అనువాద సౌరభం-5.
మరోసారి అనువాద ప్రపంచంలోకి మిత్రులకు స్వాగతం. ఈ కవిత గరికపాటి మహెందర్ గారిది. వీరు కవిత్వం రాయబట్టి చాలా కాలం అవుతుంది. ఒక కవిత్వ సంపుటి కూడా వేసారు. కొత్త ప్రక్రియ నానోలు కూడా చాలానే రాసారు. వీరి శ్రీమతి కూడా కవిత్వం రాయడం విశేషం. తెలుగు సాహిత్యంలో మరో కవిత్వ దంపతులు.
ఇక ప్రస్తుత కవిత విషయానికొస్తే మనిషి వర్తమానంలో జీవిస్తూ భవిష్యత్తు కోసం కలలు కనడం ఉన్న స్థితికంటే ఉన్నత స్థితి గురించి ఆలోచించడం చేస్తుంటారు. కానీ ఈ కవికి గతాన్ని తలచుకుంటూ వర్తమానంలో జీవిస్తూ ఉండటమంటేనే ఎక్కువ ఇష్టం. అందుకే భవిష్యత్తులో ఇలా ఉంటుంది అని ఎవరూ రిజిస్ట్రేషన్ చేయలేరు అంటారు. అది నిజమే. వీరికి పాటలంటే చాలా ఇష్టం అనుకుంటాను. వీరు తమ అనుభవాలను సామాజికం చేయడం వలన ఎవరు చదివినా తమదే అనే భావం అందుకే వస్తుంది. ఇక అనువాదంలోకి వెళదాం.
పెద్దలకు/మిత్రులకు మనవి. నేను అనువాదానికి కొత్త. ఏమైనా లోపాలుంటే కామెంట్ గా మీ అభిప్రాయం రాయండి. మీరు ఆ విధంగా చేసే గొప్ప సాయం అదే. ఒక మంచి అనువాదకుడిగా మార్చిన ఘనత మీదవుతుంది. ధన్యవాదాలు.
స్వేచ్ఛానువాదం: -
~~~~~~~~
I am in the way of yesterday...
Telugu Poet : గరికపాటి మణిందర్
English Translation:Ravinder Vilasagaram
Why do I think tomorrow, which is not guaranteed me ?
No One will Registrate tomorrow...
Dream yourselves...
You shall lift yourselves you into tomorrow
With great hardness...
You jump as dragonfly on the time
You jump as black bird singing dark songs
Doesn’t believed future
You will lift yourselves you into tomorrow...
I believe yesterday with the great love
I sing that song with my heart flute...
And will collect the memory asteroids...
And ecstasy with happiness...
The time walked with me like dog from my birth...
Touching its legs on my back...
Who was the best friend to me except it...?
The time gave me...
Mother, Father...
Brother, Sister...
Wife, sons and daughters...
Especially...
Better than a few poetry sentences...
I will read tomorrow the today’s book again and again...
The sentences flying and flying...
Singing the song of yesterday...
Again and again...
In my fiddle of heart...
Singing and Singing...
====================== =====================
Original Telugu poem: -
~~~~~~~~~~~~~~
నిన్నటి దారుల్లోనే నేను
-గరికపాటి మహిందర్.
నాదికాని గ్యారంటీ లేని
రేపటి సంగతి నాకెందుకు.
ఎవడూ కూడా
రేపటిని గురించిన రిజిష్ట్రేషన్ చేయలేడు.
కలల కనండి
ఇన్నాళ్ళ జీవితాన్ని కష్టపడి
ఆపసోపాలు పడుతూ మరీ
రేపటిలోకి మిమ్మల్ని మీరే మోసుకు పొండి.
కాలంపై తూనీగల్లా పల్టీలు కొడుతూనో
కాటుక పిట్టల్లారా చీకటి పాటలు పాడుతూనో
అస్సలు నమ్మకం లేని భవిష్యత్తును
రాత్రి దారులెంట నాటుకుంటూ పొండి.
నాకు మాత్రం
నిన్నటి రోజంటనే వల్లమాలిన ప్రేమ
ఆ గీతాన్నే గుండె మురళిలో ఊదుకుంటూ
రాలిపోయిన జ్ఙాపకాల ఉల్కలను ఏరుకుంటూ
తన్మయం పొందుతాను.
కళ్ళు తెరిచిన రోజునుండి
కాలం నాతోనే కుక్కపిల్లలా కాళ్ళంటుకునే
నా చుట్టూ తిరిగింది.
దీనికి మించిన గొప్ప స్నేహితులెవరుంటారు నాకు.
అమ్మా నాన్నలను
అన్నదమ్ములను
ఆలు బిడ్డలను
అన్నింటికి మించి
నాలుగైదు అక్షరాలను
రవంత కవిత్వాన్నిచ్చింది
ప్రతి రేపటికి
నేటి పుస్తకాన్నే పదే పదే
తిరగేస్తుంటాను.
అక్షరాలు సీతాకోకలుగా ఎగిరే
నేటి పాటనే ప్రతిక్షణం గుండె సారంగిపై
అందుకుంటాను.
****
https://m.facebook.com/groups/653920834726245?view=permalink&id=1340860312698957
English Translation: -
Vilasagaram Ravinder.

very nice Sir
ReplyDeleteThank you Sir.
ReplyDelete