అనువాద సౌరభం-8.
Introduction: -
ఈ కవిత ప్రస్తుత కాలంలో చేనేత కార్మికుల దీని స్థితిని గురించి హృదయ విధారకమైన వారి పరిస్థితిని తెలుపుతున్నది. ప్రస్తుత ప్రభుత్వాలు చేనేత కార్మికుల ఆకలి చావులు తెలిసి కూడా తెలియనట్లే ప్రవర్తున్నయి. ఈ కవిత లో చేనేత పనికి సంబంధించిన అనేక పారిభాషిక పదాలు పూర్తి స్థాయిలో అనువాదం చేయలేక పోయాను. అందుకే నేను స్వేచ్ఛానువాదం ను అనుసరిస్తున్న.
డా. పత్తిపాక మోహన్ గారు సిరిసిల్ల నివాసులు. నేతన్నల మరణాలను ప్రత్యక్షంగా చూసిన వారు. వారి హృదయం మరణవేదన చెంది రాసిన కవిత ఇది. ఊరు కు దూరంగా ఉన్నా ప్రతిరోజూ అనేక మంది నేతన్నల క్షేమ సమాచారం రోజూ తెలుసుకుంటారు.
స్వేచ్ఛానువాదం:
Hanged thread...
Telugu poem : Dr. Mohan Pathipaaka
English translation: Vilasagaram Ravinder.
If fibre cuts we can join it
If thread ruins we can add it
If life thread cuts we can’t join it...
The whole family hard-fought...
They weaves the plus like Sarees
They weaves filigree like Dhotees...
The banners flying in the shoulders
Like coffins...
Learning even no word...
The bundle of beam threads counting
Like skilled worker
The weavers carved with hands
The plumes and the moon like frames...
What curses
What sins
The life beams miscounting...
The weavers
The clothing masters
Are behaving themselves
No one understands any one...
Then
The weavers lives are like the railway lines
They are like beams without threads !
They are threads without fagends...
You can weave warps and woofs ..
Mingled and mingled...
You can down the rainbows
by mixing the colour of threads...
The weaver’s lives are like up and downs...
Sometimes go ups
And sometimes down and down...
The warps and whoofs are mingled and mingled...
The weavers save the decency of other humans
If they meet the death only salvation of their problems...!
Then this is the wrong of
The patched lives of lives
It questioned the death of them...
It must be the wrong of hanged Sirilla also...!
It is the wrong of beams
which do not feed them
even one morning with the rice...!
It is the wrong of the profession,
Which do not feed them
Even one morning with four small rice bits....!!
( the poem is in memory of the dead weavers of Siricilla every day continuously)
======== ========= ========= ===============
Telugu Original poem:
DrPathipaka Mohan
పోగు తెగితే కలిపి అతుకు పెట్టొచ్చు
దారం పురి తప్పితే వడి పెట్టొచ్చు
బతుకు తాడు తెగితేనే కష్టం.
ఇంటిల్లిపాది కష్టపడి
జమలంచు చీరలు, జరంచు దోతులు నేసినా
భుజమ్మీద జండలా ఎప్పుడూ
కఫన్ ఎగురుతూనే ఉంటుంది.
అక్షరం ముక్క నేర్వకున్నా
పుంజాలకు పుంజాలు పోగులు
తప్పులు పోకుండా లెక్కలు కట్టే నేర్పరి.
నెమలీకలు చంద్ర వంకలు చేతితో దింపిన నేతకాడు.
ఏం శాపమో పాపమో
బతుకు పుంజాలే లెక్క తప్పుతున్నాయి.
నేత నేసేటోళ్ళు బట్టలు నేయించెటోళ్ళు
ఎవరికీ వారే అయితే
నేత బతుకులు కలవని రైలు పట్టాల
బద్దెవడని ‘లచ్చన’ పోగులు
పడుగూ పేకల్ని కలినేయొచ్చు.
రంగుల పోగులను
ఇద్రధనుస్సులుగా నేల దింపొచ్చు.
నేత బతుకులే అర్థం కాని వైకుంఠపాళీ.
పడుగు పేకల్ని కలనేసి
మానం కాపాడిన వాడికి
అర్థాంతర మరణం అనివార్యమయితే
పొక్కిలిగా బతుకుతున్న బతుకునే కాదు
చావును కూడా ప్రశ్నార్థకం చేసిన
ఉరిసిల్ల సిరిసిల్లదీ తప్పే!
బుక్కెడు బువ్వ పెట్టని మగ్గానిదీ తప్పె.
నాలుగు మెతుకులు పెట్టని ‘కశ్పి’ది తప్పే.
(ప్రతి రోజు ఆత్మ హత్యలకు పాల్పడుతున్న సిరిసిల్ల నేతన్నల యాది)

No comments:
Post a Comment