విశ్లేషకులు రాసిన ”వస్త్ర గాలం” ఒక వివేచన వ్యాసాల సంకలనం వెలుబడినది.

                ఊరు గురించి ఎంత చెప్పినా తక్కువే.  గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఊర్లో మనుషులే కార్యకర్తలు, నాయకులు. సంఘ సంస్కరణ ఉద్యమాలకు తొలి బీజం గ్రామమే. అందుకే అన్నవరం దేవేందర్ సార్ ఊరును తల్లి వేరు అన్నరు.

                వీరి ప్రస్తుత కవితలో 5వ ఖండికలో సమాజంలో సమాజ అసమానతలు తొలగింపు కొరకు చారిత్రక వ్యక్తులు గ్రామాల నుండి వస్తరు. దానిలో...
 1. వంగర (మన దేశ మాజీ ప్రధాని, సాహిత్యకారుడు, బహుభాషావేత్త శ్రీ పి.వి.నర్సింహారావు గారి జన్మించిన గ్రామం),
2. మడికొండ (ప్రముఖ తెలంగాణ వైతాళికులు కాళోజీ నారాయణరావు పుట్టిన గ్రామం),
3. పెండ్యాల (ప్రముఖ సాహితీ వేత్త, సమాజం కోసం పోరాట యోధులు, ఉద్యమకారులు వరవరరావు జన్మించిన గ్రామం)
4.  చింతమడక (తెలంగాణ ప్రధమ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమం కీలక నాయకులు శ్రీ KCR గారి స్వగ్రామం)
 5. పాలకుర్తి (ప్రముఖ తెలంగాణ తొలి కవి పాల్కురికి సోమనాథుడు, తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత శ్రీమతి చాకలి ఐలమ్మల పుట్టిన ఊరు),
6. హన్మాజీపేట (జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత,  ప్రముఖ దివంగత సాహితీ వేత్త శ్రీ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి జన్మ స్థానం),
7. అక్కంపేట  (తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ శంకర్ ను కన్న ఊరు),
8. తుఫ్రాన్ (ప్రముఖ సామాజిక వేత్త, ప్రజా గాయకుడు శ్రీ గద్దర్ గారి పుట్టిన ఊరు). ఇలాంటి అనేక అంశాల గురించి ఎన్ని వ్యాసాలు రాసినా తక్కువే.  అందుకే ఇక అనువాద సౌరభంలోకి వెళదాం రండి ఉల్లాసంగా...

   
Translation Poem:-

The Mother Roots
~~~~~~~~~~~

      Telugu Poem Poet: Annavaram Devender
      Translation: Ravinder Vilasagaram

1.
On the hardships of villages..
The cities  blossoming fragrances!!
The flourishing blooms
The smiles of the towns...
The villagers are jasmine buds

2.
It's the Village which sway away the starvings...
It's the oxygen..
It's the mother root of everyone.
And to the all ...

3.
The Village means the Limbus of men's loves...
The Village means the bull, the agriculture, the plough, the fields...
The Village means the trees, the hills, the ponds, and the birds...

4.
Street by Street the Thoughts of steps...
The Ideas give birth at the plinths of houses...
Four Chats Summary
The Village and the Street,
If they unite the revolutionary festival(Bonaalu) begins...

5.
The Magnum Opus plants from the Village Soul...
Vangara, Madikonda,
Pendyaala, Chintamadaka,
Paalakurthy, Hanmaajipeta,
Akkannapeta, Tufram............, .......
Every Village is the birth root of a historical Champion...!

6.
The Village is the Dias of cultural flourish
The Village is the Stage of folk Singers
The Village is the Generations of Literatures leads next.....
The twesting green green small paths...

7.
The Village Banyan shades share cool cool Airy...
The Village pond canals caters the fields thirsty
The Village is the junction of secret and public revolutionary Inly,
The Village is the Labour of All persons....
The Village is the work of All People....

=====================================

Original Telugu Poem:-

తల్లి వేరు
~~~~~

పల్లె పరిశ్రమిస్తేనే పట్నం పరిమళం
పల్లె వికసిస్తేనే నగరం నవ్వు మొకం
పల్లీయులు తెలతెల్లని బొడ్డు మల్లెలు.

ఊరే కదా లోకం ఆకలి తీర్సేది
ప్రపంచానికి ప్రాణ వాయువునిచ్చేది
ఊరు ఎవలకైనా తల్లి వేరు!

ఊరంటే మమకారపు మనుషుల కూడలి
ఊరంటే ఎద్దు, ఎవుసం, నాగలి, పొలం
ఊరంటే చెట్లు, గుట్టలు, చెరువులు, పిట్టలు

వాడ వాడలా ఆలోచనల అడుగులు
ఇండ్ల అరుగుల మీదనే ఇగురాలు
నాలుగు ముచ్చట్ల సారం
ఊరూ వాడ
ఏకమైతే... ఉద్యమ భోనాలు!

ఊరి మట్టి నుంచే మహత్తర మొలకలు
వంగర, మడికొండ, పెండ్యాల, చింతమడక,
పాల కుర్తి, హన్మాజీపేట, అక్కంపేట,  తుఫ్రాన్
ఒక్కొక్క ఊరు జగజ్జేయుని కన్న వేరు !

ఊరొక సాంస్కృతిక వికసన వేదిక
ఊరొక జానపదుల పాటల పందిరి
తరతరాల వాంగ్మయ వారసత్వం
అల్లుకున్న పచ్చ పచ్చని పిల్ల బాటలు.

చల్లదనాన్ని పంచి ఇచ్చే మర్రి నీడ
పొలం దూప తీర్చే చెరువు కాలువ
రహస్య బహిరంగ ఉద్యమాల అంతరంగం
ఊరంటే బహు జనుల రెక్కల కష్టం.

   -అన్నవరం దేవేందర్,
      9440763479.

Translation in English:

-Vilasagaram Ravinder.

The Eyed Pen



అనువాద సౌరభం-1
~~~~~~~~~
         కవిత్వాన్ని ప్రేమించే కవి సమ్మేళనం సభ్యులకు నమస్కారాలు. కవి సమ్మేళనం మిత్రులు నన్ను ఏదైనా శీర్షిక నిర్వహించ వలెనని చాలా రోజులుగా అడుగుతున్నారు. నా వ్యక్తిగత సమస్యల కారణంగా నేను ముందుకు రాలేదు.
         
          ఈమధ్యనే కొన్ని తెలుగు నుంచి ఆంగ్లంలో చేసిన అనువాదాలను చూసిన గ్రూప్ అడ్మిన్మిన్లు మళ్ళీ నన్ను సంప్రదించినారు. ఇప్పుడు నాకు కూడా కొంచెం రాసే ఓపిక వచ్చింది.  కాబట్టి  ఈ “అనువాద సౌరభం” శీర్షిక నిర్వహించడానికి ఒప్పుకున్నాను.

          నేను ప్రస్తుతం తెలుగు ఉపాధ్యాయులుగా పని చేస్తున్న.  కొంత కాలం ఆంగ్లం కూడా బోధించిన.  ఎం.ఏ తెలుగు, ఆంగ్లం ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల నుంచి పూర్తి చేసిన.  పరీక్షల కోసం కొంత ఆంగ్ల సాహిత్యంతో పరిచయం ఉంది.  అనువాదం మాత్రం ఈ మధ్యలో మొదలయ్యింది. ఫేస్ బుక్ లో కవిసంగమం లో అనువాద శీర్షిక నిర్వహిస్తున్న Cv Suresh గారి నుంచి కొన్ని మెలకువలు నేర్చుకున్నాను. వారికి ధన్యవాదాలు.

         అనుసృజన కంటే నాకు అనువాదం కష్టంగానే అనిపిస్తుంది.  అయినా ఇష్టంతో చేస్తున్న కాబట్టి
కష్టం తెలియడం లేదు. ఈ ప్రకృయకు నేను కొత్త కాబట్టి మిత్రుల, పెద్దల నుంచి సలహాలు కోరుతున్నాను.
ఇక అనువాద సౌరభం లోకి ప్రవేశిద్ధాం. ఈ నా అనువాదాన్ని స్వేచ్ఛానువాదం గారు భావించగలరు.

స్వేచ్ఛానువాదం
~~~~~~~~~

The Eyed Pen
~~~~~~~~~

         Poem by Kukatla Thirupathi
         Translation : Vilasagaram Ravinder.

Either, the pen turns into a typical ghantam
and haptic the "thalapathra"

Or, by becoming a hard pen and touch the copper plate....

Or, by transformed into a quill and kiss the folded prathi

Spreads the stone body with the chisel !
Sharpen bigger than the needle’s neck !
Searching the Earth Sky
Form the powerful feelings
The pen has the eyes
The Eyed pen !

The murmurs flying in the air,
The wings thinking
The words dwell
Twisting the love with the names
Presented the beautiful personality...

Let the cazed birds flying
The silent wounded mouths
Touch with the song ointment
And finally
Adventurous doors will be opened...

The plotted austere seeds at the castle,
The fully cavities distroying
The motive ways pouring
Like floods
The swagger generating will touch
The other end of the quasside...

The uneqal society sounds
The freedom songs
The culture Aura smells splash
The dreamy screen eyes
Touch the equality panoramis...

The enlightened pen
Chopped the limbs

It is like weapon
Which reaches its destination

It is like mirror
To that rolling time
And the sceneries of evidences.

Telugu Original poem :

కలానికి కళ్ళుంటాయి
******************
ఘంటమై తాళపత్రం తడిమినా!
చువ్వై తామ్రపత్రం తాకినా!
నెమలీకై ముడుతప్రతి ముద్దాడినా!
ఉలై శిలదేహంపై పరుచుకొని
సూది మొన కన్న సూటిగా
భూమ్యాకాశాలను గాలిస్తూ
భావాలకు రూపం పోసే
కలానికి కళ్ళుంటాయి

గాలిలో తేలియాడే ఊసులు
రెక్కలు తొడిగిన ఊహలకు
అక్షరాల ఆవాసమల్లుతూ
పేరును పేరిమితో పెనేసి
ఒక వ్యక్తిత్వాన్ని బహుకరిస్తుంది

పంజరంలోని పదపక్షుల
పాదాలు మొలిపిస్తూ
మూగ గొంతు గాయాలకు
గేయ మలాం అద్దుతూ
సాహస ద్వారాలు తెరిపిస్తుంది

పన్నాగాల పల్లేరు కోటల
కుత్సిత కుహరాల కూల్చుతూ
ఆశయాలను దారులుగా ధారవోస్తూ
ఆయువోసుకున్న ఆత్మ విశ్వాసం
ఆవలి తీరాన్ని తాకిస్తుంది

అసమ సమాజ స్మశానంలో
స్వేచ్ఛా విపంచి ఆలాపన
సాంస్కృతిక సౌరవాలను చల్లుతూ
కళలీను నేత్ర తెరలపై
సమరసతా దృశ్యాదృశ్యాలు

మేల్కొల్పే కలం కాలుచేతులు నరికినా
ఉరితాడు ప్రాణాలను పెరికినా
గురి తప్పని ఆయుధమవుతూ
కదులుతున్న కాలానికి దర్పణంగా
సదృశ్యమాన సాక్ష్యమవుతుంది.

రచన: కూకట్ల తిరుపతి, 9949247591.

ఆంగ్లంలో అనువాదం:
Ravinder Vilasagaram.