అనువాద సౌరభం-7.
Introduction:
ఈ కవిత Nilimela Bhaskar సార్ నాకు అనువాద మెలకువలు నేర్పుతూ తను చదువుతున్న IndIan Literature (Golden Jubilee Issue) Nov-Dec 2007 సంచిక నాకు ఇచ్చినరు. ఆ పుస్తకంలోని మంచి కవిత ఇది. నలిమెల భాస్కర్ గారు బాగా చదవాలని, చదివితేనే అనువాదం చేయగలమని చెప్పినరు. ఈ కవిత Tapan Kumar Pradhan గారు ఒరియాలో రాసి English లోకి అనువాదం చేసినది. నేను తెలంగాణ/తెలుగు భాషలోకి కొంత భాగాన్ని రెండు నెలల క్రితం అనువాదం చేసిన. నిన్న, ఇయ్యాల తుది మెరుగులు దిద్ది మీ కోసం అందిస్తున్న. అనువాదానికి మూల రచయిత అనుమతి తీసుకోవాలి. కాని వారి చిరునామా దొరకలేదు. అయినా ధైర్యం చేసి ఈ శీర్షిక కోసం అందిస్తున్న.
మరణం ఎవరికైనా వారికి చెప్పి రాదు. నిర్దాక్షిణ్యంగా తన పని తాను చేస్తూ ఎవరికి చెప్పకుండా మనల్ని ఈ లోకం నుంచి తీసుకెళుతది. అంతే. ఇక ఈ లోకం గురించి కాని వ్యక్తుల గురించి కానీ ఏ సంబంధం ఉండదు.
నేను గత సంవత్సరం డిసెంబర్ 3న ఇద్దరు మోసపూరిత స్నేహితుల మరియు దగ్గర బంధువుల కుట్ర కారణంగా మరణపు అంచుదాకా వెళ్ళి వచ్చిన వాడిని. కొందరు కవి మిత్రులు, కొంతమంది పాత్రికేయ పెద్దలు, నా కుటుంబం సభ్యుల ప్రేమ కారణంగా తిరిగి మళ్ళీ బతకగలగాను. అయినా నా మోసపూరిత స్నేహితుల కుట్రలు నన్ను నా కుటుంబాన్ని వెంటాడుతూనే ఉన్నయి. ఆకాశంలో రాబందులు నేను నా తలిదండ్రులు సంపాదించిన ఆస్తిని నోట్లో వేసుకుని తినేద్దామని చూస్తనే ఉన్నయి. కవిత్వం నన్ను బతికించింది. కవిత్వం కొరకు ఏదైనా చేసే ఈ లోకం నుంచి వెళతాను. అయినా అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. ఆ మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం.
ఇక అనువాద సౌరభం లోకి వెళదాం. ఇప్పటికే ఆలస్యం అయింది. ఇది ఆంగ్లం నుంచి తెలుగులోకి స్వేచ్ఛానువాదం. దీనికి ఇటీవల కవిసంగమం గ్రూప్ లో CV Suresh సార్ చేసిన అనువాదం ప్రేరణ.
============ ============= ============= ======== ===========
ఆ గంట వచ్చే సమయంలో...
~~~~~~~~~~~~~~~~~~~
Original Oriya and
Translation in English Poet: Tapan Kumar Pradhan
Telugu Translation: Vilasagaram Ravinder.
చావు నీవు పిలిచినప్పుడు రాదు
నువ్వెంతరచినా నీ మాట వినడు,
నిన్ను పట్టించుకోడు.
అతనికి ఒక పక్కా గంట ఉంటుంది-
నీకు పక్కనే దాగుడుమూతలు ఆడుతూ రహస్యంగా
నిన్న గమనిస్తుంటడు
ఏదో ఒక రోజు అనుకోకుండా నిన్ను చేరుకుంటడు.
నువ్వు ఒంటరిగా
నీ పక్క మీద దుప్పట్ల మీద పండుకొని ఉంటవు,
నీ ముఖంపై ఈగలు ఆడుతుంటయి
నీ శరీర సిరులు రక్తం నిండి ఉంటయి
నీ కాళ్ళ పిక్కలు పీకుతుంటయి
నీకు పిర్రలు సలుపుతుంటయి
‘హలో మిత్రమా’ అండానికి ఎవరూ తోడుండరు...
దగ్గర ఉండరు.
నీకు ఉమ్మటానికి కూడ ఓపికుండదు
నీ కళ్ళ నిండా దుక్కపు కన్నీళ్ళు ఉబుకుతుంటయి
నువ్వు బిగ్గరగా మరణమా రమ్మని పిలుస్తుంటవు, అరుస్తుంటవు
‘నేను భరించలేను తొందరగా దూరంగా తీసుకెళ్ళి పో’ అని
ఎంతరిచినా అతడు నీ మాట వినడు, రాడు.
ఒక ఒంటరి రాత్రి నువ్వు కూర్చొని ఉంటవు
ఒక గ్రామంలో మర్రిచెట్టు నీడన బ్లాంకెట్లో కూరుకపోయి
నీ చిన్న తమ్ముడి శవానికి పెట్టిన అంత్యక్రియ మంటలు చూస్తూ...
ఆ మండే జ్వాలలో నీ మరణించిన భార్య ముఖం కనిసిస్తుంటది-
నీ ఆట దోస్తులు యాదాకస్తుంటరు
నీ బడి మిత్రులు గుర్తుకొస్తుంటరు... మరణ ముఖాలతో...
నువ్వు బిగ్గరగా నీ దుక్కపు ఎడదతో నీ గుండెలను బాదుతూ ఉంటవు
స్నేహితులు వెళ్ళిపోతరు, బంధువులు వెళ్ళిపోతరు, నీ కూతుర్లు అల్లుల్ల దగ్గరకు వెళ్ళిపోతరు;
ఓ భగవంతుడా!
నన్ను ఇంకా ఈ లోకంలో ఎందుకుంచినవు!
నువ్వు కోరుకుంటవు
వెంటనే రా అని...
రా మరణమా రా !
చావు నీ దరిదాపుల్లోకి రాదు... రాదు...!
నువ్వు పైకి విశ్రాంతిగా చూస్తుంటవు పక్కపైన
క్రికెట్ వివరాలు వింటూ రేడియోని బంజేయాలని నొక్కుతుంటవు;
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్,
పది పరుగుల దూరంలో విజయం.. ఇంతలో మరో వికెట్;
నీ బిడ్డ దగ్గరగా వస్తది, సంచలన వార్తలను చెరుపుతూ...
అల్లుడు ఉత్సాహంగా... ఎంత మంచి వార్త అంటుటడు...
నాలుగు నెలల పసి మనుమడు నీ ఒడిలో ఆడుతుంటడు...
అతని చిన్నని ఎర్రెర్రని మృదు వేళ్ళు నీకు గడ్డాన్ని ప్రేమగా తాకుతుంటయి;
“ఓ ప్రియ నేస్తమా!
నా విలువైన రత్నమా !
నా బంగారమా! నా చిన్న వాడా!
ఓ... నా జీవిత సంవత్సరాలన్నీ నీవే నా ప్రియతమా...!”
నువ్వు ఆప్యాయంగా నీ మనువడి నుడురుపై ముద్దిస్తుంటవు-
నాలుగు పరుగులైతే విజయమే:
అప్పుడు చావు నిన్ను ముద్దాడుతది!
========== ========== ============
Original Oriya, English translation poem:
The Hour of Coming...
Poet : Tapan Kumar Pradhan.
Death does not come when you call him
However much you call, He never comes:
He comes only at his appointed hour-
Playing hide and seek, just biding his time
Comes Death one day
All of a Sudden!
When you are lying alone in your bed of rags
With flies on your face, blood in the nostrils
Knees full of pus, boils under buttocks
With nobody near you just to say ‘Ah Dear!’ to you
With no strength left even to vomit things out
And with eyes filled with tears mixed with pain
You cry out loud-Death! Death! O Death!
Can't bear it any more Oh take me away Death!!
But never comes Death!
When you are sitting alone in the middle of the night
Under the Village Bunyan tree wrapped in a blanket
Looking at your younger brother’s funeral pyre:
In the burning embers you see your wife’s dead face-
Remember your playmates, school-Friends, dead face
You cry out loud pressing your aching heart to your chest
Friends gone, Kims gone, daughter gone to her in-laws:
Why do you now, O Lord, still keep me in this world!
You wish, if only
Could just now
Come Death!
Never comes Death!
When you are relaxing supine in your bed
Pressing the radio close, listening to cricket:
India versus Pakistan-Ah final match,
Just ten runs to win, and another wicket:
Your daughter comes near, and breaks the news
Of Son-in-laws’s promotion-Ah what a good news,
Playing in her lap your four-month old grandson
With his soft pink little fingers fondless your beard:
“Oh dear One! My diamond! My golden one, my little one!
Umhh... let my remaining years be all yours O lovely one...!”
You softly kiss your grandson’s-
Four runs to win:
Then comes Death!
========== ============ =========.

No comments:
Post a Comment